నా పెదవులపై విరిగిన పాలలాంటి నవ్వు గా........ |
మనసు వాయు వేగంతో ఆలోచిస్తోంది
పరుగులు పెడుతోంది
ప్రతి రాత్రీ ఎన్నెన్నో
యాత్రలు చేస్తుంది
ఎన్నో ఊసులు చెబుతుంది
మరెన్నో కధలల్లుతుంది
ఎన్నో కవితలు రాయమంటోంది
లెక్కకు మించి గీతాలు
స్వరాల వెల్లువ
పాటల పరిమళాలతో
మది పల్లవిస్తుంది
ఆలోచనల్లో పొందిన
మాధుర్యాన్ని కలంతో
రాద్దామని ప్రయత్నిస్తే
కదలనని కరం మొండి కేస్తుంది
దేహం సహాయ నిరాకరణ
చేస్తుంది ......
నిస్సహాయంగా
కనులు వర్షిస్తాయి
కన్నీళ్ళతో బాటూ
భావాలన్నీ అలుక్కు పోతాయి
అసహాయంగా ఏమీ లేకుండా
రిక్త హృదయం తో చూస్తూ
ఉండి పోతాను...
ఎంత గా సరి పెట్టుకుందామని
విశ్వ ప్రయత్నం చేసినా
కాలం కలసి రాని
నా కలం ....
నన్ను జాలిగా చూస్తుంది
విరిగిన నా స్వప్న శకలాలు
నిస్తేజంగా నిర్లిప్తంగా...
పొగిలి .....పెగలని నా పెదవులపై
విరిగిన పాలలాంటి నవ్వుగా
పరావర్తనం చెందుతాయి.........!!!
........................................ప్రేమతో....జగతి 3.08 pm 6/12/2011 tuesday (rams office)
వాయువేగం అక్షరాలలో నింపి పరుగెట్టించడం
ReplyDeleteఓ అద్భుత నైపుణ్యం
దాన్ని ఎరిగినవారు మీరు
ఇక ఏమి చెపాలి మేము
చదవడం తప్ప.....
అందమైన ముఖానికి
అలంకరణ మరింత శోభనిస్తుంది
మీ కవిత్వంకూడా పాదాల విరుపుల అలంకరణ
అవసరం అని నాకు అనిపిస్తుంది
అభినందనలు
విరిగిన నా స్వప్న శకలాలు
ReplyDeleteనిస్తేజంగా నిర్లిప్తంగా...
పొగిలి .....పెగలని నా పెదవులపై
విరిగిన పాలలాంటి నవ్వుగా
పరావర్తనం చెందుతాయి.........!!!
అంటె మీ పెదవుల నవ్వులన్ని మీ కవితలు మీరు రాయాలనుకున్న భావలేనన్నమాట
baagundi aa penugulaatanu akshareekarinchadam...!
ReplyDeleteధాత్రి గారూ,
ReplyDeleteమీ కవితలు అప్పుడప్పుడు చదువుతూంటాను.ఒక విషయం లో మీ సాయం కావాలి. ఆర్ధికపరమైంది కాదు.
మీ ఈమెయిల్ ID తెలియకపోవటం వల్ల, ఇలా బ్లాగు ముఖంగా అడుగుతున్నాను.
మీకు వీలవుతుందనిపిస్తే , నాకు మెయిల్ చెయ్యగలరా ప్లీజ్?
యీ కామెంట్ లో నా ID వుంది కనుక పబ్లిష్ చెయ్యకండి .లేదా డిలీట్ చేసెయ్యండి.
నా ID : sreedevi.c8@gmail.com
Thank you
భావాలను వేలికితియాలంటే మీ కవితలు చదివితే చాలు అవే పొంగి పోరులుతాయి . సునితమయిన భావాలను అందమయిన అక్షరాలతో సంధించారు .... సరస్వతి కటాక్షులు మీరు ......
ReplyDeleteప్రేమతో మీ
టి వి
"కాలం కలసి రాని
ReplyDeleteనా కలం ....
నన్ను జాలిగా చూస్తుంది" అక్షరమాంత్రికులు మీరు.కలాన్ని మంత్రదండంగా చెయ్యడమంటె ఇదే...అందరికీ సాధ్యమయ్యేదికాదుగా. జగతి ఒకటె.
viriginapaalu, vinnapaalu okatae kaadu.konnisaarlu viriginapaalato junnu vastundi.alaanti "virigina paalae " ee kavitha ani maabhaavana.vivaekavantamaina jeevitaaniki idi oka ada nivaedana. avalokistaaru kadu.
ReplyDelete