ఎన్నెన్ని అందాలు
ఎన్నో భావనలు
ఎన్నెన్నో కష్టాలు
ఎక్కడె క్కడివో కన్నీళ్లు
ఎందరివో చిత్రాలు
చిత్రించానీ చేతితో
కానీ....ప్రియా...!!!
నీ సుమధుర గళాన్ని
ఎలా చిత్రించను?
అని ప్రశ్నిస్తోంది
నా చేతిలోని కుంచె
నిస్సహాయంగా ....
నిస్సహాయంగా ....
నీ దేహ చిత్రాన్ని
గీశా.....నా ఊహల రంగులద్ది
నిన్నో మరపురాని
మొనలిసాని చెయ్యగలిగాను
కానీ..........ప్రేయసీ
నీ సుస్వర నాదాన్ని
చిత్రించాలంటే
ఎ రంగు వాడాలి
ఏ రూపు నివ్వాలి
సప్త స్వరాలూ పలికే
నీ తేనె గాత్రానికి
నీ చిలిపి పలుకులకి
ఏ వర్ణ మద్దాలి ?
ఎన్ని రంగులు
ఎన్ని చాయలు
మరెన్నికలబోసి
నీ ప్రణయ సౌందర్యాన్ని
ఎ తలపుల కుంచెతో
దిద్ది తీర్చాలి
నీ వొంపు సొంపులు
నీ మేని సొగసులు
నీ ప్రణయ సౌందర్యాన్ని
ఎ తలపుల కుంచెతో
దిద్ది తీర్చాలి
నీ వొంపు సొంపులు
నీ మేని సొగసులు
చేయి తిరిగిన నా సృజనలో
ఇమిడి పోయాయి గాని
నీ నవ్వు సందళ్ళు
నీ మాట పరవళ్ళు
నీహృది లయలనెలా పలికించాలి
చిత్రకారునిగా అశక్తుడనైనా
నీ ప్రేమ పాత్రునిగా
ప్రియతమా....!!!
ఫలించిన నా చిర మనోహర స్వప్నానివి
నిను నా మనో కాన్వాస్ పై
అనురాగ రంజితంగా
నా వలపు కుంచెతో
పదిలంగా చిత్రించుకున్నాను
నా మనో ఫలకం పై
శాశ్వత ప్రేమ కుడ్య చిత్రమై
ఉంటావుగా....ఎన్నటికీ..
వెళ్లవుగా...నన్నొదిలి....
మన చిత్రానుబంధ మందిరం వీడి
వెళ్ళవులే తెలుసు నాకు ...!!!
..........................ప్రేమతో...జగతి 5.21pm Tuesday 02-08-2011
baagundi
ReplyDelete