................................................... |
నిన్ను నే పెట్టిన కష్టాలకి
నాకు నేనే సిగ్గిలుతున్నా ఈ క్షణం
ఎన్ని సార్లు ఎన్ని మార్లు నిన్ను
బాధించానో
ఎంత దుఖాన్ని నీకు కలిగించానో
ఊహ తెలిసిన నాటి నుండి
నిన్ను బాధిస్తూనే ఉన్నాను
ఎన్ని నొప్పులు ఎన్నికోతలు
ఎంతలా భరించావు నా కోసం
నే తీసుకున్న ఏ నిర్ణయానికైనా తల ఒగ్గి
ఒదిగి ఒక్క మాటైనా ఎదురు చెప్పక
పంటి బిగువున అదిరిపడే బాధని అణచిపెట్టుకున్నావు
నువ్వు బాధతో మెలికలు తిరిగి పోతున్నా
నిర్దాక్షిణ్యంగా నిన్ను ఉపయోగించుకున్న
నా నిర్దయకి ఏమి శిక్ష వేస్తావో వెయ్యి
కానీ ఇప్పటికీ నీ నమ్రత చూస్తేనే
నా కళ్ళలో చెమరింపు
నిన్ను వ్యధా భరితను చేస్తున్నాననే
నా మదిలోని చిత్రవధ
నిజానికి "నువ్వు" లేకుండా
"నేను" అనేది ఉందా
అయినా నా మేధో నిర్ణయాలకు
నా ఉద్విగ్నతలకు
నా విషాదాలకూ
నిన్ను బానిసను చేసే హక్కెవరిచ్చారు?
మనసు గాయాలే గోప్పవనుకున్నా గానీ
నువ్వు భరిస్తోన్న
నన్ను క్షమించకు...!!!! |
వ్యధను పట్టించుకోలేదు నేను
ఈరోజు అలసి సొలసి
వాలిపోతున్న నిన్ను
ఎలా రక్షించుకోను?
చేయిదాటి పోయిన ఆ ఆ సమయాన్ని మరల ఎలా రప్పించను ?
అన్నీ ప్రశ్నలే
నిన్ను వేధించి బాధించిన
నన్ను ఇంకా ప్రేమిస్తూ
ఎందుకిలా నాతోనే ఉంటావో
పిచ్చి ప్రేమ నీది
ఒక్క మాట మాత్రం చెప్తా విను
నిన్ను నేనెన్ని బాధలు పెట్టినా
కిమ్మనకుండా భరించినందుకు
నేను వెళ్ళాక నిన్ను మాత్రం
సకల లాంఛనాలతో
సాగనంపమని నా మరణ
వాంగ్మూలం రాస్తాను
అంతకు మించి
నిన్ను ఎలా గౌరవించాలో
తెలియని ఆశక్తురాలిని
నా నిస్సహాయతను
మన్నించకు
నన్ను మాత్రం ఈ జన్మలో
క్షమించకు ....క్షమించకు ........
...నా దేహానికి ................................ప్రేమతో ....జగతి
8.15am july 6th 2011 wednesday
కఠోర వాస్తవాన్ని కవిత్వీకరించి కరిగించారు మా...మాటలు చాలవు....కైమోడ్పులే....
ReplyDeletewonderful.... best wishes
ReplyDeleteE kavita meeru matrame rayagalaru.
ReplyDelete