Saturday, February 25, 2012

ఆందోళిస్తూనే ...........


ఆందోళిస్తూనే ...........

చేతిలో పట్టుకు మురిసిపోతున్న  
ముత్యాల హారం .....
చటుక్కున తెగి ముత్యాలు 
రాలిపడినట్లు....
రెక్కలొచ్చిన  పిట్ట
ఎగరాలని ప్రయత్నించి 
ఓడిపోయి రెక్కలు  తెగి 
పడిపోయినట్టు ....
గలగలా నవ్వుతోన్న 
పసి పిల్లలు హటాత్తుగా 
మూగపోయినట్టు...
కమ్మని కవితగా
అల్లుకున్న పదాలన్నీ
అక్షరాలుగా విడి విడి గా 
విరిగిపోయినట్టు ...
ఒక రోజు నవ్వుతూ
మాట్లాడే పిల్లలే 
మరునాడు చీత్కరించినట్లు.....
ఎంత మన రాత అని 
సరిపెట్టుకుందామన్నా ....
ఎక్కడో ఏ మూలనో 
ఏదో వెలితి ...
మెలి తిప్పేస్తూ......
ఎంత తప్పుకుందామన్నా
కన్న పేగు ...
అపరాధ భావంతో 
తలదించుకుంటోంది ....
జీవితమంటే ఆకతాయి 
అరుపులు కావని 
ఎలా చెప్పగలను ...
ఒకరి రాతలు మనవి 
కావని ...ఎవరి చేతలు 
వారివేనని తెలిసినా..
ఏమీ చెయ్యలేనని 
ఎరుక గలిగి  ఉన్నా 
ఎంతని నచ్చచెప్పను
కుమిలే హృది కీ.....
కమిలే చెక్కిళ్ళకీ ....
ఆందోళి౦చే అంతర్యానికి
ఎప్పుడూ ఏదో ఒక 
భయం వెన్నాడుతూనే 
సాగుతోన్న జీవనయానానికి.....ప్రేమతో .....జగతి 10.56pm Friday 24/02/2012





1 comment:

  1. బంధాలు బలహీనమైనవనేఅనుమానమో,బాగా బలపడాలని బలీయమైన భావనో .మనసుని మధించి మంచి కవిత్వం వెలయిస్తుంది.మనస్తత్వాలను పరిశీలించి.పరిశోధించి, ప్రవాహగా వస్తున్నా కవిత్వమిది. ఇఇప్రవాహాన్ని సాగనియమ్మ.జగతీ లో కవితా దాహం తీరుతుంది.

    ReplyDelete