Wednesday, April 27, 2011

ఆమె కధ....









ఆ  రోజుల్లో....

అప్పుడే లోకం కళ్ళల్లో పడిన ఆమె 
బతుకు విస్పోటనంలో.........ఎగసి ఎగసి అలసి సొలసిన  ......!!!
ఆమెగా కళ్ళు తెరిచి చూసిన లోకం
ఒక్కసారిగా ఎన్నెన్ని పరిచయాలో                                    
అబ్బాయిలు అమ్మాయిలు మాస్టార్లూ
కవులూ రచయితలూ స్నేహితులూ
ఉక్కిరిబిక్కిరైన ఆ మనసుకి 
సాంత్వన ఇచ్చేవి పుస్తకాలే
సాహితీ స్రష్టల మస్తాకాలే 
బైరాన్, షెల్లీ, కీట్స్  చదివి ఆనందం
హెర్మన్ హేస్స్ , డిలాన్ తోమాస్, లారెన్స్, 
టాగోర్, అరబిందో, జాయిస్ 
ఇలియట్, మిల్లర్, చలమ్స్
అప్పట్లో ఆమెకైన మంచి బాయ్ ఫ్రెండ్స్ 
రోజు రోజూ మెదడులో నిండుతోన్న సాహిత్యం
ఆమె కళ్ళల్లో ప్రతి క్షణమొక రాగోదయం
వెలుగు నింపుకున్న ప్రాణోదయం
స్నేహితులూ సన్నిహితులూ
ఏడిపించే వారూ అన్నిటికీ
అందరికీ.......
ఆమె ప్రేమ పూరిత పలకరింపే సమాధానం
స్వచ్చమైన మనసు అద్దాన
జారిన ముత్యాల జ్ఞాపకాలు
బంధాలకు లొంగిపోయిన 
జీవన మాధుర్యం 
మోడైనా ప్రాణం కోల్పోని ప్రేమ తపన
దశాబ్దాల అనంతరం 
ఎక్కడో  ఎద మూల ఆర్కైవ్స్ లో 
కదలిక....
వినబడుతోన్న ప్రేమ అడుగుల సడి
జీవన సంధ్యా కుటిలో .....మరల చివురించిన మరులు .....!!!
తిరిగి కదలాడే రాగ రంజిత మానసం
జాల్వారిన కన్నీటి ముత్యాల సరాలు
చేజారిన మూడు దశాబ్దాలు
మళ్ళీ ఇప్పుడు .......
ఎన్నో ఏళ్లుగా మూసేసిన గుండె గది 
తలుపులు తెరుస్తోన్న మధుర స్మృతులు
మళ్ళీ ఒక్కసారిగా.....
అదే భావన ... మళ్ళీ ...
ప్రేమలోకంలోకి  అప్పుడు అడుగు వేసినట్టే
ఇంకా తనని మరిచి పోని
తన అనుకున్నవారింకా ఉన్నారని
అదే కళ్ళల్లో ఇప్పుడు 
సాఫల్యత  సంతోషం....
ఒకే జీవనంలో  రెండో సారి జన్మించిన
అపరిమిత ఆనందం
పరాజిత అయి చెదిరిన మనసు 
ఈ నాడు అనురాగ  పులకాంకిత అయి
ప్రేమ మార్గమే ఎంచుకుని
ప్రేమ నే నమ్మిన 
ఆమె అచంచల విశ్వాసానికి
దయతలచి ఆమె సాచిన 
కొంగునిండా మళ్ళీ 
తిరిగి అవే తీయని ఉసుల రాసులు ....
ఆమె ప్రేమాన్విత...
తనని మది నిలుపుకున్న వారి
మన్నన పొందిన 
ప్రేమ విజేత...
ఆమె విజయం 
తనని ప్రేమించిన వారి హృదయం
నిధి చాల సుఖమా రాముని సన్నిధి చాల సుఖమా 
అన్నాడు త్యాగరాజు
నిధి చాల ప్రియమా 
ప్రేమికుల చెలిమి చాల వరమా...
అంటుందామె...
ఆమె  ప్రేమ జగతిలో 
అందరూ ప్రేమస్పదులే..
ఆమె మనసులో అందరూ 
శాస్వతులే......!!!
ఇదీ ఆమె కధ .........ప్రేమతో....జగతి.
27-04-2011 6.54pm wednesday THE PRESIDENT HOTEL... CHENNAI 




చేజారని తరి తీపి గురుతుల పూలు.....!!!
                                                                                                                 ..........ప్రేమతో......జగతి

 














3 comments:

  1. ఏమని చెప్పాలి. కామెంట్ ఎలా రాయాలి. కవిత అయితే బావుంది అనో బాగా రాసారు అనో చెప్పచ్చు.కానీ జీవితం కదా.చదువుతుంటే కళ్ళు చెమర్చాయి. మీ భావాలకు, మీ ప్రేమకి శిరసు వంచి ప్రణామాలు.
    http:/kallurisailabala.blogspot.com

    ReplyDelete
  2. ధరిత్రి అంతర్గర్భోద్భవ మనో విస్ఫోటనం ...అద్భుతం......Nutakki

    ReplyDelete
  3. Jagathi garu,

    Its a simple WOW. This short description reveals passion for LOVE and love for LOVE. Longing, holding, belief and determination for LOVE at all the times, irrespective of whatever..

    you confirmed it once again that LOVE is a simple heart thing. The whirlwind brain has absolutely no role in it.

    I humbly feel previlged and pleased to be in the company of this great Soul....

    my regards,
    Prasad

    ReplyDelete