మీ లాగ వాక్యాలకు
వొంపు సొంపులు తీర్చి
పదాలకు పరిమళాలను అద్దలేను
వేదనను వర్ణిస్తూ
అశ్రుధారల హారాన్ని మీలా
ఏమాత్రమూ ఆవిష్కరించలేను
మీకవిత పుష్పాల నడుమ
పుప్పొడిగా పరవశించి పోతాను
రాగ రంజితంగా ....
మిమ్మల్ని ప్రేమ వాక్యాలతో
పలకరించాలని
మీ మాటలు వింటూ
కనీసం
మీ వాక్యాలలో
ఓ వ్యాకులతా పదమైనా
కావాలని
అనుక్షణం తపిస్తాను
మీ పేరు రాయడానికి
ఉద్విగ్న పడే
హృదిని
ఉత్సాహపడే నా ముని వేళ్ళనీ
మిమ్మల్నిప్రియంగా
సంబోధించాలని
ఆర్తి పడే మనసునీ
జాలిగా నే వెలువరించే అక్షరాల
కోసం నిరీక్షించే
మనో ఫలకాన్నీ
చూస్తూ ......
ఒక్కసారి మిమ్మల్ని
పెదవులతో కాకున్నా
నా అనురాగ
అక్షరాలలో నిక్షిప్తం చెయ్యాలన్న
దురాశను
అధిగమించలేని అశక్తత
ఆవరించినపుడు
మన మధ్య దూరాన్ని
ఒప్పుకోలేని
నా దగ్గరితనాన్ని
మీతో చెప్పలేక
మౌనంగా
మనసు కలాన్ని
ఎన్ని మార్లో
మర్యాద మూత బిగించి
ఎద గాయాలను
దాచేస్తానే తప్ప
మీరు గీసిన
గీటుని దాటే ధైర్యం
లేదు నాకు
చివరికి మీరు దాటమన్నా సరే.........!!
.........................................................ప్రేమతో....జగతి 5.04pm monday 8-8-2011
bavundamma. meeru matrame rayagala kavita idi
ReplyDeletestriking poem..specially last lines..!
ReplyDelete