Monday, August 29, 2011

ప్రణయ గీతం

మెత్తని నీ సఖి సందిట మేను మరచి పోరా...!!

పల్లవి:   అలసి చేరి నా చల్లని ఒడిని వాలుమా ప్రియా
           సేద తీరుమా సఖా
           స్వేదమారగా....."అలసి" 

చ:     మరుల సిరుల నీ మోము ఖిన్నమాయే నేమిరా
        తేనెలొలుకు కెమ్మొవి మౌనించేనదేలరా   
        మెత్తని నీ సఖి సందిట 
        మేను మరిచి పోరా........"అలసి"

చ:    ఏ లోకపు శోకాలు నిన్నంటక  కాచేరా
       నా ఊపిరి గూటిలోన నిన్ను దాచుకుంటారా
       నీ కలతల కన్నీళ్లు
       ఈ చెలియకు వరమీరా......"అలసి"

చ:   నీ ఆశలు నీ కలలూ నీ జీవన మాధురులు
       కోరబోను ఎన్నటికి నావి కాని ఏ సిరులు
       నీ వేదన వెతలు తీర్చి 
       నిన్ను నిలుపుకుంటారా...."అలసి"

చ:   వేసారి బడలికతో నను చేరగా నీవరిగితే 
      మధుర  బాధ తాళలేక ఎద పానుపు నీవొరిగితే
      పంత మాడనోయి స్వామి
      పరికించకు నా మదిని....."అలసి"

......................................ప్రేమతో జగతి ....11.15pm 06-03-2003 thursday

Sunday, August 28, 2011

కనులు తెరువక సాగనీ.......!!!

కనులు తెరువక సాగనీ...!!! 
వద్దు వద్దు , ఆ చిరుప్రాయపు
జ్ఞాపకాలు చెరిగిపోనివ్వద్దు
 ఆ విరి వయసుల 
అనురాగాలు చెదిరి పోనివ్వద్దు
ఎదిగీ ఎదగని మనసున 
నిలిచి పోయిన నీ రూపు 
ఏదో తెలియని అలజడిలో
నే పొందిన మై మరపు 
ఇప్పటికీ గుండె మాటున 
చిరు తాకిడి చేసే ఆ తియ్యని తలపు
వద్దు వద్దు కరిగిపోనివ్వద్దు 
ఏళ్ళు గడిచి పోయినా                                                                                    
ప్రాయముడిగి పోయినా
హృది మాటున 

దాగి ఉన్న అమృత ఝరి                                             
                                                                  

ఒక తెలి మంచు తునకలా       
వెలుగుతూ ఉండనీ  అలాగే
ఒక చిరు దీపికలా
ఎద లోతుల మెదలనీ అలాగే
చిరుమువ్వల సవ్వడిలా .....
కనులు తెరవక సాగనీ 
ఒక కమ్మనైన కలలా.....
 ......................................ప్రేమతో...జగతి ... 8.44am 28.11.2002 Thursday 

నేను

నిశ్శబ్ద మాధుర్యాన్ని
నీ కేమీ కాను నేను
నిను గన్న అమ్మను కాను
జీవితం  పంచుకున్న అర్ధాంగిని కాను
నీ తోడ బుట్టలేదు నేను
నీ తోడి ఆడిపాడలేదు నేను

ఫలించిన నీ రేతస్సును కాను
గర్వించే నీ యశస్సు నూ కాను
అయినా..............
ఏమీ కాని , నేనే 
నీకు "అన్నీ" అది నాకు తెలుసు
అందుకే చెప్తున్నా
నేను నిన్నావరించిన
"నిశ్శబ్ద మాధుర్యాన్ని"
నీ చుట్టూ....
నీతోనే ఉంటూ...
నీలోనే ఉంటూ.....
నా అస్తిత్వాన్ని పండించుకుంటాను 
.......................................................ప్రేమతో ....జగతి 11.50am 11/12/2002 wednesday 

Sunday, August 21, 2011

వందనం నందనందనా ...!!!

గోప బాలుడై వెలసెను శ్రీహరి ....!!!


పల్లవి:  మురళీ లోలుని చల్లని మోము
           ఎల్ల లోకాలు నోచిన నోము 
           గోప బాలుడై వెలసెను శ్రీహరి 
           ఆపన్నులను గాయుటకే మరి   "మురళీ లోలుని"


చ:     అల్లరి వాడై నల్లని స్వామి
        అల్లన చేసెను లీలలు ఎన్నో  
        కల్లలాడినా గోపకాంతలకు         
        కైవల్యము తా చూపి వరించే     " మురళీ లోలుని"


చ:    అష్ట భార్యలకు ఇష్ట దైవమే
        ఆతని హృదయం  రాధిక వశమే
        భక్తి ప్రేమలా పాలూ వెన్నలు 
        కృష్ణ పూజకవే మనో ద్రవ్యములు   " మురళీ లోలుని"         

చ:    యాగము యుద్ధము రచనలు చేసే
        ధర్మపు నిలుపా వాదులకోర్చే
       యోగ  సారమూ  గీతగ మార్చి
       మనుజులకిచ్చిన మోహనాంగుడు  "మురళీ లోలుని" 

                                      ............................ప్రేమతో ....జగతి  7.10pm sunday 21-08-2011


PARALLEL LINES


To the brims of collapsing dreams
No eyes hang on….
 No dove builds nestle
In deteriorating monologues
Color of the lips is black in the darkness
Touch, an intense feel
No eyes look for
Crammed flowers
Fingers counting the mystic moments seem apathetic
Cloud brings down the deadly music
Time remains a slave working his head down
No feet follow the
Light that shatters into thousands of shadows
Brush that draws dream is vague
No voice hides
Pieces of broken feel
Cracked lips bleed only a song
Angst is the only audience
No dawn blocks
Enveloping shades of darkness
None consents the walls growing around
Is a grave
Life an eternal sonata
No beginning or end
Behind the broken rhythm of a song
No heart forgets its beat----------

Telugu original: Ramakrishna rao
Eng : jagaddhatri   
4.08 pm 13th may 2011 Friday …(in rams office)








Sunday, August 14, 2011

I WANNA FLOW…..


I wanna flow..........

The feature of the frozen heart
Multiplied, multiplied, counted and counted
Something that had solidified
Turned a rain drop into the deluge
Yes, it must melt, move….
From the snows of collective solitude
From this very bad goodness
Into humanness
Into barren lands, fertile fields
Moist dried eyes
How long can I bear
The heavy tear drop that
Doesn’t turn a sugar droplet
At the corner of the eyelid cloud?
In the anklet tinkle of lamps
Where there’s no sound of light
Along the numb streets
How many aeons is this journey of darkness?
Want to teach words
To the songs of air in the dumb bamboo,
Want to tap and
Awaken the spirits of the rivers.

Telugu original: “PRAVAHINCHALANI UNDI” by PASUPULETI GEETHA   Eng trans: jagaddhatri
picture: Akbar  


సారీగాపాదాసా......సాదాపాగారీసా...

సారీగాపాదాసా......సాదాపాగారీసా..("మ"ధ్యలోనే  నిషాదం పలికించిన మోహనరాగం)




విశ్వ భాషాధ్యయనంలో
అగస్త్యునిలా
సాహితీ సంద్రాన్ని 
ఔపోసన పట్టినవారు   
సరిగమపద ఐదు స్వరాక్షరాలూ లిఖించి
మధ్యమం లేకున్నా మధ్యలోనే 
మీ  మేధో గానాన్ని 
"నిషాదం"తో  చిట్ట చివరగా
మీ కవన కచేరీని 
ముగించారు  
మోహన  రాగంలో
నిషాదం పలకదు
అయినా మీ  జీవన ప్రస్థానంలో
నిషాదం ఓ నిష్క్రమణ
సరిగ నడు "మ" పద మంటూ 
అప్పుడప్పుడు మిసిమి లిపిలో 
ఎక్కడైనా మీ చేవ్రాలు కనిపిస్తే  
ఉన్నారులే "మో" అనే భావన 
ఓ సాంత్వన నిచ్చేది 
ఇప్పుడు "మో" ఓ తీయని స్మృతి 
సాహితీ జగాన "మో" అంటే 
అనునిత్య  అధ్యయనశీలి  
ఇక దిగంతాలలోనూ చేస్తూనే ఉంటారు 
అక్కడైనా "మో" గారూ 
"మో"తాదు మించకండి 
కాస్త ఆరోగ్యం జాగ్రత్త సుమా...!
..........................ఇట్లు  ప్రేమతో మీ అభిమాని ...జగద్ధాత్రి 



ఊసులు


చిన నాటి కతలన్ని
ఏ బతుకునైనా
'చితి దాక సాకేటి
సిరి తీపి గురుతులు

అమ్మ కొంగూ చుట్టి
నాన్న చెయ్యి బట్టి
గారాల పట్టినై
పకపకా నవ్వినా
ఆ వయసు జోరులు
నీరెండ  మెరుపులో
ఓ రెండు కళ్ళనూ
ఆకట్టు కున్నట్టి
విరి కన్నె కళలు
ఓ రోజు రాకుంటే
నా రాజు ఏడని
కలతించి వెదకినా
ఆ తీపి వెతలు
జత వీడి మనమని
విధి చేదు చల్లితే
మౌనంగా  తలవంచినా
గుండె బరువులూ

చిన నాడె చివురించినా
వలపు మొక్కనూ
తలపుల్లో పదిలంగా
దాచినా వైనాలు
ఎన్నని నే చెప్పెను
చిననాటి ఊసులు
ఊసులా అవి కావునా ఉసుల రాసులు


                             ప్రేమతో.....జగతి

Monday, August 8, 2011

ఏమని పిలవాలీ ???




మీ లాగ వాక్యాలకు
వొంపు సొంపులు తీర్చి
పదాలకు పరిమళాలను అద్దలేను
వేదనను  వర్ణిస్తూ
అశ్రుధారల హారాన్ని మీలా 
ఏమాత్రమూ ఆవిష్కరించలేను 
మీకవిత పుష్పాల నడుమ
పుప్పొడిగా  పరవశించి పోతాను 
రాగ రంజితంగా ....
మిమ్మల్ని ప్రేమ వాక్యాలతో 
పలకరించాలని
మీ మాటలు వింటూ
కనీసం
మీ వాక్యాలలో
ఓ వ్యాకులతా పదమైనా
కావాలని 
అనుక్షణం తపిస్తాను
మీ పేరు రాయడానికి
ఉద్విగ్న పడే
హృదిని
ఉత్సాహపడే నా ముని వేళ్ళనీ 
మిమ్మల్నిప్రియంగా 
సంబోధించాలని
ఆర్తి పడే మనసునీ
జాలిగా నే వెలువరించే అక్షరాల
కోసం  నిరీక్షించే 
మనో ఫలకాన్నీ 
చూస్తూ ......
ఒక్కసారి మిమ్మల్ని 
పెదవులతో కాకున్నా
నా అనురాగ 
అక్షరాలలో నిక్షిప్తం చెయ్యాలన్న 
దురాశను
అధిగమించలేని అశక్తత
ఆవరించినపుడు
మన   మధ్య   దూరాన్ని  
ఒప్పుకోలేని 
నా దగ్గరితనాన్ని
మీతో  చెప్పలేక  
మౌనంగా 
మనసు  కలాన్ని
ఎన్ని మార్లో 
మర్యాద మూత బిగించి
ఎద  గాయాలను 
దాచేస్తానే  తప్ప  
మీరు  గీసిన  
గీటుని దాటే   ధైర్యం  
లేదు  నాకు 
చివరికి  మీరు దాటమన్నా  సరే.........!!
.........................................................ప్రేమతో....జగతి 5.04pm monday 8-8-2011 













Tuesday, August 2, 2011

ఎలా ..???

ఎలా...????
చెలీ! 

 ఎన్నెన్ని అందాలు 
ఎన్నో భావనలు
ఎన్నెన్నో  కష్టాలు 
ఎక్కడె క్కడివో కన్నీళ్లు 
ఎందరివో చిత్రాలు
చిత్రించానీ చేతితో
కానీ....ప్రియా...!!!
నీ సుమధుర గళాన్ని 
ఎలా చిత్రించను?
అని ప్రశ్నిస్తోంది 
నా చేతిలోని కుంచె
నిస్సహాయంగా ....
నీ దేహ చిత్రాన్ని 
గీశా.....నా ఊహల రంగులద్ది
నిన్నో మరపురాని 
మొనలిసాని చెయ్యగలిగాను
కానీ..........ప్రేయసీ
నీ సుస్వర నాదాన్ని 
చిత్రించాలంటే 
ఎ రంగు వాడాలి
ఏ రూపు నివ్వాలి
సప్త స్వరాలూ పలికే 
నీ తేనె గాత్రానికి
నీ చిలిపి  పలుకులకి 
ఏ వర్ణ మద్దాలి ? 
ఎన్ని రంగులు 
ఎన్ని చాయలు 
మరెన్నికలబోసి
నీ ప్రణయ సౌందర్యాన్ని
ఎ తలపుల కుంచెతో
దిద్ది తీర్చాలి
నీ వొంపు సొంపులు
నీ మేని సొగసులు
చేయి తిరిగిన నా సృజనలో 
ఇమిడి పోయాయి గాని
నీ నవ్వు సందళ్ళు 
నీ మాట పరవళ్ళు 
నీహృది లయలనెలా పలికించాలి
చిత్రకారునిగా అశక్తుడనైనా 
నీ ప్రేమ పాత్రునిగా 
ప్రియతమా....!!!
ఫలించిన  నా చిర మనోహర స్వప్నానివి
నిను నా మనో కాన్వాస్ పై
అనురాగ రంజితంగా
నా వలపు కుంచెతో 
పదిలంగా చిత్రించుకున్నాను 
నా మనో ఫలకం పై
శాశ్వత ప్రేమ కుడ్య  చిత్రమై
ఉంటావుగా....ఎన్నటికీ..
వెళ్లవుగా...నన్నొదిలి....
మన చిత్రానుబంధ మందిరం వీడి 
వెళ్ళవులే   తెలుసు నాకు ...!!!

             ..........................ప్రేమతో...జగతి 5.21pm Tuesday 02-08-2011