స్పర్శ .....
తీయని మాదకత
నరనరాల్లోనూ....ప్రేమతో..జగతి
ఒక మంచి మాట
ఒక చిన్ని నవ్వు
ఒక చిట్టి గెలుపు
జీవితాన్ని నిలబెడతాయి .....ప్రేమతో ...జగతి
ప్రేమ కోల్పోయాము
అంటారు కొందరు
ప్రేమకి పోవడం
ఉండదు....ఒక సారి కలిగాక....ప్రేమతో...జగతి
దేహాల కలయిక
సుఖమే .....
మేధో భావ ప్రాప్తి
పొందే జంట నడుమ .....ప్రేమతో ...జగతి
నడుము వంపున
బలంగా అతని చెయ్యి
రాముడు ఇలాగే
శివుని విల్లు ఎత్తాడా.....ప్రేమతో...జగతి
పెదవుల వణుకుకు
తాను దాటిన
మోమాటపు
సరి హద్దు
నా అధరాలపై
తన పంటి గాటు....ప్రేమతో ...జగతి
కరుకుగా ఉంటాడు
మరెందుకో ...
అంత ఆరాటం
నా క్షేమం తనకి .... ప్రేమతో జగతి
సుతి మెత్తని
తన చేతులు
పువ్వులాంటి
ఆతని మనసులానే .....ప్రేమతో...జగతి
మాటలెన్నిచెప్పినా
మనసు మాత్రం
విప్పడు సుమా
నే కలతిస్తే చూడలేనందుకేనేమో.....ప్రేమతో ...జగతి
No comments:
Post a Comment