దిల్ కూజితాలు
కలలతో పోరాడి
మనసు అలసి పోయింది
ఇక
నిశ్శబ్దం
నీ మౌనం
నా గుండె గాయం
మానదు
ఎప్పటికీ
ఆచరించలేని ఆలోచనల జడి
ఎద నిండా
అపహాస్యం చేస్తూ వాస్తవం
గుండెనిండా కలలు
తీరనివి
కళ్ళనిండా నీళ్ళు
జారనివి
నువ్వు చేసే గాయాలు
చాల చిత్రమయినవి సుమా
తగిలినపుడు తెలియక
తదుపరి బాధిస్తాయి
మధుర స్వప్నం తొణికి
జ్ఞాపకంగా ఘనీభవించింది
కాటుక రేఖలు గీచి
కనుదాతనివ్వను నా రాజుని
కనురెప్పల తలుపులు మూసి
కంటి పాప తాళం వేసేస్తా
మనసు లేని మనిక కన్న
మరణం మధురం నాకు
ఆనందాని ప్రేయసి అందాలలో
కాదు...
వెతుక్కోవాలి
ఆమె అంతర్యంలో
విరహం వేదనైనా పర్వాలేదు
కలయిక కలహం కాకూడదు
అణువంత అసూయే కదా
అణిగి పోతుంది లేమ్మనుకున్నా
అనుదినమూ పెరిగి
అణ్వస్త్రమై కూచుంది
నా నవ్వుకి నీ ఎద
పూలు పూస్తుందంటే
మది కాగిపోతున్నా
చెరగ నివ్వనీ నవ్వుని
మిత్రులారా ఇవి కొన్నాళ్ళ క్రితం tlc లో ఒకటోకటిగా పోస్ట్ చేసినవే అయితే ఇప్పుడు కొత్త స్నేహితుల కోసమూ అదీ కాక అన్నీ ఒక చోట చేర్చాలనే ప్రయత్నం లో ఇలా.....ప్రేమతో...జగతి
నీ మౌనం
ReplyDeleteనా గుండె గాయం
మానదు
ఎప్పటికీ
wow..wow...wow