కవిత్వమే !
రాద్దామని కూర్చున్నా
పద్యమా? వచనమా?
పద్యం రాద్దామంటే
ఛందస్సులు చదవని దాన్ని
సీసాలూ, కందాలూ,ముక్త పద గ్రస్తాలూ,
ముత్యాల సరాలూ ఏమి రాయగలను?
వచనమే రాద్దామనుకుంటే
భావావేశమే కానీ
భాష పై పట్టులేని దాన్ని
ఉత్ప్రేక్షలూ , ఉపమాలంకారాలూ
ఊతంగా తెచ్చుకోలేనిదాన్ని
అయినా సాహసించి
మదిని ముప్పిరిగోనే
మధుర భావనలను
గుడి గుచ్చి నీ మెడలో
వేద్దామనే ధృడ సంకల్పంతో
అక్షరాలు అభ్యసించాను కదా
ఆపాటి రాయలేకపోతానా
అని ఆర్తిగా రాయాలని కలం పట్టా
ప్రతిసారీ మది పలికిన
కలం చిలికిన పదం ఒక్కటే---
అంతకు మించి నే రాయలేననుకుని
ఆత్రంగా, ఆరాధనగా
నే రాసినది చదువుకున్నా
నిస్సందేహంగా అక్కడ ఉన్నవి
నాలుగే అక్షరాలూ
అది నీ పేరు...
...................ప్రేమతో ....జగతి
కవిత్వమైన ఆ నాలుగు బీజాక్షరాలు....
ReplyDelete