అందంగా కవితనల్లలేనేమో
కానీ స్వచ్ఛంగా ప్రేమించగలను
అద్వితీయ సౌందర్యం కాదు కదా
చూడచక్కని దాన్నీ కాను
ఏ కవి మధుర కావ్యానికీ
ప్రేరణ కాను
ఏ చిత్రకారుని
వలపు కుంచెకీ
చిత్రాన్ని కాలేదు
కుల మతాలూ లేని దాన్ని
వర్గ బేధాలు తెలియవు
వర్ణ వివక్ష ఎరుగనే ఎరుగను
ఏ క్షణాన ఫలవంతమై
జీవినైనానో
ఓ భాగ మైనానో
ఏనాడు జ్ఞాన కుసుమం
వికసించి విరాజిల్లిందో
నాటి నుండి నాకు తెలిసినదొక్కటే
ప్రేమించడం ప్రేమ పంచడం
ద్వేషం నా దరిదాపుల్లో ఉండదు
కార్పణ్యం ముఖం కుడా చూడలేదేన్నడూ
గొప్పదాన్ని కాదు
అందరి లెక్కల్లో
ఆస్తులూ అంతస్తులో
లేవుగా మరీ
పేదదాన్ని అంటే ఒప్పుకోను
ససేమిరా అంటాను
నా వద్ద ఉన్నది
కోటానుకోట్ల మమత సిరి
ఎంత పంచినా తరగని
ఎంత పంచితే అంత గా
విలసిల్లే ప్రేమ ఖని
ప్రేమ నా ఆయుధం
ప్రేమ నా ఆయుష్షు
ఊహ తెలిసిన
నాటినుండీ
ఊపిరి ఆగి పోయేదాకా
నే చేస్తున్నదొక్కటే
ప్రేమించడం
ప్రేమ నా చిరునామా కాదు
నేనే ప్రేమ అస్తిత్వాన్ని
తుది శ్వాస వరకు
ప్రేమనే శ్వాసిస్తా
ప్రేమనై ప్రేమిస్తా
నిరంతర తపస్వినినై..!!!
.......................ప్రేమతో.....జగతి ....... 6.05 pm 30th july 2011 saturday
అర్ధం కాని రంగులను అందమైన చిత్రాలుగా మలిచే అర్ద్రమైన ఓ చిత్రకారునికి...ప్రేమతో...జగతి
రంగులని తన భావాల కుంచెతో అపురూపాలుగా చిత్రించే చిత్రకారుడు "అక్బర్" కి ...ప్రేమతో....జగతి |
thanks for ur affection
ReplyDeleteమిమ్మల్ని ఎరిగి వున్నందుకు గర్వంగా వుంది...
ReplyDeletethank u akbar saab, and neekendukuraa thanks kondodaa....love j
ReplyDelete