" మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి ..." చిలిపిగా అంది
" హహహ చాల్లే నేనే నంబర్ చేసానో నాకు తెల్సు కానీ .... ఏంటీ కోపమా ..." అంత లాలనగా అడిగితే కోపమా అబ్బే అదెప్పుడో రింగ్ టోన్ వినగానే పోయింది కదా.
అయినా బింకంగా " కోపం ఏమీ లేదు ... కొద్దిగా బాధ అంతే.." ఎంతగా మామూలుగా చెప్దామనుకున్నా చలింపు స్వరం లో తనకే తెలుస్తోంది.
కాస్త సర్దుకుని ..." ఎప్పుడు వచ్చేదీ ? " ఆత్రంగా అడిగింది
" ఇప్పుడప్పుడే అయేలా లేదురా , ఈ నెలాఖరు అవుతుందేమో ...." చెప్పాడు.. అతని స్వరం లో ని భావాన్ని పట్టుకోవడం కష్టం.
" అయ్యో అవునా ... పదవ తేదీ తర్వాత వస్తాను అన్నావ్ "...నిరాశ
" అదే చెప్పేది మరి పదవ తేదీ తరవాత ఎప్పుడవుతుందో మరి డేట్ చెప్పలేదుగా ..." నవ్వేడు
మౌనం ..... నిశ్శబ్దం ఇద్దరి నడుమా
" ఏయ్ ఏంటీ ఉన్నావా ? మాటాడు పదిహేను రోజుల తర్వాత ఇవాలే తీరింది నాకు ... మాట్లాడురా ..." బుజ్జగింపు
" ఏమి మాటాడను ... ఏమీ లేదు ...." నిర్లిప్తంగా నిరాశ ఆమె స్వరం లో
" అబ్బా మాటాడరా మరీ ఏంటి చిన్నపిల్లలా వస్తానుగా ....."
" బాలూ.... నాకు నువ్వు కావాలి ... చూడాలి నిన్ను ... నీ చేతుల్లో చచ్చిపోవాలనుంది " ఆగి ఆగి వెక్కి పడుతోన్న మనసుతో
" ఏయ్ మెంటల్ ....ఏంటా మాటలు ..."
" నిజం నా గురించి నువ్వేమనుకుంటావు ..."
" చెప్పాగా మెంటల్ అనీ ....." పకపక నవ్వేడు
ఆమె మాటలాడలేదు మళ్ళీ తనే అన్నాడు
" ఏంటీ చచ్చిపోతావా? ఓకే ఐతే రెడీ గా ఉండు ఇద్దరం చచ్చిపోదాము ఓకే నా ..." హాస్యం తో కూడిన లాలన
" బతాకాలని లేదు నాకు ..... నువ్వెందుకు చావడం " ఉక్రోషంగా అంది
" నాకూ లేదు రా ... బతకాలని అందుకే వస్తాగా ఇద్దరం చచ్చిపోదాం "
" మరి నువ్వొస్తే మనిద్దరం దగ్గరైతే అప్పుడు ఇంకేదో అయితే అప్పుడు ..... బతకాలనిపిస్తే ..."
" హహహహ్హహా అందుకే అన్నా మెంటల్ అని ....చాల్లే చావు కబుర్లు జీవితం గూర్చి చెప్పు ఎమన్నా "
" నాకా ఏమీ లేవు ... "
" మృత్యువొక్కటే సత్యం రా ... అది వచ్చేటప్పుడు వస్తుంది ... దాని కోసం ఆత్ర పడక్కర్లేదు ..." గంభీరంగా పలికిన్దతని గొంతు
" నిజమే బాలూ. .. అయినా నేను నీ లా జ్ఞానిని కాదుగా ఏదో అలా బతికేస్తున్నా .... ఒక్క మాట అడగనా?" ఆత్రం
" అడుగు ....."
" ఒక్కసారి నువ్వు నావాడివి అనుకోవచ్చా నేను "
" దానికి పెర్మిషణ్ ఎందుకు అనుకో...." నవ్వేడు
" అబ్బ అది కాదు ... నువ్వెప్పుడైనా నన్ను నీదానిగా అనుకోవెందుకని?"
" ఎందుకిప్పుడిదంతా అసలీ సొంతం పరాయీ ఇవన్నీ అవసరమా చెప్పు .... మనిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం అంతే "
" అంతే ప్రేమగా ఒక్కసారి నువ్వు నాదానివని నేను నీ వాడినని అనొచ్చుగా ...."
" అబ్బ నువ్వు ఇలా మాటాడవే ఎప్పుడూ ... నాకీ మెలోడ్రామ నచ్చదు...ఆడాళ్ళకి అదే ఇష్టం ... నాకు ఇష్టమైతే ఇష్టం లేకుంటే చెప్పేస్తా నాకు నువ్వు వద్దమ్మ విసిగించకు అని ....మనకి మొహమాటం తక్కువ కదా ..."
" ఓయ్ ! నాకీ మెలోడ్రామాలు అసలు నచ్చవు ఏదో మాటడుదామని అన్నా అంతే ... నన్నూ ఆ లిస్టు లో కలిపెయ్యకు సుమా "
" నాకు తెలుసు రా నువ్వు ఆ లిస్టు లో లేవు లే హహహ"
" సరే ఏమి చేస్తున్నావు , అవును కధలేందుకు రాయవు నువ్వు ?..."
" ఎందుకు రాయను రాస్తానే ...రాసాను చాల అచ్చైనాయి కూడా "
" అసలీ ఫేస్ బుక్ వచ్చి మనుషుల్ని చెడ గొట్టిన్దనుకో ఎంచక్కా రాసుకునే వారు ఇది వరకు ఇప్పుడు ... మీ అడాల్లేదో ఒక బొమ్మో వాక్యమో పెట్టడం దానికి ఆహా ఓహో అని అందరి కామెంట్లూ...."
" ఓయ్ ఓయ్ జోరు తగ్గించబ్బాయ్ అసలు మనం పరిచయమైంది కూడా ఇందులోనే ....మర్చిపోకు..."
" ఓకే పరిచయమైనా వెంటనే వారం రోజుల్లో మీ ఊరు వచ్చాను కదా అమ్మాయ్?"
" వస్తే ..నాకోసమా నీ పని మీద వచ్చావ్ ..."
" ఏయ్ గమ్మునుండు ... నేను వచ్చిందీ నీకోసమే ... రెండు సార్లూ వచ్చిందీ నీ కోసమే .... కాదని చెప్పు హహ్హ సరేలే వదిలేయ్"
" ఏమి చదువుతున్నావ్ ?"
" ఏదో బుక్ మీద వర్క్ చేస్తున్న ఈ మధ్యనే ... లత మోహన వంశి గూర్చి మాటాడా "
" ఇటీవల నాకు నచ్చిన మంచి ఫిలోసోఫేర్ ని చెప్తాను చదువు నీకు నచ్చ్చుతాడు , బామన్ తన పుస్తకం " లిక్విడ్ మాడర్నిటీ" ఆర్టికల్స్ చాల బాగున్నాయ్ చదవరా అసలు ఈ ఆధునిక యుగం లో యువత ఏమి కోరుకుంటున్నారు ఏంటీ అన్నది సామజిక శాస్త్రవేత్తగా చాల బాగా డిస్కస్ చేసేడు. నాకు బాగా నచ్చాడు.."
" ఓకే తప్పకుండ చదువుతా ... తాత్వికా... మనోవైజ్ఞానిక కోణం లో కొన్ని రచనలు స్టడీ చేస్తున్నా ... రాయాలి ఇంకా "
" అసలే మెంటల్ వి ఇంకా నీకా స్టడీ లెందుకు హహః"
" హహః నిజమేలే నేను మెంటలే ..ఒప్పేసుకున్నా "
" ఏయ్ ఏదన్న ఒప్పేసుకుంటావా ... నీ గురించి నాకు తెలీదా ఏంటీ... ఉరికే అన్నా రా ... "
" నాకు తెలుసు సార్.... నా కవితల పుస్తకం తెద్దామని అనుకుంటున్నా మిత్రురాలు ఒకామె బాగా ప్రోత్సహిస్తోంది ..."
" మరింకేమైతే తప్పక తీసుకురా ... వేరి గుడ్ "
" సరేలే ... ఆలోచిద్దాం ... యు.జి. మీద ఎవరో ఈ మధ్య వర్క్ చేసారు అయన కొటేషన్స్ తెలుగు లో చేసారు, అయన మీద ఇంతకు ముందు నేను వర్క్ చేశాను కదా ... ఆ బుక్ కూడా ఆవిష్కరణ ఉంది "
" అవునా గుడ్ ... ఒక ఫ్రెండ్ ఉన్నాడు రూం లో ఇక పడుకోనా"
" ఓహో చెప్పవేమీ ... ఆ అమ్మయినలా కూర్చోబెట్టి మాటాడు తున్నావా టైం వేస్ట్ కదా ఎంజాయ్ "
" హే ! మెంటల్ నా గురించి ఎందుకల అనుకుంటావ్ ఉన్నది అబ్బాయ్ ... వాడు హైదరాబాద్ నుండి వచ్చాడు నా కోసం ..."
" సరే సరే .... ఏదన్న ఎవరన్న ... పాపం ఆయనకీ చెప్పు ఓ మెంటల్ అండీ నాకోసం కలవరిస్తుందీ అని .. లేకుంటే మళ్ళీ ఆమె అపార్ధం చేసుకుంటుంది పాపం ...."
" అబ్బా గమ్మునుండు ... అమ్మాయి కాదురా అంటే....వినవు కదా ..నిన్నూ.."
" ఓకే ఓకే ఎవరైనా నేను చెయ్యగలిగేది ఏమీ లేదులే కానీ ...బజ్జో ....ఇంకేమన్నా ...నీ కౌగిలి లో నలిగి పోవాలనుంది...ఆ అదృష్టం ఇవాళ ఆవిడకి ప్చ్ ప్చ్.."
" ఏయ్ పిల్లా నా కౌగిలిలో నలిగి పోయేది దిండు మాత్రమే ఇంకెవరూ లేరిక్కడ ....బజ్జో నువ్వు కూడా"
" నేను నిద్ర .... వద్దులే ప్రయత్నించడం విఫల మవడం ఎందుకు ...నువు చెప్పావుగా ఎవరినో చదవమని అయన దగరికి వెళ్తా "
" యా సరే మరైతే ఉంటా .... చదువుకో ... ఆరోగ్యం కొంచం ....చుసుకోరా..."
ఒక్క క్షణం నిశ్శబ్దం ..... ఫోన్ కట్ చేసిన శబ్దం
................................................................ప్రేమతో ...జగతి 5.23pm Sunday 7th Oct 2012