Tuesday, May 3, 2011


?????????????????

ఎందుకో ఎన్నాళ్ళనుండో
ఉగ్గాబట్టుకున్న పిచ్చి కోరిక
మదిని తొలిచేస్తోంది
ఎంత సర్ది చెప్పిన వినను పో అంటోంది
ఏమి చేయను ఈ కోరిక ఇప్పటిది కాదు
నాలుగున్నర పదులు దాటినా ఈ దేహానికి
ఊహ తెల్సినప్పటినుండీ
మదిలో మెదులుతోన్నకోరిక మరీ
అబ్బా! అన్నాళ్ళ బట్టీ ఉంటే
ఇన్నాళ్ళూ ఏమి చేసావు 
అంది చుప్పనాతి మెదడు
అదేంటే అలా అంటావ్ బాధనిపిస్తుంది
బాధగానే అంది హృదయం
అయినా ఒక్కసారి కూడా 
ప్రయత్నించలేదా?
తెలివిగా ప్రశ్నించింది మెదడు
ఎందుకు చేయలేదూ
చేశా......
ఊ అయితే మరి ఏమయ్యింది చెప్పు
మనసు ఒక్కసారి తడబడి
మాటలో కి రాలేక
కళ్ళలోంచి కన్నీళ్ళై
కురిసింది 
అయ్యో ఏడవకు 
చెప్పు....అంది మెదడు
ఇంతకీ ఆ కోరికేంటీ?
నేను ఒప్ప్పుకునేదేనా?
అబ్బా నా మనసు మీద దీని పెత్తనమొకటి
అక్కసుగా అనుకున్నా
ఏమీ లేదులే ఇక ఇప్పుడెవరికీ
అక్కరలేనిది...నే చేస్తే మాత్రం ఎంత
చేయ్యపోతే మాత్రం ఎవ్వరూ నష్టపోరులే
ఉదాసీనంగా వచ్చింది మాట గుండె లోతుల్లోంచి
ఇంతకీ కోరికేంటో?
అనుమానాస్పదంగా అడిగింది మెదడు
ఏముందిలే చిన్ని కోరిక అంతే
నాకు ప్రేమ లేఖ రాయాలనుంది
చెప్పేసాక సిగ్గుపడ్డాను
అబ్బా ఇంకా ఈ మనసొకటి మిగిలింది కదూ
పకాలున నవ్వింది మెదడు సోదరి
నీవు ప్రేమలేఖా? ఎవరికీ రాస్తావ్?
ఏమీ రాయకూడదా
ఉక్రోషంగా ఎగబీల్చాను
అహా  అది కాదూ 
ఎవరికని...?
ఇంతవరకూ ఎప్పుడూ రాయలేదా
ఎందుకు లేదూ
చాల సార్లు రాసా
మరి?
ఇంకేమన్నట్లు చూసింది
కాని ఎవరికివ్వాలో వారికివ్వలేదు 
నేను నమ్మను....తర్కంగా అంది
ఒప్పుకోక తప్పలేదు 
నిజమే ఇచ్చాను
ఊ మరేంటి అయితే?
కానీ...మరే....
తను.....
చదవలేదా?
ఆహా....చదివాడు
మరి?
నవ్వేసి పక్కన పడేసాడా?
ఎంత నమ్మకం నా మీద నీకు
మళ్ళీ మనసు ఆక్రోశించింది
పోనీ ఏమైందో చెప్పు?
చదివీ......
నీ ప్రేమలేఖ కన్నా
ఆ చాకలి పద్దు నయం అన్నాడా(అనుకున్నట్టుంది  మెదడు)
కాదు...
నీ ప్రేమలేఖకన్నా నువ్వే బాగున్నావు
ఇంకెప్పుడూ ప్రేమలేఖ రాయకూ
అంటూనే వెక్కి  వెక్కి పడింది మనసు
ఊరుకోలే....అయ్యో పాపం...
అంటూనే...(ఎంత గొప్పగా రాసిందో  మరి)
అని తనలో తను నవ్వుకోవడం 
చూసాను.....కన్నీటితో తడిసిన 
పయ్యెద పై ఉప్పు మరకలై
మిగిలిపోయింది 
నా కోరిక.....ఇక తీరేది కాదు....ఈ జన్మకి..

ప్రేమతో.....జగతి 9.05 pm tuesday 3rd may 2011 














3 comments:

  1. PAARESUKO THAGGA BHAAVAALAA MEEVI? PADI KAALAALU DAACHUKONI PADI MANDIKEE PANCHA THAGGA PANASA THONALU. CHAALAA BAAGAA AKSHRAAKRUTHI ICHCHAARU.

    BY THE BY EE LEKHALU MEE SUNNITHA HRIDAYAANI GAAYA PARACHA LEDANE ANUKUNTUNNAANU. ALL THE BEST. MEE KALAM THADI NI ENNATIKEE AARA NEEYA KANDI.
    RAMA RAO

    ReplyDelete
  2. Jagathi garu, beautiful dialogs between the mind and heart dominating over one another.. really soothing article with enough suspense and imaginations.. Each one of your works takes readers to a different world...keep it up,

    ReplyDelete
  3. హూ....మనసునీ బయటపడేసి....మెదడునీ బయటపడేసి....అంతర్మధనంలో కొట్టుమిట్టాడుతూ....ఓ అద్భుత భావసృష్టి.....కలంలోని సిరా రంగుమారితే ఇదిగో ఇలాగే ఉంటుందని బాగా చెప్పారు......అభినందనలతో.....దేవ్

    ReplyDelete