Wednesday, May 11, 2011

ప్రియాతి ప్రియమైన నీకు!

ప్రియాతి ప్రియమైన నా చిన నాటి  నేస్తం  ఉత్తరానికో ఉత్తరం...!!!
ప్రియాతి ప్రియమైన నీకు!
 మన చిన నాటి ముచ్చట్లు
ఇప్పటికీ మనసులో మెదులుతూనే ఉంటాయి
నీ  కోసం ఎదురు చూసిన క్షణాలు యుగాలై
నిన్ను చూడగానే ఉవ్వెత్తున ఎగిసిపడే
హృదయాన్ని ఆపలేక నిన్ను
దరి జేర్చుకుని నా ఎదపై నిలుపుకొని
నీవు తెచ్చిన కానుకలన్నీ 
ఆనందంగా ఆస్వాదిస్తూ
నిన్ను పదే పదే ముద్దు పెట్టుకున్న వైనాలు 
ఈనాటికీ గుండెలు ఝాల్లుమనిపించేలా
బాధలు బంధాలూ 
ఆశలూ ఆకాంక్షలూ 
అన్నీ నేవేరిగినవే
ఏవీ దాచలేదు నీనుండి
కానీ ఇప్పుడు 
నిన్ను మర్చిపోయానని
నీకు కోపం....
కాదులే బాధ నాకు తెలుసు
నీకు కోపం రాదు 
కానీ నువ్వు లేక కానరాక 
నేనెంత  దుఖిస్తున్ననో నీవెరుగుదువా?
ఎన్నెన్ని కోట్ల సార్లు ప్రయత్నిస్తానో
అయినా ఇప్పుడు నువ్వూ నేనూ
మన మాట ఊసు ఎవరికీ అక్కర్లేదు 
ఎవరికీ పట్టదు 
ఒకవేళ గుర్తుచేస్తే 
మనం వెర్రివాళ్ళమౌతాము 
అందుకే నిన్ను గుండెల్లో దాచుకుని
నా మనసులోని ఊసులన్నీ 
నీతో  పంచుకునీ
ఎన్నో ఊసులు, బాధలు , కన్నీళ్లు
కష్టాలూ, కమనీయాలూ
అన్నిటినీ మళ్ళీ 
ఎప్పటికప్పుడు 
సరి కొత్త జాజి పూల కింద
అంతరంగం పెట్టెలో 
అందంగా అమర్చుకుంటాను
అవి నాకే నాకు మాత్రమే చెందే 
మన స్మృతులు....
ఇట్లు....ప్రేమతో...నీ జగతి 2.30pm may 11th wednesday 2011





4 comments:

  1. అద్దంలో చూసుకుంటే శరీరమే కన్పడుతోందని మనసు కన్పడటలేదని చాలాసార్లు బాధపడ్డా. ఇప్పుడా మనసుకి అద్దందొరికిందోచ్చ్.. మనసు ఆర్ద్రమై, రంగుల్లేని కన్నీటి పొరగా చాలా స్పష్టంగా....పగలని అద్దంలో.....మీ వాసుదేవ్

    ReplyDelete
  2. thank u dev for ur instant response....kumar thank u also for ur short cute response...love j

    ReplyDelete
  3. అందరికి మనసులోని భావాలు చెప్పడానికి మాటలు సమకూరకపోవచ్చు. కానీ ఇటువంటి మనోభావాలు ఇంచుమించు అందరిలోను వుండవచ్చునేమో కదా!!!!

    ReplyDelete