ఉండుండీ ఎందుకో హఠాత్తుగా
మనసు మూగ బోతుంది
నీ మనసును అర్ధం చేసుకోవడం లో
మునిగిపోతుంది ...
నా అంచనాలకు దొరక్కుండా
ఒక అద్భుత హఠాత్ పరిణామం లా
ఆవిష్కరింపబడాలని నీ ఆలోచన
అందుకే మన మధ్య
ఉల్లి పొర లాంటి యవనిక
వేస్తావు
చిరునవ్వుతోనో , లేక చిరు కోపం తోనో ...
అప్పుడే నీ హృదయ భావం అంది
నేను భావోద్విగ్నతతో కదిలి పోతాను
అబద్ధమాడకుండా , నిజం చెప్పకుండా నీవు
నిజం అర్ధమైన అయోమయం లో నేను
ఎక్కడో చెలిమి శిఖరాగ్రం వద్ద
ఇద్దరు అపరిచితుల్లా కలుసుకుంటాము
దాచలేని మమతతో నేను
మమత దాచే యత్నం లో నీవు
ఎప్పుడూ ఇలా ,విడి, కలిసి , విడి ,కలిసిపోతుంటాం
విడి విడిగా ఏకమై
ఏకం లో మమేకమై ఎప్పటికీ ....!!!
.............................................................జగద్ధాత్రి
09/10/2013 1.11పి.ఏం బుధవారం
very nice
ReplyDeletechala bagundi
ReplyDeleteఎప్పుడూ ఇలా ,విడి, కలిసి , విడి ,కలిసిపోతుంటాం
ReplyDeleteవిడి విడిగా ఏకమై
ఏకం లో మమేకమై .. nice n touchy poem jagathi.. kudos ..
నిజంగా నిజం .. చాలా బావుంది జగతి గారూ
ReplyDeleteLeka pothe Keratalu elaga vasthayi?
ReplyDeleteTouching one.vidi vidiga yekamai yekamlo mamekamai yeppatiki.
ReplyDeleteKeratalu yela vasthayi!!!. How meaningful it is !!!.