ఆ త్రిమూర్తినిలను నీలోనే స్పర్శించిన అనుభవమిది ....... |
జల్లులు - విరిజల్లులు
జగమంతా -నా మనసంతా కురిసే క్షణమిది
సుమధారాలు మది ద్వారాలు దాటి
జీవన త్రి కాలాలకు విస్తరించిన నిమిషమిది
నిజమో- స్వప్నమో ,మోహమో -తన్మయమో
నగవులు -దేహపు బిగువులు తెచ్చ్సిన పరవశమో
సుధామధుర సంగమ సంభ్రమంలోంచి ఆశ్చర్యమో
నీ త్రిగుణ విశ్వరూప సందర్శనలో నా నిరీక్షణ ఫలియించిన తరుణమిది
గజగామిని గా ప్రతక్షమయి
మగత పుష్పంగా పరిమళించి
గాధామృత లహరిగా నువ్వు పలకరించాకా
ఆ త్రిమూర్తినిలను నీలోనే స్పర్శించిన అనుభవమిది
ఈ జన్మలోనే వరూధినిని నీలో చూసా
నేటి గత జ్ఞాపకాల మధుర వాణిని నీలో దర్శించా
రేపటి ధాత్రి పై లాలసని నీలోనే స్మరించాను
నిన్నటి రాత్రి నా దేహ -మనో- ఆత్మలను ఒక్కటి చేసి నిన్నే వరించాను
..............................................................................నీ చిన్ను 21-10-2011
"ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం ఒక నువ్వు" అనే టాగోర్ మాటలు తనని కదిలించాయనే ఈ కవి స్వచ్చమైన మనసుకి ప్రతీక ఈ కవిత ......
(ఎన్నో ఏళ్లకు తన మది కదిలించి పలికించిన తన ప్రేయసి కోసం ఓ ప్రేమికుని హృదయావిష్కరణమిది )
No comments:
Post a Comment