ప్రతీ దేహానికీ ఓ పరిమళ ముంటుంది.....
ప్రతిదేహనికీ ఓ పరిమళముంటుంది
అది ప్రత్యేకంగా ఎవరికీ వారికే
పరిమితంగా ఉంటుంది
నవ్వోస్తోందేమో నా మాటలకు
కానీ అనుభవమిది
కొన్ని దేహాలు మృగాల వాసన వేస్తాయి
కొన్ని ఆకలి వాసన వేస్తాయి
కొన్ని పురుష దేహాలు వాంఛ సుగంధం చల్లుతాయి
మరి కొన్నిఉన్మత్తతను పెంచుతాయి
కొన్ని స్త్రీ దేహాలు ఆర్తి పరిమళం వెద జల్లుతాయి
మరి కొందరు నిరాశ నిస్పృహల వాసన వేస్తారు
కన్నీటి ఉప్పదనపు వాసనేస్తారు కొందరు
మరి కొందరు చెమట ఉప్పదనంగా
మరి కొందరు నెత్తుటి ఉప్పదనంగా
అన్నీ ఉప్పనే అయినా వాటి మధ్య తేడాలుంటాయి
ద్రోహపు వాసనేసేవారు కొందరైతే
వలపు వాసనా వేస్తారు కొందరు
అమాయకపు అసహాయపు వ్యధా భరిత౦గా
అహంకారపు ఆభి జాత్యాల పూరితంగా
కొందరు చంటి బిడ్డలా౦టి పురిటివాసన వేస్తారు
మరి కొందరు మోసపు గబ్బు కొడతారు
కొందరు శ్రమ పరిమళమౌతారు
అబ్బో చెప్పకేం... కొందరు డబ్బు కంపు కొడతారు
పిచ్చి వాళ్ళు నయం దుర్వాసన వేయరు
వాళ్ళకే తెలియని పిచ్చి పువ్వుల్లాంటి
ఒక పిచ్చి వాసన వేస్తారు
కొందరు నిజాయితీ సువసనేస్తారు
చెప్పాగా ప్రతి దేహానికీ
తనది మాత్రమే అయిన
ఓ ప్రత్యెక పరిమళ మో , గబ్బో , సుగంధమో , సువాసనో
ఉండి తీరుతుంది
ఎటొచ్చీ అందరినీ అన్నిటి నీ
గుర్తుపట్టలేము
పసిగట్టలేము
పసిగట్టే నా లాంటి వాళ్ళకు
నిజానికి సుఖ ముండదు
నేను అనుమానపు పసిగట్టే వాసన వేస్తానేమో
మరి నన్నెరిగిన వారు ప్రేమ సువాసన వేస్తానంటారు
ఏది ఏమైనప్పటికీ...
నాకు తెలిసి వచ్చిన నిజం మాత్రం ఇదీ..
పరిమళాల దేహాల్ని ప్రేమించగలం
వాంచా పూరిత దేహాల్ని
అర్ధం చేసుకోగలం
వంచన నిండిన దేహాలను
భరించలేము...
అన్నిటికంటే దుఖం ...
వాటిని పసిగట్టీ తెలిసీ
వాటితోనే బ్రతకాల్సి రావడం...
అప్పుడు నేను దుఖపు వాసనేస్తాను కాబోలు.....
.............................. ........................ప్రేమతో ....జగతి 1.11am 24th oct 2011
ప్రతీ దేహానికీ ఓ పరిమళ ముంటుంది..... |
ప్రతిదేహనికీ ఓ పరిమళముంటుంది
అది ప్రత్యేకంగా ఎవరికీ వారికే
పరిమితంగా ఉంటుంది
నవ్వోస్తోందేమో నా మాటలకు
కానీ అనుభవమిది
కొన్ని దేహాలు మృగాల వాసన వేస్తాయి
కొన్ని ఆకలి వాసన వేస్తాయి
కొన్ని పురుష దేహాలు వాంఛ సుగంధం చల్లుతాయి
మరి కొన్నిఉన్మత్తతను పెంచుతాయి
కొన్ని స్త్రీ దేహాలు ఆర్తి పరిమళం వెద జల్లుతాయి
మరి కొందరు నిరాశ నిస్పృహల వాసన వేస్తారు
కన్నీటి ఉప్పదనపు వాసనేస్తారు కొందరు
మరి కొందరు చెమట ఉప్పదనంగా
మరి కొందరు నెత్తుటి ఉప్పదనంగా
అన్నీ ఉప్పనే అయినా వాటి మధ్య తేడాలుంటాయి
ద్రోహపు వాసనేసేవారు కొందరైతే
వలపు వాసనా వేస్తారు కొందరు
అమాయకపు అసహాయపు వ్యధా భరిత౦గా
అహంకారపు ఆభి జాత్యాల పూరితంగా
కొందరు చంటి బిడ్డలా౦టి పురిటివాసన వేస్తారు
మరి కొందరు మోసపు గబ్బు కొడతారు
కొందరు శ్రమ పరిమళమౌతారు
అబ్బో చెప్పకేం... కొందరు డబ్బు కంపు కొడతారు
పిచ్చి వాళ్ళు నయం దుర్వాసన వేయరు
వాళ్ళకే తెలియని పిచ్చి పువ్వుల్లాంటి
ఒక పిచ్చి వాసన వేస్తారు
కొందరు నిజాయితీ సువసనేస్తారు
చెప్పాగా ప్రతి దేహానికీ
తనది మాత్రమే అయిన
ఓ ప్రత్యెక పరిమళ మో , గబ్బో , సుగంధమో , సువాసనో
ఉండి తీరుతుంది
ఎటొచ్చీ అందరినీ అన్నిటి నీ
గుర్తుపట్టలేము
పసిగట్టలేము
పసిగట్టే నా లాంటి వాళ్ళకు
నిజానికి సుఖ ముండదు
నేను అనుమానపు పసిగట్టే వాసన వేస్తానేమో
మరి నన్నెరిగిన వారు ప్రేమ సువాసన వేస్తానంటారు
ఏది ఏమైనప్పటికీ...
నాకు తెలిసి వచ్చిన నిజం మాత్రం ఇదీ..
పరిమళాల దేహాల్ని ప్రేమించగలం
వాంచా పూరిత దేహాల్ని
అర్ధం చేసుకోగలం
వంచన నిండిన దేహాలను
భరించలేము...
అన్నిటికంటే దుఖం ...
వాటిని పసిగట్టీ తెలిసీ
వాటితోనే బ్రతకాల్సి రావడం...
అప్పుడు నేను దుఖపు వాసనేస్తాను కాబోలు.....
..............................
ఈ ' వాసన " ప్రాముఖ్యత కనిపెట్టే ఆనాడు నందితిమ్మన్న ముక్కుమీద పద్యం చెప్పి ముక్కు తిమ్మన్న అని పేరు తెచ్చుకున్నాడు. ఇన్ని రకాల వాసనలను కనిపెట్టే ముక్కు ఘనత ఏమని చెప్పుదు జగతి గారు :)
ReplyDeletevasanani chala chakkagaa varninchaarandi
ReplyDeleteఅమ్మా మనలో ఇన్నిరకాల పరిమళాలు ఉంటుందని ఇప్పుడు మీ కవిత చదివాకే తెలిసింది, ఇవే నిజమైతే అప్పుడు నేను కూడా దుఖ్ఖపు వాసనే వేస్తాను......
ReplyDeleteవంచన నిండిన దేహాలను
ReplyDeleteభరించలేము...
అన్నిటికంటే దుఖం ...
వాటిని పసిగట్టీ తెలిసీ
వాటితోనే బ్రతకాల్సి రావడం...
అసలు ఇలాంటి టాపిక్ మీద కవిత రాయాలని మీకు ఆలోచన వచ్చినందుకు అభినందనలు.మీ కవితలకి కామెంట్ పెట్టాలని ఉంటుంది కాని ఏమి రాయాలో అర్ధం కాదు.మౌనంగా ఉండలేను.
ఒక్క మాట చెప్పగలను
మనసుని కలంగా చేసుకుని రాస్తారేమో అందుకే సూటిగా మనసుని హత్తుకుని కన్నీళ్ళతో పలకరిస్తాయి.
idi naku chala nachina kavita....
ReplyDelete