Sunday, March 20, 2011

ముఖ చిత్ర కూడలి







ముఖ చిత్ర కూడలి

ఇక్కదందరివీ ముఖ పరిచయాలే
కొందరివి అసలు ముఖాలైతే
కొందరివి తగిలించుకున్నవి
మనసులు విప్పి మాటాడుకునే వారు
కొందరైతే ఇతరుల మనసులు
తెలుసుకునే ప్రయత్నం
మరి కొందరిది
అందరకి ఒక్కటే సారూప్యత
ఒకరి గురించి
మరొకరు
తెలుసుకోవాలని
పరిచయమవ్వాలని
మొహమాటాలు వీడి
ప్రేమ పంచేవారు కొందరు
స్నేహ పరిమళాన్ని
వెదజల్లే వారింకొందరు
అన్ని వయసుల వారికీ
ఒంటరితనం మరిపించే
ఇదొక చౌరస్తా కూడలి
ఎన్నెన్నో మనసులకిది
భావాల వారధి
కవితలై కరిగిపోతున్నా
మాటలై మంచి పంచుకున్న
హృదయ సంద్రాలు దాటి
మమత తీరాలు
చేరే మాటల
చిత్ర కూటమి ఇది
ఇక్కడ
ఈ గనిలో
నీకో చిక్కని
కవితల చక్కని
వజ్రాలు దొరుకుతాయి
సమాజ హితాల
శ్రేయోభిలాషులు ఉంటారు
విశ్వాన్ని పలుదిక్కులనుండి
మీటతో పలకరించే
మాటకారులుంటారు
సకల సాహిత్య
సమ్మేళన కర్తలు ఉంటారు
ఒకనాడు కలసి కూర్చుని
ఆడుకునే కబుర్లు
ఇవాళ ఎవరింట్లో వారే
కూర్చొని ఇతరులతో
మాటాడు కుంటున్నారు
ఒక్క రోజు మరొకరు
కనిపించకపోతే
కలవర పడి
వెతుక్కుంటున్నారు
మనిషి మాటకోసం
ఎంత మొహం
వాచి ఉన్నాడో
మనసెంత వ్యక్తీకరించాలని
తాపత్రయ పడుతున్నాడో
అందుకు నిట్ట నిలువు
అద్దం
ఈ ముఖ చిత్రం
ఎక్కడినుండో మిత్రులని
కలుపుతుంది
కొత్త మిత్రులని
చేరుస్తుంది
అందుకే ఇటీవల
ఎవర్ని చూసినా
ముఖ చిత్ర కూడలిలో
కలిసిన వాళ్ళకి మల్లె
అగుపిస్తున్నారు......ప్రేమతో....జగతి

4 comments:

  1. పేస్ బుక్ గురించి మీరు రాసిన కవిత చాల చక్కగా సరిపోయింది. ప్రతి వాక్యం నిజం
    అన్ని వయసుల వారికీ
    ఒంటరితనం మరిపించే
    ఇదొక చౌరస్తా కూడలి
    nijamga nijam idi

    ReplyDelete
  2. "ఒకరు కనబడక పోతే మరొకరు కలవర పడి వెతుక్కుంటున్నారు"
    "మనసెంత వ్యక్తికరిమ్చాలనుకున్తున్నడో "
    "కలసిన వారికీ మల్లె కనిపిస్తున్నారు"
    .....చెప్పాలంటే మీరు రాసిన ప్రతి వ్యాక్యం ఇక్కడ మళ్లి రాయాలి ....ఎంత చక్కగా స్పష్టము గా నిజాన్ని చెప్పారు మాడం గారు
    ....ఇది చదవటం నమనసును నేను చదివి నట్లే వున్నది ...ధన్యవాదములు -Msrk.

    ReplyDelete
  3. ఒక్క రోజు మరొకరు
    కనిపించకపోతే
    కలవర పడి
    వెతుక్కుంటున్నారు... a very subtle expression.. now facebook has become an identity.. a new breed of facebookians has emerged.. very nice presentation..

    ReplyDelete