|
ఇవీ........ నయనాల నిత్య సంతానాలుఆనందంలో అక్షింతల ఆశీర్వాదాలు బాధలలో చిట్లిన హృది బీటల చెమ్మలు దుఃఖంలో మౌనంగా పారే సెల ఏళ్ళు తలపులు తల్లడిల్లిన క్షణాన ఓడి చేర్చుకునే కనుల తల్లి కౌగిలిలో మదికి తోడుగా ప్రవహించే నిరంతర అపూర్వ చెలులు ప్రాణం పోసుకున్న క్షణాన మొదలై జీవితాంతం ఏకైక నేస్తంగా నిలిచి ఉసురు వదిలిన వేళ మన వాళ్లనుకునే కొద్దిమంది మంది కళ్ళలోనైనా చిప్పిల్లే ప్రేమాస్పద స్మృతుల చినుకులు కాల గర్భంలో మనిషి కలిసిపోయినా తన వారి కళ్ళలో తానో జ్ఞాపకంగా మెదిలే ఈ అశ్రువుల ముత్యాలు ప్రేమకు మానవత్వానికి సార్వ కాలిక ప్రతీకలు.. మానవునికి సృష్టి ఒసగిన అపురూప అమూల్య కానుకలు ....కన్నీళ్లు...!!! ...............................................ప్రేమతో....జగతి 4.55pm tuesday 19th july 2011 |
చాలా బాగుంది. :)
ReplyDeleteఆనందంలో అక్షింతల ఆశీర్వాదాలు enta bavundamma e expression
ReplyDeletethank u manasa and sailamma....love j
ReplyDeletewow wonderful
ReplyDeleteకన్నీల్లను కవిత్వంగ మార్చిన మీ భావుకతకి వందనాలు మేడం ....
ReplyDelete