సారీగాపాదాసా......సాదాపాగారీసా..("మ"ధ్యలోనే నిషాదం పలికించిన మోహనరాగం) |
విశ్వ భాషాధ్యయనంలో
అగస్త్యునిలా
సాహితీ సంద్రాన్ని
ఔపోసన పట్టినవారు
సరిగమపద ఐదు స్వరాక్షరాలూ లిఖించి
మధ్యమం లేకున్నా మధ్యలోనే
మధ్యమం లేకున్నా మధ్యలోనే
మీ మేధో గానాన్ని
"నిషాదం"తో చిట్ట చివరగా
మీ కవన కచేరీని
ముగించారు
మోహన రాగంలో
నిషాదం పలకదు
అయినా మీ జీవన ప్రస్థానంలో
నిషాదం ఓ నిష్క్రమణ
సరిగ నడు "మ" పద మంటూ
సరిగ నడు "మ" పద మంటూ
అప్పుడప్పుడు మిసిమి లిపిలో
ఎక్కడైనా మీ చేవ్రాలు కనిపిస్తే
ఉన్నారులే "మో" అనే భావన
ఓ సాంత్వన నిచ్చేది
ఇప్పుడు "మో" ఓ తీయని స్మృతి
సాహితీ జగాన "మో" అంటే
అనునిత్య అధ్యయనశీలి
ఇక దిగంతాలలోనూ చేస్తూనే ఉంటారు
అక్కడైనా "మో" గారూ
"మో"తాదు మించకండి
కాస్త ఆరోగ్యం జాగ్రత్త సుమా...!
..........................ఇట్లు ప్రేమతో మీ అభిమాని ...జగద్ధాత్రి
evarandi eena
ReplyDelete