ఆర్ణవ అగాధాలలో ....
"ఎందుకా మౌనం అమ్మాయికి?"పక్కనే వచ్చి కూర్చుంటూ ఆన్నాడు. గాలికి ఎగిరి పడుతున్న ముంగురులని కూడా సరి చేసుకోకుండా ఏదో దీర్ఘాలోచనలో ఉంది ఆమె.
"ఏంటి ధీరూ ! అంతలా ఆలోచిస్తున్నావ్ " సున్నితంగా ఆమె నుదుటి మీది ము౦గురులను సవరిస్తూ అడిగాడు.
అతని వంక చూసి చిర్నవ్విందే కానీ మనసెక్కడో ఉందని తెలుస్తూనే ఉంది అతనికి. "ఏయ్ అమ్మాయి నువ్వు గలగలా మాటాడుతుంటే బాగుంటుంది కానీ ఇలా బుద్ధిమంతురాలిలా క్లాస్ లో కూర్చున్నట్టు ఉంటే బాగోదు రా" అతని గొంతులోని లాలస.
అతని వైపు పూర్తిగా తిరిగి "అంటే ఏంటీ ఎప్పుడూ నేను వాగుతూ ఉండాలా?" అంది నెమ్మదిగా
ముడుచుకుని కూర్చున్న ఆమె కళ్ళు చాపి ఆమె వొళ్ళో పడుకుని అన్నాడతను "అవునమ్మ నువ్వు ఎఫ్ ఎం లా అలా మాటాడుతుంటేనే బాగుంటుంది.... మౌనం నీకు సూట్ కాదు రా " నవ్వాడు ఆమె నడుము మీద చక్కిలి గిలి పెడుతూ దానితో ఆమె కూడా కదిలి నవ్వింది .
"ఏదన్న చెప్పరా ...అంత దూరం నుండి వచ్చిందీ నీ మాటలు వింటూ నీతో గడపాలనే, అవునమ్మాయ్ అసలు నీకు నేను గుర్తొస్తానా అని "
"అసలు గుర్తు రాని సమయమంటూ ఉండదు కానీ , నిన్ను డిస్టర్బ్ చెయ్యడం నా కిష్టం ఉండదు ...అప్పటికీ తింటూనే ఉంటాగా నీ బుర్ర లోని గుజ్జు ...హహ "
"ఛా లేదురా నువ్వు మాటాడితే వినాలనిపిస్తుంది , నిజం "
"అబ్బ ఛా అంతలేదులే మన మధ్య మొహమాటం ఎందుకు ? ""
"ఏయ్ ! నిన్నొక మాట అడగనా?"
"క్విజ్ మొదలా నాకు "
"పో అయితే ఇంకేమీ మాటల్లేవు "
"అబ్బా ఇప్పటికే బోలెడంత నిశ్శబ్దాన్ని భరించి ఒక్కడినీ కాగి కాగి వచ్చాను తల్లీ నువ్వు కూడా అలిగితే అదిగో ఆ సముద్రమే గతి "
"చాల్లే ఆపు ఎం మాటలవి ! "
"షూట్ యువర్ ప్రశ్నలు మాడం"
"అదిగో మాడం అనోద్దన్నానా "
"లేదు లేదు షూట్ ధీరూ"
"నాలో నీకేంటి ఇష్టం?"
"అబ్బో చాలా క్లిష్టమైన ప్రశ్న ...సమాధనం చెప్పడం అంత వీజీ కాదు "పకపక నవ్వాడు
హాయిగా నవ్వుతున్న అతని చూస్తూ ఉంది పోయింది కాసేపు .
"ఏంటోయ్ అలా చూస్తున్నావ్ ?" అడిగాడు
"నువ్వు నవ్వుతే చాలా హాయిగా ఉంటుంది బాలూ !"
"నువ్వు నవ్వితే చాల అందంగా ఉంటుంది తెలుసా ?"
"ఆ చాలు ...నేనడిగిన ప్రశ్న "
"వామ్మో ఎలా చెప్పాను సమాధానం, నీకీ సముద్రమంటే ఎందుకిష్టమన్న చెప్పగలను కానీ నువ్వంటే ...అయినా ఇప్పుడు ఈ ప్రస్నేంటి రా " మాట తప్పించేసాడు
"అలా కాదు బాలు ఈ ప్రశ్న నేనెప్పుడు నిన్నడగలేదు...ఇవాళెందుకో అడగాలనిపించింది అంతే , ఇష్టం లేకుంటే చెప్పొద్దు"
"అబ్బ ఇష్టం లేక కాదు రా , కష్టం అంటున్నా, సరే చెప్తాను విను నాకు నీ....." ఆమె గుండెల వైపు చూసాడు చిలిపిగా
" ఓయ్ ఆగాగు సారూ ! సమంగా చెప్పు "
"అబ్బ చెప్తున్నాను కదా అన్నీ పాడు ఆలోచనలే పిల్లకి ...."నవ్వాడు
"నాకా పాడు ఆలోచనలు నిన్నూ....."
"నాకు నీ గుండె సవ్వడి ఇష్టం , ఇలా నీ దగ్గరగా నీ వొళ్ళో పడుకుని నీ గుండెల చప్పుడు వినాలనుంటుంది . ఒకోసారి మరీ అనిపిస్తుంది రా "అతని స్వరం లోని మార్దవం ఆమెలో చిరు వణుకు
"అయినా నేను కవిత్వం లో చెప్పగలను కానీ ఇలా మాటల్లో వాక్యాల్లో సమాధానాలు చెప్పలేనమ్మాయ్ "
ఆమె కొంగు కింద చెయ్యి పెట్టి అల్లరి చేసాడు
"ఇదిగో అల్లరి పనులు చేసావంటే నా ..."
"ఆ చేస్తే ఎం చేస్తావ్ " ఆమె పొట్ట మీది మడత లో ముద్దు పెట్టాడు
"నీ చిలిపితనం , ధైర్యం , అన్నిటికీ మించి ఎద లోతుల్ని తడిమే నీ కన్నులలోని అనంతమైన భావాలూ, నీలి నీడలా మేఘచ్చాయలూ ....." తమకంగా ఆమెని తాకాడు .
"నిజం చెప్పు నీకు ఎంత మందో పరిచయం కదా నేను నీకు గుర్తుంటానా అసలు ?"
ఆమె వడి లోంచి లేచి కుర్చున్నాడు .కాళ్ళు రెండు ముడుచుకుని చేతులు కాళ్ళ చుట్టూ వేసుకుని.
"ధీరూ! మనిషికి పరిచయాలు ఎన్నో ఉండచ్చు కొందరు చాల దగ్గరగా వస్తారు , జీవితం లోకి వస్తారు , దేహాన్ని కష్ట సుఖాలనీ పంచుకుంటారు , అయినా కొందరు మాత్రమే జ్ఞాపకంగా మిగులుతారు "
"అవును రా జీవితాన్ని చొచ్చుకు వచ్చిన వారు కొంత కాలం ఉంటారు , మనస్సు చొచ్చుకు వచ్చిన వారు మరి కొంత కాలం, కానీ ఆత్మ చొచ్చుకు వచ్చిన వారు అనవరతం ఉంటారు "
"అబ్బో అమ్మాయిగారు వినిపించేది తాత్వికతా , కవితా ?"
"నిజానికి తాత్వికుడి వి నువ్వే నేను కాదు ...."
"ఏయ్ ఛా తిట్టాలంటే తిట్టు కానీ మరీ ఇలాగా "
"లేదు ఎందుకంటున్నానంటే నువ్వు మనిషిగా ఆలోచిస్తావు , మనిషిగా ఎన్నెన్ని బలాలు , బలహీనతలు ఉంటాయో తెలుసుకుని ఆలోచిస్తావు అందుకే ఏదన్న నీతో పంచుకోవాలనిపిస్తుంది "
"అయితే పద మరి ఇంటికి పోదాము ఇక్కడెందుకు బాగోదేమో "
"హహః ...చాల్లే అల్లరి అసలు మనస్సు ఇవ్వడం అనే కాన్సెప్ట్ నాకు నచ్చదు బాలూ. మనసివ్వడ మేంటి అదేమన్న చక్లాట్టా , ఐస్ క్రీమా ?"నవ్వింది
"నీకో మాట చెప్పనా అసలు మనసన్నదే లేదు ఇది మానవుడు సృష్టించిన దృగ్విషయం. నాడీ మండలాన్నే మనసంటారు"
"నిజం బాలూ సరిగ్గా యు.జి. కూడా ఇదే అన్నాడు "
"అవునా నాకు తెలియదు సుమా "
"అన్నిటికీ కారణమైనది మనస్సు దాన్ని వధించాలి అని జే.కే. అంటే అసలు మనసన్నదే లేదంటాడు యు.జి. చిత్రంగా వీరిద్దరూ మన తెలుగు తాత్వికులు కావడం యాదృచ్చికమైన విచిత్రం కదూ"
"నిజమే అందుకే అన్నిటికీ ఒకటే సమాధానం జీవితాన్ని జీవించి తెలుసు కోవడమే "
"నాకైతే ఎవరితోమనం కంఫర్టబుల్ గా ఉండగాలుగుతామో ఏ భేషజాలు లేకుండా మాటాడ గాలుగుతామో అదే సత్యం ....అంటే.. నీతో ఉన్నప్పుడు స్వచ్చంగా నిన్ను ప్రేమించాగాలగాలి అదే ..నీతోనే రిలేట్ అవ్వాలి ."
"నేను చెప్తుంటా అమ్మాయిలతో మనసు గురించి మాటాడితే మీ మనసు ఎవరి కావలిస్తే వారికిచ్చుకోండి దేహం మాత్రం నాకివ్వండీ అని "
"మనసు దేహం రెండు వేరంటావా? అసలు మనసే లేదన్నావ్ ?"
"ననన్న్నాను అది అందరు నమ్మాలని లేదు గా ...."
"నావరకు దేహమివ్వడమంటే అన్నీ ఇచ్చినట్టే ...."
"నేనూ ఒప్పుకుంటాను ... నువ్వన్నావు చూడు , మనసు ముడి విప్పినంత తేలిక కాదు రవికె ముడి విప్పడం అని ....ఫన్టాస్టిక్ లైన్స్ నాకు చాల నచ్చాయి ..."
"దేహమివ్వాలంటే చాల ధైర్యం కావాలి అనుభూతించే ఆత్మ సంయమనం కావాలి , ధీరూ అందుకే నువ్వంటే నాకు ఇష్టం , మాయ మర్మం లేకుండా మాటాడుతావు "
"నేను అబద్ధాలతో ఆత్మ వంచన చేసుకోలేను బాలు...అది నా బలమో బలహీనతో పోనీ నేనిలాగే ఉంటాను ...పోతాను ..అంతే.."
"నేను నమ్మేది "ప్రేమ" అంతే ....."
"మనసనేది లేక పోవచ్చు కానీ ఎన్ని పేర్లు పెట్టినా ప్రేమ మాత్రం ఉంది అదే లేకుంటే ఇవాళ మనమిలా ఒకటవ్వము...నిజానికి అన్నిటికీ చివరికి యుద్ధాలకి కూడా ప్రేమే కారణం అంటాడు తెలుసా ..."
"ఎవరాయన ?"
"ఎడ్ డెల్ సాప్రియో ...అని తను అతని సహచరి కలిసి రాసిన "అనకండిష నల్ లవ్ "అనే పుస్తకం లో
"దేని పట్లైన, చివరికి మన దేశం పట్ల మనకున్న విపరీతమైన ప్రేమ వల్లే ఈ యుద్ధాలన్నీ అంటాడు...నిజమే కదూ ఈ పోసేస్సివేనేస్స్ లేక పొతే ఏ గొడవ ఉండదు కదూ"
"అసలు ఈ పోసేసివేనేస్స్ లేక పోతే మన అన్న ఫీల్ లేకపోతే ఎందుకు బతకాలి మనిషి చెప్పు ?" ప్రశ్నించాడు
"అదేంటి అందరూ ఈ ఫీలింగ్ ని చంపుకోమనే కదా చెప్తున్నారు "ఆమె కళ్ళలో ఆశ్చర్యం
"అయ్యో పిచ్చీ అదే లేకుంటే మరి నేను నీ దగ్గరికే ఎందుకు రావాలి నా మనిషి అనుకో బట్టే కదా , కాకుంటే ఈ ఫీలింగ్ తో అసూయ మొదలై అది చిచ్చు పెడుతున్న్దన్నది సత్యం. దాన్ని చంపుకోమంటున్నారు అంతే ...ఇది మానవాళి ఉన్నంత వరకు అసాధ్యం నా దృష్టిలో ...."సాలోచనగా అన్నాడు
"ఏమో రా మనసు బాధ కలిగినపుడు ఏదన్న మంచి కవిత కానీ పుస్తకం కానీ చదివినపుడు నీకు చెప్పాలనిపిస్తుంది నీతో పంచుకోవాలనిపిస్తుంది ...దీన్నేమంటారో నాకు తెలియదు... ప్రేమ అనే నేననుకుంటున్నా ..."
"ఖచ్చితంగా అది ప్రేమే నమ్మడూ లేకుంటే నేనెందుకు గుర్తోస్తాను ...."
"హ్మమ్....సరే ఏదైనా నువ్వు మాత్రం ఎప్పుడూ నా హృదిలో మెదులుతుంటావు ..చాల కష్టం మీద నీకు మెసేజ్ కాని కాల్ కానీ చేయకుండా ఉంటాను....ఇదిగో ఇలా నువ్వు నా చెంత చేరినప్పుడు మాటలుగా భావాలన్నీ నీ ఒడిలో ఓంపెసుకుంటాను "
ప్రాణంగా అతని చేయి పైన మణికట్టు పైన ముద్దు పెట్టింది ..
"నాకు నీలో ఓ కవి ఓ భావుకుడు ఓ తాత్వికుడు కనిపిస్తారు ..."
"వాళ్ళందరూ ఎవరూ నా పేరు బాలు అండీ రాణి గారు ....మీరేవేవో పేర్లు పెట్టేస్తున్నారు నాకు "అల్లరిగా నవ్వుతున్నాడు
సాయం కెంజాయలో ఆతని నవ్వు తెరలు తెరలు గా అలల నురుగులా పైకి అగుపడుతున్నా అనంతమైన సముద్ర మధనం అతని హృదయ సంద్రం లో జరుగుతోందని తెలుసు ఆమెకి .
చల్లని చిరునవ్వుతో చిలిపిగా అల్లరి చేస్తూ తనకోసం కాచుకుని ఆరాధనగా అన్నీ ఇచ్చేసే ఆమె లో సముద్రమంత అగాథాలున్నాయని అతనికీ తెలుసు ......!!!
ధరణి వొడిలో కురవాలనే ఆశతో వర్షమై కురుస్తుంది నింగి .....ఆవిరై ఎగసినా మరలా మేఘమై ప్రేమ ప్రయాసతో వానజల్లై కరిగి కురిసి కలిసిపోతుంది తనకై పైకి ఎగరలేకున్నా తనని ఉన్నతంగా నిలిపే తన ధాత్రి లో ...ఈ నిత్య సమాగమెంతటి సుందరమో ఎన్నెన్ని యుగాల అనురాగాబంధమో ...!!!
..................................................................ప్రేమతో ...జగతి 4.22pm Tuesday (valentines day) Feb 14th 2012