Sunday, March 20, 2011

నగవు


బతుకు తోటను చదును చేసి
వ్విత్తనాలెన్నో చల్లాను
చాల మొలకెత్తాయి
కలలూ, కల్లోలాలూ
వ్యామోహాలూ, వైఫల్యాలు
ప్రేమలు, పాశాలు
ఇంకా ఎన్నో .....
కొన్ని పూసి ఫలించాయి
కొన్ని వృక్షాలు కూడా అయినాయి
కాని ఒక్కటి మాత్రం
మొలకెత్త నిరాకరించింది
పాదు చేశాను ,నీళ్ళు పోసాను
అహర్నిసలూ ఆపసోపాలు పడ్డాను
ఉహు.... మౌనంగా ఉండిపోయింది
పిచ్చిదాన్ని
నే వేసింది విత్తనం మాత్రమె
దాని జీవం నీ దగ్గరుంటే
అది ఇక్కడెలా జన్మిస్తుంది
నా వెర్రి  తనానికి
నన్ను నేనే వెక్కిరించుకున్నా
నీ రాకతో ....
ఆ బీజం అంకురించి
పుష్పించి
ఫలించింది నీ
పెదవుల పై
నీ చిరునగవై.....

5 comments:

  1. సరల శైలిలో చక్కగా రాసారు. ఇది చదువుతుంటే బైబిల్ లోని విత్తు వాని కధ గుర్తుకొచ్చింది. వ్యవసాయకుడు విత్తిన కొన్ని విత్తనాలు, మంచి నేలలో పడి బాగా ఎదుగుతాయి, కొన్ని ముల్ల తుప్పల్లో పడి మొలకెత్తినా కొన్ని దినాలకు ముల్లచే అనిచివేయబడి నశిస్తాయి, కొన్ని రాతి నేలల్లో పడి అసలు మొలకెత్తనే ఎత్తవు. దేవుని మాట కొన్ని రకాల హ్రుదయాల్లోనే మొలకెత్తుతుందని ఈ కధ సారం.

    ReplyDelete
  2. మీ శైలిలోనే.... చాలా బాగుంది...

    ReplyDelete
  3. మేడం మీ బ్లాగు చాలా 'బ్లాగుంది' ..

    ReplyDelete
  4. 100000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 inni likelu e kavitaki

    ReplyDelete