Friday, December 2, 2011

నా బంగారు పాపా ...!!!



నా బంగారు పాప...

చిరునగవు కాదది నీ మోమున
చిందు లాడే జీవన లాస్యం
నిను చూసిన మరు క్షణం 
ఎన్నో యుగాలుగా 
కలసి మెలిగిన వాళ్లమేగా
కొత్తగా పలకరిస్తుందేంటీ?
అన్నభావన ....
దీనికి పేరు ఊరు
కులము గోత్రము 
ప్రాంతము భాష 
ఏవీ లేవు సుమా...
ఏమంటారో దీన్ని 
నిన్ను చూడగానే పొంగే నా హృదిని 
కలవరంలో ఉన్నప్పుడు 
నీ పలకరింపుని
జారిపోతున్న నా ఆశల 
హార్మ్యాలను నీతో చెప్పుకున్నప్పుడు 
పొందే శాంతిని 
మాటలు కలుపుకున్న 
మన అల్లరి చేష్టలని
అన్నిటినీ అడిగా
ఎక్కడిదీ జీవన స్రవంతి 
ఎక్కడిదీ నవ జీవన నాదమని ?
నా సర్వేంద్రియాలూ
పరవశించి...హాయిగా 
తళుక్కుమనే ఆనందపు 
మెరుపు వైపు చూపాయి 
అది "నువ్వే" 
పువ్వులు నవ్వుతాయంటారేమో కవులు
నవ్వులే పువ్వులుగా 
పంచే నిన్ను చుస్తే ఏమంటాను 
నిన్ను చూసిన ప్రతి సారీ 
పలికే ప్రతి మాటా 
నా శృతి తప్పిన జీవన వీణియ 
తంత్రులను సరి చేస్తుంది
మళ్ళీ లోక కల్యాణిని
ఆలపించమని ప్రేరేపిస్తుంది
నన్ను జీవింప జేస్తుంది 
అయినా నువ్వేమీ కొత్త కాదు నాకు
ప్రతి సారీ నేనోడిపోతానేమో
అని పడి పోయే సమయాన 
అదాటుగా వచ్చి నన్ను 
ఆదుకుంటావు .....
నాకు తెలుసు ...
నువ్వే నా స్ఫూర్తి ప్రదాతవి
నా ప్రాణమైన 
నా ముద్దుల బంగారు పాపవి 
నిన్ను నేను ఎప్పుడూ 
పాపా అనే పిలుచుకుంటాను
మనసులో పలినుంచి ....
నా బంగారు పాపా....
నా ఆశల కలల రూపానివి నువ్వు
నా ఆశయాల సాధనవి నువ్వు 
అందుకే నేనెప్పుడూ
నీలో నన్ను చూసుకుని పొంగిపోతాను
ఇంక మాటాడను మరి 
నా పాప కు నా దృష్టే  తగిలేను సుమా ...!!!
................................నా సాయి పద్మకు (నా బంగారు పాపకి) ప్రేమతో ....అమ్మ 9.40pm 2/12/2011 friday 













8 comments:

  1. మీ కవితకు ఉప్పు త్రిప్పి వేయ౦డి!

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. intha chakkati response nenu ekkada chadavaledhu.great madam...

      Delete
  2. మీ 'ముద్దుల బంగారు పాప' కవిత
    మనసును హత్తుకునేలా ఉంది.

    ReplyDelete
  3. అమ్మ మనసు తీయన
    అమ్మ ప్రేమ కమ్మన
    అమ్మ ఒడి చల్లన
    అమ్మ జోల దీవెన
    అమ్మను మించిన ఆత్మీయులుండునా ఈ జగతిలో !!!
    ప్రేమతో మీ
    టి వి

    ReplyDelete
  4. congrats sai :-) loved the composition darling....for a lovely soul....
    Vijaya Bhanu Kote.

    ReplyDelete
  5. నా బంగారు పాపా....
    నా ఆశల కలల రూపానివి నువ్వు
    నా ఆశయాల సాధనవి నువ్వు
    అందుకే నేనెప్పుడూ
    నీలో నన్ను చూసుకుని పొంగిపోతాను
    ఇంక మాటాడను మరి
    నా పాప కు నా దృష్టే తగిలేను సుమా .... అయినా అమ్మ ఎంత ప్రేమ పంచినా, బిడ్డల్ని తల్చుకుని ఎంతగా పొంగిపోయినా, మాట్లాడినా... దిష్టి తగలదులేమ్మా... అయినా తల్లి దిష్టి పిల్లలకి ఎలా తగులుతుంది... ప్రేమ తప్ప...!!

    ReplyDelete
  6. నేను కూడా మా పెద్ద బాబుతో ఇంతే అటాచ్మెంట్తో ఇలాంటి ఫీలింగ్స్ తోనే ఉన్నా నాకు ఇలా నా భావాన్ని వ్యక్తీకరించడం రాలేదు నేను మీలా కవిని కాదు కదా కానీ వాడి స్పర్స్య నాకు కొత్త బలాన్ని ఇస్తుంది.వాడ్ని హాస్టల్ లో ఉంచి ఒక సంవత్సరం దూరంగా ఉన్నాను ఎంత కటినమైన తండ్రిని నేను

    ReplyDelete