Sunday, August 28, 2011

కనులు తెరువక సాగనీ.......!!!

కనులు తెరువక సాగనీ...!!! 
వద్దు వద్దు , ఆ చిరుప్రాయపు
జ్ఞాపకాలు చెరిగిపోనివ్వద్దు
 ఆ విరి వయసుల 
అనురాగాలు చెదిరి పోనివ్వద్దు
ఎదిగీ ఎదగని మనసున 
నిలిచి పోయిన నీ రూపు 
ఏదో తెలియని అలజడిలో
నే పొందిన మై మరపు 
ఇప్పటికీ గుండె మాటున 
చిరు తాకిడి చేసే ఆ తియ్యని తలపు
వద్దు వద్దు కరిగిపోనివ్వద్దు 
ఏళ్ళు గడిచి పోయినా                                                                                    
ప్రాయముడిగి పోయినా
హృది మాటున 

దాగి ఉన్న అమృత ఝరి                                             
                                                                  

ఒక తెలి మంచు తునకలా       
వెలుగుతూ ఉండనీ  అలాగే
ఒక చిరు దీపికలా
ఎద లోతుల మెదలనీ అలాగే
చిరుమువ్వల సవ్వడిలా .....
కనులు తెరవక సాగనీ 
ఒక కమ్మనైన కలలా.....
 ......................................ప్రేమతో...జగతి ... 8.44am 28.11.2002 Thursday 

2 comments:

  1. చెరిగిపోనివ్వని జ్ఞాపకాన్ని మాముందుంచినందుకు ధన్యవాదాలు

    ReplyDelete
  2. ఆ విరి వయసుల
    అనురాగాలు చెదిరి పోనివ్వద్దు

    చాల సున్నితంగా చెప్పారు ...ఎంతో బావుంది.

    ReplyDelete