చిన నాటి కతలన్ని
ఏ బతుకునైనా
'చితి దాక సాకేటి
సిరి తీపి గురుతులు
అమ్మ కొంగూ చుట్టి
నాన్న చెయ్యి బట్టి
గారాల పట్టినై
పకపకా నవ్వినా
ఆ వయసు జోరులు
నీరెండ మెరుపులో
ఓ రెండు కళ్ళనూ
ఆకట్టు కున్నట్టి
విరి కన్నె కళలు
ఓ రోజు రాకుంటే
నా రాజు ఏడని
కలతించి వెదకినా
ఆ తీపి వెతలు
జత వీడి మనమని
విధి చేదు చల్లితే
మౌనంగా తలవంచినా
గుండె బరువులూ
చిన నాడె చివురించినా
వలపు మొక్కనూతలపుల్లో పదిలంగా
దాచినా వైనాలు
ఎన్నని నే చెప్పెను
చిననాటి ఊసులు
ఊసులా అవి కావునా ఉసుల రాసులు
ప్రేమతో.....జగతి
No comments:
Post a Comment