Sunday, March 27, 2011

వరం

ఒంటరితనం ఒక్కోసారి వరం
నిజం....నేస్తం
నీ నిరాశా నిస్పృహల వేడి గాఢ నిట్టూర్పులు
ఎవరికీ వినబడనంత సౌండ్ ప్రూఫ్ ఏకాంతం
ఫ్లడ్ గేట్స్ ఎత్తేసిన గుండెనుండి వెల్లువైన కన్నీటి వరదలు
ఎవరి కంటా పడకుండా మది రిసర్వాయర్లో దాచేసే ప్రయత్నం
స్మృతి పథం వెబ్సైట్లో  జ్ఞాపకాల సీక్రెట్ ఫైల్స్ తీసి
పరికించి నవ్వడమో, ఎఅడ్వడమో  చేసే రహస్య తరుణం
మృతి పథపు ప్రస్థానానికి ఆత్మని సిద్ధం చేసుకుంటున్నట్టు
రెండో కంటికి కూడా తెలియనీయక
నీకుగా నీవే చేసుకునే నిశ్శబ్ద ప్రయాణ సన్నాహం
జరిగిన దానికి వగర్పో
జరగనిదానికి వగపో
అనవసరమన్న వివేచనా కలిగించే విజ్ఞాన వీక్షణం
కరిగి పోతున్న కాలాన్ని గాలం వేసి ఆపలేక
అలాగని చేజారిపోనీయనూ లేని అసహాయపు  సందిగ్ధం
ఒంటరితనం ఒక్కో సారి వరం
నిజం నేస్తం....
నిన్ను నువ్వు నగ్నంగా నిర్లజ్జగా
నీ అంతరంగపు అద్దంలో విశదంగా పరీక్షించుకునే  అవకాశం
మర్యాదపు వలువలు విప్పి పారేసి
అసహజపు మాస్కులు తీసేసి
అసలు సిసలైన నీ ఆంతర్యపు చిత్రాన్ని స్కాన్ చేసి చూపగల
అత్యద్భుత సత్యం
అందుకే ఒక్కోసారి
ఒంటరితనం మనిషికి చాలా అవసరం
మనిషితనం మిగులుందో లేదో అప్పుడప్పుడు
ఎవరికీ వారు చేసుకునే అంతరీక్షణ ....!!!
                                                              ప్రేమతో...జగతి

Saturday, March 26, 2011

My first publisher



He was there then
And now too by my side
In all my trifles and
Moments of joy too
I always read my tiny little poems to him
He never said much
No remark
At times a hazy smile
That’s all
Never complimented
I didn’t get him
It was on a day
When I penned
The grief of a stone
Uncared and unloved
He was moved
There was a
Trace of a tear in his eye
I felt happy
My poesy moved him
But never expected it was for me
That tiny trace of his tear
He carried all through

The day came…..
When I was given away
In a heedless manner
To another being
In a social relation called
Marriage
He bought me
Many things
All any father
Would buy for his daughter
Any brother for his sis
But there was always
Me, in my innocence
Did not realize
His concern for me
And his helplessness





He sat far away
When the sacrificial rites
Were going on…..
And me a scape- goat on the altar
Unknowingly
Slain and did not get the pain
Then and suffered a life
Of pressure and vain

Slowly he came to me
With a gift pack in hand
With a smile and a hope
He placed it in my hands

My childishness made a guess
It must be a saree
Or some valuable
Materialistic gift
But……
When I opened the gift wrapper
In a very casual way
There was….
A typed book in our lingo
And on the first page carried
His by line and his word of love
“May you not forget your poetic ability(akkkaki)
Maa kavithaa jagathiki”
 My eyes filled
And I didn’t find him around
Amazed at his diligence
Of collecting from rags
My jottings
And scribbles
He made them a book
And gifted me his love
My puny philosopher
Knew then …
That my only savior
Is my poesy
And he still looks at me











Even at this time
Every day for a poem
For a smiling wish..
My puny philosopher
That made me a poet
And was my first
Publisher….
Expecting not a single penny
From this poor old lady
What royalty can I pay him?
But for a jot of poesy!!!
                                           Jagaddhatri 6.50pm Tuesday 11-01-2011




To my Uday my little brother who was overjoyed to find me
In my poesy and called me in the morning from thousands of miles afar
The words that moved me was “akka! I saw ur poem in telugu literary circle I thought u are awake” this may mean nothing to many but he made me, my younger brother my philosopher and guide jagannath poosarla ….lots of love akka
And a very grateful thanks to John sathyanand who made this possible through his Telugu Literary Circle…love j

                                                 


Query


Often my daughter
Keeps asking me
Why do you
Sign lots of love
To every one
And I say its
Because …
I love all
She was hurt
So you love all
Momma
Not me alone?
Is not all
Your love
For me ever
She sulks…
I smile
And snuggle her
Into my heart
And
Say….
Darling
It’s because
 I find
You
In every one!

                        Jagaddhatri.. 4.40pm Friday 07-01-2011

THE SURGERY



Denying anesthesia with despotism
The critical surgery of candid analysis you
Performed on the
Malignancy of my possessive mind
Resurrected me to my elements
With your precise abscission of speech
The fatal growth of my ego
Was exterminated with
Efficient radiation of enlightening
The chemotherapy of words provided
To the abscess of my selfish heart
Reawakened me to my senses
All the traces of the carcinogenic
Feels and inhibitions of hatred
Are ruthlessly killed
Never to relapse
By the ample power
Of your antibiotic love
Spell bound remain me as 'i' no more
Surrendering to 'YOU'IN
Unbounded reverence
Thanking you in serene silence
Self promising, adequate
Post operative care
With a regular dosage of
Selfless love

                           jagaddhatri

గుసగుసలాడే అలలు



తగవులాడుకున్నాం మనం
నువ్వూ నేనూ
నిన్నటి కలలపై
రేపటి కన్నీటిపై.....

కిలకిలలాడే తడి పాదాల ముద్రలు వేస్తూ
ఇక్కడ....అక్కడ...
అంతటా....
గుసగుసలాడే వెండి ఇసుకపై

ఈ రోజు నిల్చున్నా ఒంటరినై---
నెమ్మదిగా మరలిపోయే తరంగంలా
పరిగెడుతూ అనుక్షణం
నా ఏకాంత సుదూరపు మలుపులోకి
ఎక్కడ నీ నవ్వు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తుందో....


ఇంగ్లిష్ : శ్రీ దేవి దత్త
విస్పెరింగ్ వేవస్
తెలుగు సేత: జగతి

Trance

Yester night
I met an angel
She had a golden quill
In her little hand
Seeing me sad
She caressed
My cheek
With her
Magic quill
And my long silence
Turned a brook
Of words
And is now
Flowing
Into …
The world
Of  poesy once again
Courtesy  my angel!!!

                              Jagaddhatri  4.30pm 7-1-11 friday  For my Sri with love....j


Friday, March 25, 2011

THE EXPERT’S JOB



Listening the heart
Is possible rarely to some
The heart keeps chatting to you often
As fortune knocks your door
To comprehend,and perceive
Is an art,that is alchemy.
Treasure lies where there is a heart
To acquire the riches you got to pay
A patient ear to the heart.
The heart that is perturbed
One which desires
The heart that turns a melody
The one which makes you insomniac
Is the paradigm of liveliness.
Staying spirited
And listening to the heart
Is the expert’s job.
{thanks to PAUL COHELO’S ALCHEMIST}

Telugu original: YAKOOB ‘NIPUNULA PANI’
English translation: jagathi

NATIVE TONGUE


All dreams near the one
Doused in a sound peaceful slumber

Danger greets the one who is
Walking with fear and fret
One who treads fearless
Reaches his destiny without hassle
One travelling lovingly can alone
Build himself as a complete man
One who apprehensively steps into
Forever suffers in the hell like life
Courage
Is a tool specially made for life
One who holds it
Doubtlessly stores his victory in the life’s almirah—

Fearless wandering is only real life
Isnt’t it!

    Telugu original: SAHAJA BHAASHA by YAKOOB
ENG TRANS:jagathi   11.30pm 01-03-2011 Tuesday
JANMADINA SUBHAKANKSHALU YAKOOB KAVIGARIKI….love jagathi







loving couple of poesy

ME.....



He knew I was there
And will be there
Awaiting from aeons
For him with my heart
And love in tact for him
But he dodges
With me………
He pretends not to recognize me
I smile at his antics
He sulks
I laugh away
He tells me
He is in love
With a fairy queen
I admire his love
He dismisses me off
He tells me he is not for me
I say not a word
He scolds me not to wait for him
I stand still
He persuades not ot see him
It increases my perseverance
He laughs wildly at my
Innocent adoration
My lips do not lose the gleam
Of the sweet gloss of love
Do not follow me
His stern orders
I feel sorry
For him
For he is a novice
In love
And is childlike
And does not recognize
The truth of love
I stand at his door
 And will stand until
My breathe lasts
For I know
When my sweet little lord
Comes back with
A wounded heart
Its me who got to take care
I pray for all his triumph

But always keep
Myself alert in offerance
All myself
For my innocent sweet lover
Who is running after
Mirages
Would one day
Find me an oasis
Awaiting in penance
For the thirsty traveller
Who lost himself in
The desert of love…….
If ever you find him
Tell him please
There’s someone
Praying for his success
But also…..
Awaiting his arrival
Either in triumph
Or trifle…
Won’t you.... please?
 ………………………….jagathi

Thursday, March 24, 2011

బ్రతికే ప్రతిక్షణం


  • ప్రేమ సాగరమెక్కడో లేదు
    నీ హ్రుదయాన్నే ప్రేమ సంద్రం
    చేసుకుంటే.....
    బ్రతికే ప్రతిక్షణం
    .....ప్రేమే..
    నిన్ను నడిపిస్తుంది
    నీ కన్నీరు తుడుస్తుంది
    అనంతమైన ఆ సాగరంలోని
    ఉప్పదనం కోటానుకోట్ల
    జీవుల అశ్రువులదేనని తలచినపుడు
    ప్రేమే నీకు తోడై..నీడై..నడిపిస్తుంది
    ప్రేమతో సహజీవనం అనుక్షణం
    ఓ జీవితకాల అనుభవం
    ..ప్రేమతో ...జగతి
    February 22 at 7:24pm · 

Monday, March 21, 2011

ETERNAL DOUBT



She calls me daily and asks me anew
“do you love me?”
Everyday as usual ‘yes I love you’
Is the answer
What are you doing,had your lunch, why is your voice so weak----
Series of questions,
I answer in clarity all of them.
She asks again ‘do you love me?’
Havent I said that I love you----irritation in the tone.
There ----you are annoyed with me,
‘you don’t have love for me’ she  fumes .
She sulks and until after noon
Does not even call me.
Doubting if she is still in the bad mood
I call her and wish.
The same question again
‘are you loving me?’
It had been so long since we are one, and repeatedly
‘How many times can I say the same word daily’.
There you are
‘You have lost love for me’ she snaps again


In the evening
Reaching home I try to wish her in good humor
finding her with a long face.
Keeping a querying face without  a word
She asks everything with her eyes
Unable to keep away I explain everything in words.
Again in the morning
When we are out running to our work
There will be a phone call from her again asking
‘Do you love me’.

Telugu original: NITHYA SANDEHAM by YAKOOB
English translation: Jagaddhatri

THE SPRING IN MY STEP…


THE SPRING IN MY STEP…
And….
That was the moment…..
Yes….I sensed it….
The seed fertilizing
The sprouting tiny
Plant of life
In my womb’s soil
Even before the test was confirmed
I knew there existed
In me a life anew
I gathered all my
Strength and all
My power in
Nurturing it
I put up with
Many hasssles and trifles…but
My puny plant in me
I did not disturb
I safe guarded it
Even in the intense
Shocking  sorrow ….of
My dad’s demise
A bondage severed
And another
Revered to me
With the umbilical chord
I pleaded the doctors
For a caesarean 
For I do not want
My teeny one to
Suffer encircling
And strain in effort
To come out
And at last …..
After a severe
Penance ….
She stepped onto
The world…
In all grace
And grandeur
My little curly…
The joie de vivre
Of my woman’s life….!!!
                         With lots of love to my Curly on her birthday
                                     …………….urs moma jagathi  03-02-2011 Thursday 4.15 pm

BUT………STILL….!!!


BUT………STILL….!!!
Many a time
Nibbling the earlobes
He whispers into me
Umpteen sweet words of love
Phrases of amorous poesy
Many a time
He gives me a hug
Congratulating my success
Appraising my work
Every moment together
He gifts a caress
Or a sweet kiss
Now and then……
In fact, very often….
To be honest…..
Always…….
We read poetry together
We think , talk, write
Share, Live love….
Every moment with me
He enunciates
Is a poem to him…
In ecstasy I snuggle
Into him and sweetly
Murmur….every day with him
Is for me a fiesta…
In spite of all this
Still there…
Twitching my sinews
In the cage of delicate bones
A fistful tiny organ
And a little matter
Gray in color in my head
Still…..longs for…
Something more
It’s just a great expectation
Of mine….wishing
Him to pen down
A line for me
With love
Words are fragrant blooms
Forever are they so…
But…….
I wanna see and feel
His love in black and white…..
And smile in pride…..
To the world of letters
Oh! I wish he gets me soon
My strange selfish crazy wish
That I can never word
To him at all……sssshhhhh..!!!!
                                                               Jagathi…8.10pm..feb 27th 2011 Sunday






Making love….poetry


Making love….poetry

I know not
How to make poetry
But aimed to put
My words in sense
I gathered all my words
And all my similes and metaphors
I was choosy and picked up
Imagery and phraseology
And then with reverence
I sat to knit a poem
I tried to take a metaphor
And weave a beautiful
Piece of love
Lo! I metaphors mocked at me
At my innocence….
Leaving it, I took a beautiful simile
To make a philosophy of life
Oh! Can you…. fit me into your
Poor figures of speech
Life laughed at me….
So did I fail again….
I took care in chosing phrases
Giving up not
I  sought to make a love poem
For love is the only theme
I know and that’s the only
Asset I pride in
I endeavored
To pen down a feel
Of love into poesy
And oh! Ironically
It turned out to be
So melancholic
And I knew for sure
I can never change
The tone of my
Heart….
For my heart does not
Know how to
Make poetry
But to suffer pain
Of love and life
My  mind laughs at it
Chides it for its childishness
It enlightens me to
Live poetry and
Never try to make it
Countless efforts are
Already existing
By umpteen great souls
And still the quest is on and on….
Aah! I realize the fact..
Do all the words
and lingos
Suffice ……
To define love and poesy……no way
Smiling at my incongruity
I cap off my pen and
Switch off my light
And put off my immature
Venture to make a poem…..
For love and poetry
Cannot be made
They ought to happen…
They are to be lived…..
And not recorded ……in words….
At least I cannot….do it….!!!
(with apologies to all love poets)
                          Lots of love jagathi..9.15pm Tuesday 9-2-2011

ప్రేమాయుష్మాన్భవ!!!


ప్రేమాయుష్మాన్భవ!!!

మమత కలిగి మసలండి
మీ హృదయ పరిమళమై
నిండి ఉంటాను
మీ మతాల , హితాల
హేతువాదాలతో
నన్ను పరిమితించ
ప్రయత్నించకండి
మీరే దేశమేగినా
ప్రవక్తలుగా ప్రవచించినా
కవులుగా కవన హారతులు పట్టినా
మీరంతా
వెదికేది
తుదకు నా చిరునామానే
నా వొడిలోనే
ఆదమరచి
నిదురించాలనే
మీ ప్రయత్నాలన్నీ
గమనిస్తూనే ఉంటాను
నన్ను మీరు చేరుకోవడమంటే
మిమ్మల్ని మీరు కనుగొన్నట్టే
అందుకే మీ ప్రయత్నాలన్నీ
చూస్తూ
బాల్య చేష్టలు చూసి
చిర్నవ్వే కన్నతల్లిలా
మిమ్మల్ని సేద తీర్చే
ఒడి నా దేనని
మీరే తెలుసుకుని
వచ్చే దాక
కనురెప్ప గాస్తూ
ఎదురు చూస్తాను
అలసి సొలసి మీరు
నా చల్లని ఒడిలో
ఒదిగి పోయిన క్షణం
మిమ్మల్ని మనసార
ఆశీర్వదిస్తాను
అమ్మ మనసుతో
ప్రేమాయుష్మాన్భవ !!!
(ప్రేమే మనతో మాట్లాడితే ఇలాగే అంటుంది )
                  ప్రేమతో.......జగతి
వాలెంటైన్స్ డే సందర్భంగా అందరికీ ఈ నా ప్రేమ పూరిత అభినందన !!!


Sunday, March 20, 2011

నగవు


బతుకు తోటను చదును చేసి
వ్విత్తనాలెన్నో చల్లాను
చాల మొలకెత్తాయి
కలలూ, కల్లోలాలూ
వ్యామోహాలూ, వైఫల్యాలు
ప్రేమలు, పాశాలు
ఇంకా ఎన్నో .....
కొన్ని పూసి ఫలించాయి
కొన్ని వృక్షాలు కూడా అయినాయి
కాని ఒక్కటి మాత్రం
మొలకెత్త నిరాకరించింది
పాదు చేశాను ,నీళ్ళు పోసాను
అహర్నిసలూ ఆపసోపాలు పడ్డాను
ఉహు.... మౌనంగా ఉండిపోయింది
పిచ్చిదాన్ని
నే వేసింది విత్తనం మాత్రమె
దాని జీవం నీ దగ్గరుంటే
అది ఇక్కడెలా జన్మిస్తుంది
నా వెర్రి  తనానికి
నన్ను నేనే వెక్కిరించుకున్నా
నీ రాకతో ....
ఆ బీజం అంకురించి
పుష్పించి
ఫలించింది నీ
పెదవుల పై
నీ చిరునగవై.....

ఆ కిటికీ ....


  ఆ కిటికీ ....

మూడు దశాబ్దాల క్రితం...ఆనాడు
నవ వధువు నుదుట కళ్యాణ తిలకంలా
వెల్ల వేసిన ఆ చల్లని గూటికి
అలంకారంగా కళకళ లాడుతూ....ఆ కిటికీ

తొలిసారి ఆతని దర్శించిన
ఆమె సంతోష విప్పారిత నేత్రాల్లా
తెరుచుకున్న రెండు తలుపులు
రంగు వేసిన ఇనుప చువ్వల వెనుక
గువ్వ పిట్టలాంటి  కన్నె మనసు వెన్నెల కలలు
అమాయకపు ఆ కన్నుల్లోంచి
గుండెల్లో పట్టం కట్టిన
ఆతని గూర్చిన ఎన్నో ఆశలు
మరి ఎంతో అనురాగం
ఆమె ఎదురు చూపులు
అతని దొంగ చూపుల మురిపాల నడుమ
ముచ్చటగా సాగిన తొలి ప్రేమ వైనాలు
మాట కలపలేని మధుర మౌనాలు                              
మనసు విప్పని మొమాటాలు
కాలపు కాటిన్యానికి చెదిరి దూరమయిన
చిరు హృదయాలు.....

జీవన ప్రవాహంలో తరలి పోతూ
రెండున్నర దశాబ్దాల తర్వాత
మళ్ళీ ఒకరికెదురుగా ఒకరు
అతనికి ఆమె...
గుండె గదిలో మూలకు విసిరేసిన
ఓ కాగితపు ఉండలాంటి  జ్ఞాపకం

ఆమెకు అతను .....
పునరాగామించిన జీవన సాఫల్యం
అతని కరుణ రసార్ద్రతా స్వీక్రుతిలో
ఆమె ఆరాధనా సాంద్రతల  నడుమ
రాగ రంజితమై  సాగించాలని
నవ జీవన ప్రస్థానం
ఇరువురూ చేసుకున్న
పునఃప్రమాణం

ఆమె నిరీక్షణా రజతోత్సవ కానుక
అతని పునఃసాన్నిహిత్యం
 ఈరోజు .....
తమ తొలివలపుల సుమధుర సాక్షి
ఆ కిటికీ ముందు
చేయి చేయిగా నిలబడి
జీవన సంధ్యవేళ ఒకరికి ఒకరై
ఆనందంగా వారిరువురూ
కాలంతో పోరాడి అలసి
వెళ్ళలేని గోడల నడుమ
జీవన శిసిరంలో
శిధిలమైనా.....
ముదిమి ముత్తయిదువులా
వారిరువురినీ ఆశీర్వదిస్తూ
సంధ్య కెంజాయలో
కుంకుమ కిరణంలా
వెలుగుతూ తృప్తిగా
ఆ కిటికీ.......!!!!
                       ఫలించిన మా ప్రేమకి
                                           ......... ప్రేమతో ...జగతి

ఏమిటో...ఇది....?



ఏమిటో...ఇది....?
ఆమె అంటున్న మాటలన్నీ
ఎక్కడో ఎప్పుడో
విన్నట్టుగానే
తెలిసినట్టుగానే
అనిపిస్తున్నాయి
ఆమెతో నాకు
పరిచయమే లేదు అయినా ...
ఆమె మాటలు జన్మజన్మాలనుండి
ప్రతి రోజు వింటున్న  ఓ తియ్యని అనుభూతి
పలకరింపులు,  నవ్వులు .....ఎందుకో మరి...
తన ప్రేమ, ఆవేశం, నివేదన
అన్నీ ఏనాటినుంచో   ఎరిగున్న భావన
అవును ఆలోచిస్తే
అర్ధమౌతోంది
ఇవన్నీ నేను విన్న మాటలే
నా జీవన సహచరి పెదవుల వెంట..
అంతే కాదు అన్నీ నేనూ అన్న మాటలే
వలపు మధురిమలో
పులకరించిన
పలవరింతలే
నా ప్రేయసి ముని వేళ్ళ పై
నే మీటిన అనురాగ స్వరాలే
అందుకేనేమో ఆమె
మాటల్లో ఏదో తెలిసినతనం
పరిచయమైన ప్రేమ తత్త్వం
జీవన సంధ్యా సమయంలో
జీవితమొక తీరుగా
నడుస్తోన్న వేళలో
ఇన్నేళ్ళ ప్రేమ సహచర్యంలో
వింతగా  కొత్తగా
అనిపిస్తోన్న పాత మాటలు
ఎదిగిన చెట్టు మళ్ళీ
చివురులు వేస్తున్న వైనం
ప్రేమకి పాతదనం ఉందా అసలు
లేదు కానీ...
ఆమె పలుకులు సన్నజాజి మొగ్గల్లా
సున్నితంగా
మొగలిరేకుల్లా తియ్యగా
గుచ్చుకుంటున్నాయి
ఎక్కడో దశాబ్దాల క్రితం
హృదయంలో పటం కట్టిన తొలి వలపు
మళ్ళీ జీవం పోసుకుని
ఉలిక్కి పడి...
ఉక్కిరిబిక్కిరై...
గుండె ఝల్లు మనిపించేలా ....
ఆమె ప్రతి చర్య నన్ను
ఇప్పటి 'నా'నుండి
ఎప్పటి 'నేను'నో
తలపిస్తోంటే...
నా ప్రేయసి వెచ్చని కౌగిలిలో  చేరి
'ఆమె' ను తలపులనుండి
నేట్టేద్దామనుకుంటా....
నిర్మల తటాకంలాంటి
నా హృదిలోకి
సూటిగా చొచ్చుకుపోయే
ఆమె విశ్వమంత
నిర్మల అనురాగ ఝరిలో
నాకు తెలియకుండానే
నన్ను నేను మరిచి
కరిగి పోతూ ....
మనసు నిలవరించుకోలేక
ఆమెతో మాట కలుపుతూ
ఉంటా.......
దీన్నేమంటారో మరి......నాకే తెలియడంలేదు
'ఆమెకు' తెలుసునేమో  అడగాలి......!!!

                          ప్రేమతో జగతి 7.55am friday 11-02-2011
1977 లో ఇదే రోజు ఈ జగతి కవిత ఒకటి రాసిన రోజు అది 'పురోగామి' అనే లిఖిత పత్రికలో
ప్రచురించిన వారు రామతీర్థ అప్పటికి ఆయనకి 17 నాకు  13 ఏళ్ళు ....ఖుర్దారోడ్లో ఒరిస్సాలో
ఈ రోజు ఓ కొత్త కవిత మీకోసం .....ప్రేమతో జగతి
 

జగత్కాంక్ష


జగత్కాంక్ష

ఆగమించే ప్రతి వసంతమూ
నాకొక నిరీక్షణా దీక్షా వ్రతమే
అనంతంగా సాగే నీ కవన యజ్ఞంలో
ఛాయా మాత్రంగానైనా నేనగుపిస్తానా అని
అనుక్షణమూ  అంతర్మధనమే
కుముదంలా నా గురించి కధ రాయమని
అభిమానం విడిచి అర్ధించను గానీ
నా అస్తిత్వాన్ని నీవు అక్షరీకృతం చేయాలని
అంతరాంతరాలలో ఆరాట పడతాను
నీ అనుసృజన యాత్రలో
చిరు పద రత్నమై పల్లవించాలని
గ్రీష్మానుతాపంతో పరితపిస్తాను
నవరసాల అభివ్యక్తి నిండిన
ఆషాఢ మేఘపు నీ హృది
నా కోసం ఓ కవితా బిందువు చిలకరించాలని
ఆర్త జగతినయి  ప్రతీక్షిస్తాను
తరలి వచ్చే హేమంతపు దివ్య పరిమళాలలో
చేమంతుల సీమంతినిగా
నీ మాటల మధురిమ కోసం కాచుకునుంటాను
ఆకులుగా ఆశలన్నీ రాలిపోయే వేళ
మంచు ముత్యాల శీతల హేలలో
నా గురించి వెచ్చని ఓ ఆప్త వాక్యం రాస్తావేమోనని
ఓడని మోడునై కనురెప్పగాస్తాను
ఆరు ఋతువుల వర్తులం
నిస్తేజంగా, నిర్లిప్తంగా ఆవర్తించాక
నా కన్నీటి నిరాశా ఫలిత పత్రాలను రాల్చి
పాత కోర్కెల సరికొత్త పూతలతో
తొగరు లేచివురునై అంకురిస్తాను
ప్రతి చక్ర భ్రమణమూ
ఆత్మీయానురాగంతో నీవు
నా గురించి రాసే
ఒక్క , ఒకే ఒక్క అక్షరం కోసం
ఆశ నిరాశల అంతరీక్షణతో
అనవరతమూ ఆకాంక్షిస్తూనే ఉంటాను
నీ దివ్యానుగ్రహ అక్షర హారాన్ని
ధరించే అర్హురాలిని కావాలని
ఆయువిచ్చిన ఆమనులన్నీ
అవిశ్రాంతంగా ఎదురు చూస్తూనే ఉంటాను

                        ...............ప్రేమతో జగతి

నిజమే సుమా ! మాట్లాడుకోవాలి !


నిజమే సుమా ! మాట్లాడుకోవాలి !

మాట్లాడుకోవాలి నిజమే దోస్త్ !
అనుభవపూర్వకంగా ఒప్పుకుంటున్నా ....
నువ్వు చెప్పిన జీవిత సత్యాన్ని
సంభ్రమ,సందిగ్ధ లేబ్రాయంలో...
పెదవులతో గాక మనసు విప్పి
మాట్లాడి ఉంటే..
జీవితం చేజారిన స్వప్నంయ్యేది కాదు
విశ్వవిద్యాలయ ఒడిలో
చెట్లనీడన చేరి
హరిత పత్రాల్లా మనమంతా
కళకళలాడినపుడు
తలనిండ పూదండ దాల్చి
మొలక నవ్వులతో మురిపించిన
మురళిగాడి రాణి పాటతో
మీ ప్రసాద ద్వయ హాస్యాన్ని
చెట్టు కింద అవ్వ కొట్లో
టూబైత్రీ కాఫీలతో కలిపి ఆస్వాదించినపుడు
కలత కలలను నేను గానీ
కవిత కళలను నీవు గానీ
ఎప్పుడూ ఆవిష్కరించనే లేదు
 చలాన్ని చర్చించి, కిన్నెరసాని సౌందర్యాన్ని
చివరకు మిగిలిన నా కృష్ణ పక్షాలలో
మీ చెలిమి వెన్నెలతో నింపు కున్నప్పుడు
ఆర్ద్రతతో మాటరాలేదు
హిమంలో జ్వలించి, గీతాంజలిలో సేద తీరి
ఫైజ్ ఉద్విగ్నత, గాలిబ్ సాంద్రత
ఎమిలీ నిరాశా నిస్పృహల మధ్య
యులిసిస్ లా డోలాయ మానమౌతూ
ఇలియట్ వేదనా మయతలోకి
జారిపోయనే గాని
మీలో ఎవ్వరితోనూ
ఒట్టు, నిజంగానే మాట్లాడలేకపోయాను
చిరు నవ్వుల ఆనంద భైరవితో
మిమ్మల్ని అలరించి
అంతరంగాన్ని మాత్రం అపరిచితంగానే ఉంచాను
పెదవి విప్పి పలికే లోపు
నాన్న ఇచ్చిన  మాట కత్తితో
చదువులమ్మకు నాకు బొడ్డు తాడు కోయ బడ్డాక
దశాబ్దం పాటు నిశ్శబ్ద నయ్యాను  కానీ
పెదవి మెదపలేదు
ఆటు పొట్ల కాలంతో కసరత్తు చేస్తూ
ఆపుకోలేని కన్నీటి మాటలను
అప్పుడప్పుడూ మాటాడబోతే
మాట్లాడకూడని వాళ్ళతో మాట్లాడానని
మాట పడ్డాక తెలుసుకుని
మళ్ళీ మౌనాన్నే ఆశ్రయించాను
దశాబ్దాల నిరీక్షణకు
ఆశీర్వాద ఫలంగా
తొలి స్వప్నాల మరు చంద్రోదయమైనప్పుడు
ధైర్యం చేసి మాటల పూవులను దోసిళ్ళతో నింపి
పదాభిషేకం చేస్తూ
అక్షరాల వెల్లువనై నా హ్రుదయాన్తర్యామికి
పాదాక్రాంత మైపోయాను
నిజం నేస్తం! నువ్వు చెప్పింది
మాటల మంచి మాత్రమే
మనుషులను కలపగలదని
దూరాల నుండి సాగి
నా చేతిలో ఒదిగి మాట్లాడిన
నీ ప్రాణ పదాలేగా
నన్నిలా మాట్లాడిస్తున్నాయి
మనసుకు మాట అద్దం పట్టాలి
మాటలకు మనసునద్ది
గుండె సవ్వడి ఆగిపోయేదాక
నిమ్మళంగా,నిర్మలంగా, మాట జారకుండా
మనమందరం మాట్లాడుకోవాలి
మనలా జీవితంలో తిరిగి
మాట కలుపుకునే యోగం
అందరికీ దక్కదుగా మరి !
             ప్రేమతో ..జగతి 7pm..25-09-07
(చాల కాలం  తర్వాత నన్ను మాట్లాడించిన నా స్నేహితుడు
డాక్టర్ ప్రసదముర్తి కవిత "మాట్లాడుకోవాలి" చదివి హృది కదిలి
మాటల్లో ఒలికి పోయాను. ఆ తర్వాత మా మిత్ర కూటమిలో "మురళీ నాదం" మా మిత్రుడు మురళి వెళ్ళిపోయాడు హటాత్తుగా , డాక్టర్ పిబిడి విప్రసాద్ ప్రకాశం జిల్లాలో నవోదయలో పనిచేస్తున్నాడు )
                

పలకరింపు


ఇప్పుడిప్పుడే
ఓ నలుపు తెలుపు
సేతాకోక చిలుక
నా గుండె మీద
వాలింది
నాకు తెలుసు
అది నీ పలకరిమ్పేనని
సున్నితంగా ముద్దాడి
తిరిగి పంపించా
నిన్ను కుశల మడగమని.....ప్రేమతో....జగతి

ముఖ చిత్ర కూడలి







ముఖ చిత్ర కూడలి

ఇక్కదందరివీ ముఖ పరిచయాలే
కొందరివి అసలు ముఖాలైతే
కొందరివి తగిలించుకున్నవి
మనసులు విప్పి మాటాడుకునే వారు
కొందరైతే ఇతరుల మనసులు
తెలుసుకునే ప్రయత్నం
మరి కొందరిది
అందరకి ఒక్కటే సారూప్యత
ఒకరి గురించి
మరొకరు
తెలుసుకోవాలని
పరిచయమవ్వాలని
మొహమాటాలు వీడి
ప్రేమ పంచేవారు కొందరు
స్నేహ పరిమళాన్ని
వెదజల్లే వారింకొందరు
అన్ని వయసుల వారికీ
ఒంటరితనం మరిపించే
ఇదొక చౌరస్తా కూడలి
ఎన్నెన్నో మనసులకిది
భావాల వారధి
కవితలై కరిగిపోతున్నా
మాటలై మంచి పంచుకున్న
హృదయ సంద్రాలు దాటి
మమత తీరాలు
చేరే మాటల
చిత్ర కూటమి ఇది
ఇక్కడ
ఈ గనిలో
నీకో చిక్కని
కవితల చక్కని
వజ్రాలు దొరుకుతాయి
సమాజ హితాల
శ్రేయోభిలాషులు ఉంటారు
విశ్వాన్ని పలుదిక్కులనుండి
మీటతో పలకరించే
మాటకారులుంటారు
సకల సాహిత్య
సమ్మేళన కర్తలు ఉంటారు
ఒకనాడు కలసి కూర్చుని
ఆడుకునే కబుర్లు
ఇవాళ ఎవరింట్లో వారే
కూర్చొని ఇతరులతో
మాటాడు కుంటున్నారు
ఒక్క రోజు మరొకరు
కనిపించకపోతే
కలవర పడి
వెతుక్కుంటున్నారు
మనిషి మాటకోసం
ఎంత మొహం
వాచి ఉన్నాడో
మనసెంత వ్యక్తీకరించాలని
తాపత్రయ పడుతున్నాడో
అందుకు నిట్ట నిలువు
అద్దం
ఈ ముఖ చిత్రం
ఎక్కడినుండో మిత్రులని
కలుపుతుంది
కొత్త మిత్రులని
చేరుస్తుంది
అందుకే ఇటీవల
ఎవర్ని చూసినా
ముఖ చిత్ర కూడలిలో
కలిసిన వాళ్ళకి మల్లె
అగుపిస్తున్నారు......ప్రేమతో....జగతి