మెత్తని నీ సఖి సందిట మేను మరచి పోరా...!! |
పల్లవి: అలసి చేరి నా చల్లని ఒడిని వాలుమా ప్రియా
సేద తీరుమా సఖా
స్వేదమారగా....."అలసి"
చ: మరుల సిరుల నీ మోము ఖిన్నమాయే నేమిరా
తేనెలొలుకు కెమ్మొవి మౌనించేనదేలరా
మెత్తని నీ సఖి సందిట
మేను మరిచి పోరా........"అలసి"
చ: ఏ లోకపు శోకాలు నిన్నంటక కాచేరా
నా ఊపిరి గూటిలోన నిన్ను దాచుకుంటారా
నీ కలతల కన్నీళ్లు
ఈ చెలియకు వరమీరా......"అలసి"
చ: నీ ఆశలు నీ కలలూ నీ జీవన మాధురులు
కోరబోను ఎన్నటికి నావి కాని ఏ సిరులు
నీ వేదన వెతలు తీర్చి
నిన్ను నిలుపుకుంటారా...."అలసి"
చ: వేసారి బడలికతో నను చేరగా నీవరిగితే
మధుర బాధ తాళలేక ఎద పానుపు నీవొరిగితే
పంత మాడనోయి స్వామి
పరికించకు నా మదిని....."అలసి"
......................................ప్రేమతో జగతి ....11.15pm 06-03-2003 thursday