Tuesday, April 3, 2012

dhaathri ధాత్రి: ఆమట్టునే...అలా....

dhaathri ధాత్రి: ఆమట్టునే...అలా....

ఆమట్టునే...అలా....






మిట్ట మధ్యానం కోసిన విరజాజి మొగ్గల్లా
వసి వాడని పసి పరిజాతాల్లా 
నా చుట్టూ గుట్టలుగా 
చెల్లా చెదురుగా 
రాసులుగా పోసి ఉన్నాయి 
అక్షరాలు....

స్వేచ్చగా హాయిగా 
ఆదమరిచి నిదరోతున్న 
చంటి బిడ్డల్లా...స్వప్నాల్లో తేలుతూ ..


ఎండనక వాననక 
కేరింతలు కొడుతూ....
ఆటలాడుకునే ఆకతాయి 
పిల్లల్లా.....అక్షరాల పిల్లకాయలు
అల్లరి చేస్తూ.... నా హృదయవరణ౦లో 
గుట్టలుగా గుణింతాలతో ...
నడక నేర్చిన  పసి పాపల  మల్లె 
గునగున లాడుతూ 
తిరుగాడుతున్నాయి పదాలు 
పేరంటానికి పోయే 
నిండు ముత్తైదువలల్లే 
హడావిడి గా అలంకరించుకుంటున్నాయి 
నా మదినిండా వాక్యాలు 

కలం సూదిలోకి 
కాలం దారాన్ని ఎక్కించి 
కవితగా కూర్చుదామని 
కూర్చున్నా.....
అందంగా ఆనందంగా
ఆడుకుంటోన్న అక్షరాలనూ
ఆదమరిచి ఆనందిస్తోన్న పదాలనూ
హడావిడి పడుతూ సాగిపోతున్న వాక్యాలనూ
చూస్తూనే ....అలా చూస్తూనే
ఉండి పోయా......చిత్తరువునై...

అక్షరాల గమ్మత్తు చిత్రాలలో 
నన్ను నేను వెదుక్కుంటూ 
కలాన్ని, కాల దారాన్నీ దాచేసా .....
స్వేఛ్చ ఎవరికైనా కావల్సిందేగా మరి....
..................................................ప్రేమతో   ...జగతి ....4.13pm Tuesday 03/04/2012