గోప బాలుడై వెలసెను శ్రీహరి ....!!! |
పల్లవి: మురళీ లోలుని చల్లని మోము
ఎల్ల లోకాలు నోచిన నోము
గోప బాలుడై వెలసెను శ్రీహరి
ఆపన్నులను గాయుటకే మరి "మురళీ లోలుని"
చ: అల్లరి వాడై నల్లని స్వామి
అల్లన చేసెను లీలలు ఎన్నో
కల్లలాడినా గోపకాంతలకు
కైవల్యము తా చూపి వరించే " మురళీ లోలుని"
చ: అష్ట భార్యలకు ఇష్ట దైవమే
ఆతని హృదయం రాధిక వశమే
భక్తి ప్రేమలా పాలూ వెన్నలు
కృష్ణ పూజకవే మనో ద్రవ్యములు " మురళీ లోలుని"
చ: యాగము యుద్ధము రచనలు చేసే
ధర్మపు నిలుపా వాదులకోర్చే
యోగ సారమూ గీతగ మార్చి
మనుజులకిచ్చిన మోహనాంగుడు "మురళీ లోలుని"
............................ప్రేమతో ....జగతి 7.10pm sunday 21-08-2011
nice to read
ReplyDeletebest wishes
wow super jagatii
ReplyDeleteashtabhaaryalaku ishtadaivame chaalaabaavundi
naakuu kavitalante baagaane pichi..evaru raasinaa elaaunnaa chadivestaanu..ika ilaa manasunu dochukonelaa unna kavitalu naamanasuku hattukonnelaa unnaayi
ReplyDeletechaalaa thankse dhaatrii manchi kavitato mammalni aanandaparichinanduku :)
chala bavundi thank you dhatri
ReplyDelete