Saturday, April 30, 2011

I WANNA SPEAK….



I speak when people want me to
I cannot when people want me to
I speak up when no one is there to hear me
i wanna speak my love ...my heart...love j
I speak when I m not supposed to
I speak not when I am expected to
I babble to myself
And in fact
I sometimes I can’t speak to myself too
But….i feel
There’s lot to say
To many around me
To many hearts who lend their ears to me
There are a few with whom I long to speak
But they can’t pay their ear to me
There are people who want to hear whatever I say
But I have no words for them
And ironically…….
I am the trainer of speaking skills
And that makes me roll down
In laughter…..
And I speak …….talk …..babble…..but always ….love speaking my heart..
………………………………………….lots of love jagathi 1.49pm Chennai (the president hotel )30th april 2011 Saturday

Wednesday, April 27, 2011

ఆమె కధ....









ఆ  రోజుల్లో....

అప్పుడే లోకం కళ్ళల్లో పడిన ఆమె 
బతుకు విస్పోటనంలో.........ఎగసి ఎగసి అలసి సొలసిన  ......!!!
ఆమెగా కళ్ళు తెరిచి చూసిన లోకం
ఒక్కసారిగా ఎన్నెన్ని పరిచయాలో                                    
అబ్బాయిలు అమ్మాయిలు మాస్టార్లూ
కవులూ రచయితలూ స్నేహితులూ
ఉక్కిరిబిక్కిరైన ఆ మనసుకి 
సాంత్వన ఇచ్చేవి పుస్తకాలే
సాహితీ స్రష్టల మస్తాకాలే 
బైరాన్, షెల్లీ, కీట్స్  చదివి ఆనందం
హెర్మన్ హేస్స్ , డిలాన్ తోమాస్, లారెన్స్, 
టాగోర్, అరబిందో, జాయిస్ 
ఇలియట్, మిల్లర్, చలమ్స్
అప్పట్లో ఆమెకైన మంచి బాయ్ ఫ్రెండ్స్ 
రోజు రోజూ మెదడులో నిండుతోన్న సాహిత్యం
ఆమె కళ్ళల్లో ప్రతి క్షణమొక రాగోదయం
వెలుగు నింపుకున్న ప్రాణోదయం
స్నేహితులూ సన్నిహితులూ
ఏడిపించే వారూ అన్నిటికీ
అందరికీ.......
ఆమె ప్రేమ పూరిత పలకరింపే సమాధానం
స్వచ్చమైన మనసు అద్దాన
జారిన ముత్యాల జ్ఞాపకాలు
బంధాలకు లొంగిపోయిన 
జీవన మాధుర్యం 
మోడైనా ప్రాణం కోల్పోని ప్రేమ తపన
దశాబ్దాల అనంతరం 
ఎక్కడో  ఎద మూల ఆర్కైవ్స్ లో 
కదలిక....
వినబడుతోన్న ప్రేమ అడుగుల సడి
జీవన సంధ్యా కుటిలో .....మరల చివురించిన మరులు .....!!!
తిరిగి కదలాడే రాగ రంజిత మానసం
జాల్వారిన కన్నీటి ముత్యాల సరాలు
చేజారిన మూడు దశాబ్దాలు
మళ్ళీ ఇప్పుడు .......
ఎన్నో ఏళ్లుగా మూసేసిన గుండె గది 
తలుపులు తెరుస్తోన్న మధుర స్మృతులు
మళ్ళీ ఒక్కసారిగా.....
అదే భావన ... మళ్ళీ ...
ప్రేమలోకంలోకి  అప్పుడు అడుగు వేసినట్టే
ఇంకా తనని మరిచి పోని
తన అనుకున్నవారింకా ఉన్నారని
అదే కళ్ళల్లో ఇప్పుడు 
సాఫల్యత  సంతోషం....
ఒకే జీవనంలో  రెండో సారి జన్మించిన
అపరిమిత ఆనందం
పరాజిత అయి చెదిరిన మనసు 
ఈ నాడు అనురాగ  పులకాంకిత అయి
ప్రేమ మార్గమే ఎంచుకుని
ప్రేమ నే నమ్మిన 
ఆమె అచంచల విశ్వాసానికి
దయతలచి ఆమె సాచిన 
కొంగునిండా మళ్ళీ 
తిరిగి అవే తీయని ఉసుల రాసులు ....
ఆమె ప్రేమాన్విత...
తనని మది నిలుపుకున్న వారి
మన్నన పొందిన 
ప్రేమ విజేత...
ఆమె విజయం 
తనని ప్రేమించిన వారి హృదయం
నిధి చాల సుఖమా రాముని సన్నిధి చాల సుఖమా 
అన్నాడు త్యాగరాజు
నిధి చాల ప్రియమా 
ప్రేమికుల చెలిమి చాల వరమా...
అంటుందామె...
ఆమె  ప్రేమ జగతిలో 
అందరూ ప్రేమస్పదులే..
ఆమె మనసులో అందరూ 
శాస్వతులే......!!!
ఇదీ ఆమె కధ .........ప్రేమతో....జగతి.
27-04-2011 6.54pm wednesday THE PRESIDENT HOTEL... CHENNAI 




చేజారని తరి తీపి గురుతుల పూలు.....!!!
                                                                                                                 ..........ప్రేమతో......జగతి

 














Monday, April 25, 2011

మా విశాఖ డిలైట్ హౌస్...!!!

అతనిది మనోధర్మ సంగీతం 
మేధో సాంద్ర సాహిత్యం
వెరసి అతనో డబల్ ధమాకా 
నవ్వుల పువ్వుల మా విశాఖ డిలైట్ హౌస్ మా  "భరాగో"                                       
నవ్విస్తూ తానవ్వక                              
ఒప్పించుకు తిరుగుతూనే ఉన్నాడు
మాట పెళుసు 
మనసు మెత్తనే
పేదరికపు ఉలి దెబ్బలతో 
రాటు దేలిన వాడు మరి
వారాలబ్బయిగానే జీవితానికి
విధేయుడిగా ఉంటూ
కధన సేద్యం చేస్తూ
హాస్యపు పంటలు పండించాడు
మనిషి స్వభావం పట్టుకోవడంలో
సి.టి. స్కాన్ అతను
మూడుకోణాలనుండి మనిషిని
తివర్ణ చిత్రంగా త్రీ డి లో విశ్లేషించగల దిట్ట 
ఫ్రాయిడ్ . మామ్, లారెన్స్, ప్రభావం ఉందంటాడు తనపై నిర్మొహమాటంగా 
తనకి తానే ఓ విశిష్టమైన అభివ్యక్తితో
అన్ని వైపులా వెలుగు సారించే 
మా విశాఖ డిలైట్ హౌస్ తాను 
జీవన విషాదాలకు 
సరదాల కర్టెన్లు వేసి 
నవ్వు పువ్వుల డిజయిన్ లెన్నో చెక్కిన రస శిల్పి
కదిలినన్నాల్లూ తానో టైటానిక్ 
రసజ్నులందరికీ అతని సాంగత్యం
ఓ మంచి టానిక్
డాల్ఫిన్ హౌస్ లా, కైలాసగిరిలా
సింహాద్రి కొండలా
మా 'భరాగో' అందరినీ  కదిలిస్తూ
తాను మాత్రం కదలని కొండై నిలిచాడు
అలాగే నిలిచి ఉంటాడని
ఉండాలని అనుకున్నా 
(నిజానికి ఇప్పటికీ ఉన్నట్టే అనిపిస్తుంది)
కాకుంటే అల్లరి పెడుతూ 
మొరాయిస్తోన్న దేహానికి 
బుద్ధి చెప్పి వదిలి వెళ్ళాడు  
అక్కడ యముడికో ఇంద్రుడికో 
ఓ గాట్టి "వార్నింగ్" ఇచ్చి 
త్వరలో మళ్ళీ వినూత్న దేహధారుడై
మా సాహితీ లోకానికి విచ్చేస్తాడు 
"మీకూ కధలే ఇష్టం " అంటూ మరిన్ని చెప్పడానికి ...ప్రేమతో ..జగతి 
22.10 pm sunday  18/04/2010 
(ఈరోజు భరాగో గారి సంవత్సరీకం ఆ సందర్భంగా అప్పుడు ఆంధ్ర భూమిలో అచ్చయిన ఈ నివాళిని చిన్ని మార్పులతో..25-04-2011..)


Thursday, April 21, 2011

ఎదురుచూపు




ఎంత చెప్పినా వినవుగా
నిరీక్షించొద్దు
 నాకోసమంటే....
అన్నాడు నెలరాజు ఆత్మీయంగా
చిర్నవ్వింది కలువ
అతని ప్రేమకి.....ప్రేమతో...జగతి 
                                                     

రస ఝరి


కాసిన్ని అనుభూతులు
మరి కొన్ని అనుభవాలు
రంగరించి ఓ కవిత నల్లగలను
కానీ...ఎక్కడో ఏదో వెలితి
తృప్తి ఇవ్వదు ....
హృదయావరణం మిరుమిట్లు గోలిపేంత
రాసోద్దీపన జరిగినపుడు
నవనాడులూ పల్లవించి
శ్రుతిమించి రాగాలాపన చేసినపుడు
అనుభూతులు శ్వాసించి
అనుభవాలు శాసించి
మది నదం ఉప్పొంగి 
నవీన రస ఝారినై
అక్షారాలై  ప్రవహిస్తే
ఆ క్షణం
నేనింకా బతికే ఉన్నానని......

              ప్రేమతో....జగతి 



Wednesday, April 20, 2011

'నవ్య' లో నా 'కధ'(కవిత)

కధ 

అది ఒక మామూలు ఉదయం
ఓ గుప్పెడు మల్లెలు కనిపించాయి
సిటీ స్క్వేరు  వద్ద  
మరుసటి రోజు మరో చోట ,
ఆ తర్వాత మరు రోజు మరో చోట.

మల్లెలు అతి వ్యాప్తి  ఇరకాటాన  పడిన 
మషీన్ గన్లతో గుసగుస లాడాయి ఇలా:
'విప్లవం ఇక తుపాకుల బారెల్ నుండి రాదు:
విసిగి వేసారి ఉగ్గబట్టుకున్న 
గుండెలు  ఒక్కసారిగా ఒకే 
లయలో జోరుగా కొట్టుకుంటే ,
పలు వర్ణాల ఒంటరితనాలు 
రెపరెప లాడే పాతాకలుగా మారినప్పుడు వస్తుంది.

విప్లవం కూడా 
చీకట్లో దొంగలాగా అడవుల దారుల్లో
వచ్చే తన 
అలవాటుని మార్చుకుంది:
ఇప్పుడది నర్తించే పాదాలతో 
పగటి మెరుపు వెలుగుల్లో వస్తుంది:
తన ముసుగునుండి సూర్యునివైపు  సూటిగా చూసే 
కనుదోయి నుండి వస్తుంది 
మబ్బులపైకి విసిరేసిన 
తెల్లని టోపీల ఉరుములనుండి వస్తుంది
తన ప్రియునితో యుద్ధ టాంకర్  పై
సవారి  చేస్తున్న అమ్మాయి
విస్ఫోటక కిలకిలలనుండి వస్తుంది
నాయకుడూ అనుచరులూ కూడా లేని
అందరోక్కటై 
ఆలపించే వేయి తలల భవిష్య గీతంలోనుండి 
కొమ్మలేస్తున్న  చిన్ని చేతులు
'వి' అనే అక్షరాన్ని అల్లిన చేతి రుమాళ్ళ మార్పిడినుండి వస్తుంది 
 విప్లవం వైరసులకన్నా  తొందరగా విస్తరిస్తుంది 
ఈ-మెయిల్స్ తో , ఫేసుబుక్ కను సన్నలతో ,
ట్విటార్ నుండి రెక్కలు టప టప లాడిస్తుంది.
తుపాకి కి అర్ధం చెక్క ముక్కేనని
తుపాకీ గుండు నారింజ పండని
బాంబు రోజా పువ్వని 
మనిషికి కొత్త పర్యాయ  పదాలనిచ్చే  
నవీన నిఘంటువుని సృష్టిస్తుంది .
కవిత్వానికి 
ఆశ్విజ్ని , సయిబెరియా ని గుజరాత్ ని తట్టుకు బతికే 
దేహ దారుడ్యాన్నిప్రసాదిస్తుంది.

వంచక నాయకులారా, జాగ్రత్త!
మా అహింసకు భయపడండి!
మల్లెలు ఎక్కడైనా అగుపించవచ్చు ,
ఈ క్షణాన్నైనా గొర్రెపిల్ల గెద్ద రెక్కలు పెంచవచ్చు
ఈ ఒక్కరికీ తెలియదు ఏ హృది నుండి ఏ హృదికీ
శ్వేత ప్రవాహం ప్రవహిస్తుందో . 
చాల కష్టం ఇక జోస్యం చెప్పడం:
మాకు ప్రేమ, మీకు చావు ఐన దాన్ని గురించి.
చివరి నవ్వుని చర్చించుకుంటున్న కామ్రేడ్స్ ,
ఇది డాలర్ల దీ కాదు బంబులదీ కాదు 
ఇది మాది, మా విరబూస్తున్న ఆశల చిరంతన సౌరభం 

మలయాళం : డాక్టర్ కే. సచ్చితానందన్ 
ఆంగ్లానువాదం: డాక్టర్ కే.సచ్చిదానందన్
తెలుగు సేత: జగద్ధాత్రి 

జాస్మిన్ రివల్యుషణ్
మల్లెలే విప్లవిస్తే .....!!!

 
 
మిత్రులందరికీ! ఈ వారం అనగా కొత్త "నవ్య" 27-04-2011 లో ద్ర.కే.సచ్చిదానందన్ గారి "a new poem" అనే కవితకు నేను చేసిన అనువాదం ప్రచురితమైంది . శీర్షిక"కధ" నవ్య సంపాదకులకు ఆ కవితను అనువాదం చెయ్యడానికి అడిగిన వెంటనే కాదనకుండా అనుమతి ఇచ్చ్సిన సచ్చిదానందన్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ....ప్రేమతో...జగతి 


 





Sunday, April 17, 2011

యాత్ర


వెతుక్కుంటూ పోతూనే ఉన్నాఅనుభవాల 

ముళ్ళూ రాళ్ళూ 
దేహాన్నీ
ఎదనీ కోస్తూనే ఉన్నాయి
అయినా వెనుదిరగను
నా గమ్యం చేరుకోగలనని 
నా పరిపూర్ణ విశ్వాసం 
"ప్రేమ" నా నిరాయుధ ఆయుధం 
అనవరతమూ  అగుపించే
ప్రేమ సామ్రాజ్యం 
గమ్య గోచరం
నా ప్రేమ ప్రయాణం 
చిరంతన ఆశ తో 
నిరంతరంగా.....సాగుతానిలా
అప్పుడప్పుడూ అక్కడక్కడా
వికసించిన అనురాగ పుష్పాలు
నా బాటను రాగ రంజితం చేస్తాయి  
అందుకే.....నిరంతర యాత్ర.....
...................ప్రేమతో.....జగతి 
      

దిల్ కూజితాలు



చదువుకోవడమంటే నాకు ప్రాణం 


ఊహ తెలిసిన నాటినుండి 
చదువుకుంటూనే ఉన్నా
'ప్రేమ' ని .....
జీవితం సరి పోతుందో లేదో....ప్రేమతో....జగతి 

I AM RIGHT....!!!


Of late somehow my eyes are
Prone to reading
My heart aches
And my fingers pine
To pick up a pen
And jot down a few lines
But……..
When I try to do so…
 I feel the time I take to
Pen down a poem
Is lost for me to read a great
Poem of others
Hence…..
These days I allow
My eyes
To beam in the
Radiance of
Others poesy…..
I know I am doing right
And not write…….!!!

………………………………love j
3.05pm    Saturday 16th April 16, 2011


                                                                       


Friday, April 15, 2011

దిల్ కూజితాలు


దిల్ కూజితాలు 

కలలతో పోరాడి 
మనసు అలసి పోయింది
ఇక 
నిశ్శబ్దం


నీ మౌనం 
నా గుండె గాయం 
మానదు 
ఎప్పటికీ


ఆచరించలేని ఆలోచనల జడి
ఎద నిండా
అపహాస్యం చేస్తూ వాస్తవం
గుండెనిండా కలలు
తీరనివి
కళ్ళనిండా నీళ్ళు
జారనివి


నువ్వు చేసే గాయాలు 
చాల చిత్రమయినవి సుమా
తగిలినపుడు తెలియక
తదుపరి బాధిస్తాయి

మధుర స్వప్నం తొణికి
జ్ఞాపకంగా ఘనీభవించింది

కాటుక రేఖలు గీచి
కనుదాతనివ్వను నా రాజుని
కనురెప్పల తలుపులు మూసి
కంటి పాప తాళం వేసేస్తా

మనసు లేని మనిక కన్న
మరణం మధురం నాకు 

 ఆనందాని ప్రేయసి  అందాలలో 
కాదు...
వెతుక్కోవాలి 
ఆమె అంతర్యంలో 

విరహం వేదనైనా పర్వాలేదు
కలయిక కలహం కాకూడదు

అణువంత అసూయే కదా
అణిగి పోతుంది లేమ్మనుకున్నా
అనుదినమూ పెరిగి
అణ్వస్త్రమై కూచుంది


నా నవ్వుకి నీ ఎద
పూలు పూస్తుందంటే 
మది కాగిపోతున్నా
చెరగ నివ్వనీ  నవ్వుని 


మిత్రులారా ఇవి కొన్నాళ్ళ క్రితం tlc లో ఒకటోకటిగా పోస్ట్ చేసినవే అయితే  ఇప్పుడు కొత్త స్నేహితుల కోసమూ అదీ కాక అన్నీ ఒక చోట చేర్చాలనే ప్రయత్నం లో ఇలా.....ప్రేమతో...జగతి 



Thursday, April 7, 2011

జీవన నిఘంటువు


భాషా నిఘంటువు లాగే జీవన నిఘంటువును                    
కూడా నవీకరించుకుంటూ ఉండాలి
అనుభవాల పరంపర నుండి
కొత్త పదాలను చేర్చుకుంటూ పోవాలి
కాల గమనంలో ఓ వసంతం
నీ అయువుకే కాదు
నీ కౌసలానికీ  ఒక మెట్టే
నీ నిగ్రహ ఆగ్రహలకు
ఎగుడు దిగుళ్ళ ఆనవాలే
తరలిపోతూ ఓ వత్సరం వేసిన దెబ్బలు
ప్రక్రుతి విసిరిన భీభత్సపు క్రియానుభావాలు
ప్రవృత్తి చేసిన మంచి చెడు కార్యాలు
తీపి చేదు ఫలితాలను మాటలుగా
మిగిలిపోయే  ఎన్నో ఆశా నిరాశలను
బతుకు వ్యాకరణంలో జోడించుకుంటూ
శిశిరం వదలిన  తిమిరపు ఛాయలను వీడి
నవ వసంత హేలను స్వప్నిస్తూ
మరో ఉగాది షడ్రుచులకు ప్రతీకగా
స్వీకరిస్తూ .....
అనంతమైన కాలాన్ని మన చేతులతో కొలుస్తూ
మరో ఏడాదిని ఆనందంతో ఆహ్వానిస్తాం
ఆమెకో నామకరణం చేస్తాం
తానివ్వబోయే ఫలితాలను
మన మిడి మిడి మేధతో ఊహించి
మనకు కవాల్సినట్టుగానే ఉండాలని ఆశను
ఆకాంక్షలతో పంచంగాలను రంగరిస్తాము
ప్రతి ఏడు మిశ్రమ ఫలాలే
విడదీయలేని ఆశా నిరాశల
అనుబంధాల అనురాగాల
జీవితమే ఒక మిశ్రమనామవాచకం  కదా
ప్రయా ప్రమేయాలు లేని
సంక్లిష్ట క్రియానుభుతి కాదా?
భౌతిక మానసిక షడ్రుచులను
మేధో మాధనంతో ఆస్వాసిస్తూ
ఆస్వాదిస్తూ సాగుతూ పోవడమే
జీవన ధర్మమని మరో సరి
మనకి మనం వక్కాణిన్చుకునే
మరో సారి జీవిత వ్రతానికి
సంకల్పం చెప్పుకునే
ఉగాది ప్రతి ఏడాది అర్ధాలు మారే
అరుదైన పదం
అందుకే ప్రతి ఏడాది ఉగాదినాడు
జీవన నిఘంటువును
అనుభవాల పరంపరలోని
సరికొత్త భాష్యాలతో
పర్యాయ పదాలతో
మారిన అర్ధాలతో
నవీకరించుకోవాలి
లేదా కాలపు జోరు పరుగులలో
మనం వెనుకబడి పోతాము
వసంతాగమనం ఓ పండుగ కంటే
జీవన నవ్య నిర్వచనాలకు
నవ ఆచరణలకు
ప్రణాళికలు వేసుకుని
తద్యనుగుణంగా వచియించు కుంటూ
సాగిపోయే సజీవ యాత్రకు సంకేతం
ఉగాది అంటే జీవితానికి ప్రతిపదార్థం కదా...!!!

....................................ప్రేమతో...జగతి 


                                      








పలకరింపు




ఇప్పుడిప్పుడే
ఓ నలుపు తెలుపు
సేతాకోక చిలుక
నా గుండె మీద
వాలింది
నాకు తెలుసు
అది నీ పలకరిమ్పేనని
సున్నితంగా ముద్దాడి
నా అనురాగాన్ని అద్ది 
తిరిగి పంపించా
నిన్ను కుశల మడగమని.....ప్రేమతో....జగతి

Tuesday, April 5, 2011

జ్ఞాన మందారం



ఆకులు రాలిన  ఎర్రమందారం చెట్టు
తుపాకులు పడేసిన తీవ్రవాదిలా ఉంది
యుగ సంధి లో నిల్చిన 
ధరణి ధోరణి లా ఉంది  
అక్కడక్కడ ఇప్పుడిప్పుడే 
అగుపిస్తోన్న నును లేత చివురులు
ఆకుపచ్చ  నక్షత్రాలై మెరిసి
ఆశ పొడ చూపుతున్నాయి 
కొమ్మలుగా విస్తరించిన 
తన పిల్లల్ని చూసి 
ఏ కొమ్మ ముందు పూస్తుందోనని
అంగాలారుస్తోంది ఎండలో మాను తల్లి 
కొమ్మలన్ని  హరిత పత్రావళి అయితే
ఆకుపచ్చ్చ  చల్లదనంలో 
సేద తీరి ......
తలవంచి గర్వంతో 
తన బిడ్డల ఉన్నతిని చూడమంటూ
నేల నేస్తాన్ని పలకరిస్తుంది
నేను లేనిదే నీవు లేవన్న నేలమ్మని
అందుకేగా తలవంచి నీలోకే ఒదిగి పోతున్నానంటుంది...
మరు శిశిరం వరకు 
హరిత పత్రాల కిరీటాలతో
ఆనంద భైరవిగా పరవశిస్తుంది
అనాదిగా సాగే ఈ చర్యకి
సర్వ సాక్షి  సంతకం కోసం 
ప్రతి ఏడూ విపత్ర అయి  
నవ జీవ రాజ ముద్ర వేయించుకుంటుంది
మౌనంగా ఏమి తెలియనట్టున్న మా మందారం చెట్టు
జీవన సారం తెలిసిన 
యుగ యుగాల ప్రేమ సాఫల్యతకు
ఆనవాలు ....!!!
అనుకుంటే ఓ మామూలు చెట్టే 
అర్ధం చేసుకుంటే జ్ఞాన మందారం...!!!
                                     ప్రేమతో ...జగతి 
                                    11.58pm  12th march 2011 saturday