నిజం నన్ను నిలువునా దహించి వేస్తుందని
అబద్ధపు తెరలతో అడ్డుకుంటావు
సత్యపు పెనుగాలి నా ఆశల చిన్ని రెక్కలను విరిచేస్తుందని
నా పంచ ప్రాణాలూ ఎగిరి పోతాయని
అసత్యపు కవచాలను నా చుట్టూ అల్లా జూస్తావు
వాస్తవానికీ, వాస్తవం ఒకనాటికి తెలియక మానదు
తెలిసాక నేనేమౌతానో ఏమో కానీ
నన్ను కాపాడుకోవాలనే నీ యక్ష ప్రయత్నం
నీ పై మరింత ఆరాధన పెంచుతుంది
యధార్ధానికీ నాకూ మధ్య నువ్వు గోడ కట్టినా......
అది నా ప్రేమ రక్షణ దుర్గమని
తెలుసు నాకు....!!!
..................................ప్రేమతో...జగతి 7.10pm 18.09.09
యధార్ధానికీ నాకూ మధ్య నువ్వు గోడ కట్టినా......
ReplyDeleteఅది నా ప్రేమ రక్షణ దుర్గమని
తెలుసు నాకు....!!!
ఇన్ని తెలిసిన మీకు ఏమి చెప్పగలను
అభినందనలు తప్ప