Sunday, August 28, 2011

నేను

నిశ్శబ్ద మాధుర్యాన్ని
నీ కేమీ కాను నేను
నిను గన్న అమ్మను కాను
జీవితం  పంచుకున్న అర్ధాంగిని కాను
నీ తోడ బుట్టలేదు నేను
నీ తోడి ఆడిపాడలేదు నేను

ఫలించిన నీ రేతస్సును కాను
గర్వించే నీ యశస్సు నూ కాను
అయినా..............
ఏమీ కాని , నేనే 
నీకు "అన్నీ" అది నాకు తెలుసు
అందుకే చెప్తున్నా
నేను నిన్నావరించిన
"నిశ్శబ్ద మాధుర్యాన్ని"
నీ చుట్టూ....
నీతోనే ఉంటూ...
నీలోనే ఉంటూ.....
నా అస్తిత్వాన్ని పండించుకుంటాను 
.......................................................ప్రేమతో ....జగతి 11.50am 11/12/2002 wednesday 

4 comments:

  1. ఆర్ద్రతతో కూడిన మనసులోతుల్లోంచి పెల్లుబుకిన ప్రేమ మధురిమ. అక్కా . ఇదీ ధాత్రీ గారి శైలి అంటే

    ReplyDelete
  2. ఏమీ కాని , నేనే
    నీకు "అన్నీ" అది నాకు తెలుసు
    Amma claps meeku

    ReplyDelete
  3. thank u sailu uday and john for ur kind response....love j

    ReplyDelete