Wednesday, April 20, 2011

'నవ్య' లో నా 'కధ'(కవిత)

కధ 

అది ఒక మామూలు ఉదయం
ఓ గుప్పెడు మల్లెలు కనిపించాయి
సిటీ స్క్వేరు  వద్ద  
మరుసటి రోజు మరో చోట ,
ఆ తర్వాత మరు రోజు మరో చోట.

మల్లెలు అతి వ్యాప్తి  ఇరకాటాన  పడిన 
మషీన్ గన్లతో గుసగుస లాడాయి ఇలా:
'విప్లవం ఇక తుపాకుల బారెల్ నుండి రాదు:
విసిగి వేసారి ఉగ్గబట్టుకున్న 
గుండెలు  ఒక్కసారిగా ఒకే 
లయలో జోరుగా కొట్టుకుంటే ,
పలు వర్ణాల ఒంటరితనాలు 
రెపరెప లాడే పాతాకలుగా మారినప్పుడు వస్తుంది.

విప్లవం కూడా 
చీకట్లో దొంగలాగా అడవుల దారుల్లో
వచ్చే తన 
అలవాటుని మార్చుకుంది:
ఇప్పుడది నర్తించే పాదాలతో 
పగటి మెరుపు వెలుగుల్లో వస్తుంది:
తన ముసుగునుండి సూర్యునివైపు  సూటిగా చూసే 
కనుదోయి నుండి వస్తుంది 
మబ్బులపైకి విసిరేసిన 
తెల్లని టోపీల ఉరుములనుండి వస్తుంది
తన ప్రియునితో యుద్ధ టాంకర్  పై
సవారి  చేస్తున్న అమ్మాయి
విస్ఫోటక కిలకిలలనుండి వస్తుంది
నాయకుడూ అనుచరులూ కూడా లేని
అందరోక్కటై 
ఆలపించే వేయి తలల భవిష్య గీతంలోనుండి 
కొమ్మలేస్తున్న  చిన్ని చేతులు
'వి' అనే అక్షరాన్ని అల్లిన చేతి రుమాళ్ళ మార్పిడినుండి వస్తుంది 
 విప్లవం వైరసులకన్నా  తొందరగా విస్తరిస్తుంది 
ఈ-మెయిల్స్ తో , ఫేసుబుక్ కను సన్నలతో ,
ట్విటార్ నుండి రెక్కలు టప టప లాడిస్తుంది.
తుపాకి కి అర్ధం చెక్క ముక్కేనని
తుపాకీ గుండు నారింజ పండని
బాంబు రోజా పువ్వని 
మనిషికి కొత్త పర్యాయ  పదాలనిచ్చే  
నవీన నిఘంటువుని సృష్టిస్తుంది .
కవిత్వానికి 
ఆశ్విజ్ని , సయిబెరియా ని గుజరాత్ ని తట్టుకు బతికే 
దేహ దారుడ్యాన్నిప్రసాదిస్తుంది.

వంచక నాయకులారా, జాగ్రత్త!
మా అహింసకు భయపడండి!
మల్లెలు ఎక్కడైనా అగుపించవచ్చు ,
ఈ క్షణాన్నైనా గొర్రెపిల్ల గెద్ద రెక్కలు పెంచవచ్చు
ఈ ఒక్కరికీ తెలియదు ఏ హృది నుండి ఏ హృదికీ
శ్వేత ప్రవాహం ప్రవహిస్తుందో . 
చాల కష్టం ఇక జోస్యం చెప్పడం:
మాకు ప్రేమ, మీకు చావు ఐన దాన్ని గురించి.
చివరి నవ్వుని చర్చించుకుంటున్న కామ్రేడ్స్ ,
ఇది డాలర్ల దీ కాదు బంబులదీ కాదు 
ఇది మాది, మా విరబూస్తున్న ఆశల చిరంతన సౌరభం 

మలయాళం : డాక్టర్ కే. సచ్చితానందన్ 
ఆంగ్లానువాదం: డాక్టర్ కే.సచ్చిదానందన్
తెలుగు సేత: జగద్ధాత్రి 

జాస్మిన్ రివల్యుషణ్
మల్లెలే విప్లవిస్తే .....!!!

 
 
మిత్రులందరికీ! ఈ వారం అనగా కొత్త "నవ్య" 27-04-2011 లో ద్ర.కే.సచ్చిదానందన్ గారి "a new poem" అనే కవితకు నేను చేసిన అనువాదం ప్రచురితమైంది . శీర్షిక"కధ" నవ్య సంపాదకులకు ఆ కవితను అనువాదం చెయ్యడానికి అడిగిన వెంటనే కాదనకుండా అనుమతి ఇచ్చ్సిన సచ్చిదానందన్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ....ప్రేమతో...జగతి 


 





3 comments:

  1. వావ్, చాలా ఓపిగ్గా రాసిందే అయినా ఆద్యంతమూ చదివించేలా ఉండి మీ ఎఫోర్ట్స్‌ వెనుక ఉన్న నిజమైన సాహితీ ప్రేమ ద్యోతకమవుతుంది........ఒరిజినల్ టైటిల్ చూసే ఎంతో ప్రేరణ పొందుండాలి మీరు.....congrats for an excellent product in this world of letters.....మీ వాసుదేవ్

    ReplyDelete
  2. అనువాదంలా లేదు..చివర్లో చూస్తేనే తెలిసింది.. అంతా మీ ఆలోచనకు దగ్గరగా వుంది...

    ReplyDelete
  3. అనువాదంలా అనిపించలేదు.చాల బావుంది.

    ReplyDelete