నా
కోసం తను
“
ఇంద ఈ జూస్ తాగు ప్లీజ్” ఆమె చేతిలో గ్లాసు పెట్టబోయాడు. ముఖం తిప్పేసుకుంది .
“ఏంటి
ధీరూ ! ఇది ఏమైంది నీకు ?”
“
ఏమీ కాలేదు “ నిర్లిప్తమైన జవాబు
“ఎందుకిలా
ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు ? ఏమి లాభం చెప్పు?”
అనునయంగా అన్నాడు
సీలింగ్
వైపు అభావంగా చూస్తూ ఉండిపోయింది.
“
నేనొచ్చి రెండు గంటలైంది నువ్వసలు నాతో
మాటాడనే లేదు “ నిష్టూరంగా అన్నాడు
“
నేను నిన్ను రమ్మనలేదు” మళ్ళీ అదే
నిర్లిప్తత స్వరం లో.
“
ధీరూ!” ఆమె దగ్గరగా నిలబడి ఆమె తలని గుండెలకి అద్దుకున్నాడు.
“
నిన్నూ , సముద్రాన్నీ ఇలా నిశ్శబ్దంగా చూడలేను రా”
“
సముద్రం ఎప్పుడూ నిశ్శబ్దించదు, ఎవరు విన్నా లేకున్నా దాని గోల దానిదే”
“
మరి నువ్వేందుకు ఇలా మౌనంగా”
“
ఏమీ చేయలేక ....”
“
ఆత్మ వంచన చేసుకోలేక...” ఆమె గొంతు లోని తీవ్రతకి అదిరి పడింది అతని హృది. ఎప్పుడూ
ధీరు లోని ఇంత ఆగ్రహం చూడలేదు తను. అక్షరమే లోకమనుకుని,
ప్రేమే సర్వస్వమనుకుని జీవించే ఈ నా ప్రేమమూర్తికి ఇంత కోపమా ? ఆశ్చర్యపడింది అతని మనసు.
“
ఏది ఏమైనా ఆరోగ్యం పాడుచేసుకోవడం మంచిది కాదు రా”
“నాకు
తెలియదా ... ఎందుకో ఎంత ప్రయత్నించినా సర్దుకోలేక పోతున్నా”
జూస్
గ్లాస్ తీసుకుని గటగటా తాగేసింది.
“సారీ
నిన్ను బాధించినందుకు ... ఎందుకు పని వదిలేసి వచ్చావు. అసలే ఈ మధ్య మంచి డైరెక్టర్
దగ్గర అవకాశమొచ్చింది కదా” చాలా సౌమ్యంగా అడిగింది. అదే ధీరు లో ఉన్న గొప్పతనం.
ఎంత బాధనైనా ఓర్చుకుని మళ్ళీ మామూలుగా మారిపోతుంది. తన కోపాన్నీ, ధు:ఖాన్నీ
అన్నిటిని మది సంద్రం లో నిక్షిప్తం చేసేస్తుంది. బహుశా ఆదేనేమో ఆమె అనారోగ్యానికి
కారణం.
“
నువ్వు రెండు రోజులు ఫోన్ తీయక పోయేసరికి భయం వేసింది రా” చిన్న పిల్లాడిలా ఆమె
పక్కలో చేరి పలవరించాడు
“
ఏమీ లేదులే బాలూ, ఎందుకో మాటాడాలనిపించలేదు ఎవ్వరితోనూ, చివరికి నాతో
నేను కూడా మౌనంగానే ఉందామనిపించింది”
“ఒకోసారి అలా అనిపించడం సహజమే కానీ నాతో కూడా
...కనీసం ఒక్క మెసేజ్” వేడికోలు అతని స్వరం లో
మౌనంగా
నవ్వింది. కానీ వీడని ఆమె భృకుటి ముడి ఇంకా ఆమె మనసు ప్రశాంతంగా లేదని చెప్పకనే
చెపుతోంది.
“
నువ్వు ఫోన్ తీయక పోతే భయమేసి ,
లైబ్రెరీ కూడా కాల్ చేశా. రాలేదన్నారు”
“సరే
, సరే ఇంకెప్పుడూ ఇలా భయ పెట్టనులే, సాయంకాలం నీ
సముద్రాన్ని చూదువుగాని వెళ్దాం” నీరసంగా నవ్వుతూ లేవ బోయింది.
“ఎక్కడికమ్మాయ్
?” ఆప్యాయంగా అడ్డుకున్నాడు
వంట
చేయడానికి అని కుడి చేయి పెదాల దగ్గర
పెట్టి సైగ చేసింది.
“చాలు
చాల్లే ఇప్పుడేమీ చేయక్కర్లేదు నేను చేసేసి పెట్టా ఇందాకే ,
తమరు దయతల్చి తిని పెడితే ధన్యులమ్”
“
ఓహో మీ రాయలసీమ రుచులు నాకు చూపించాలనా ?”
“ఏదో
మా ప్రయత్నం మాది ..తమకి నచ్చాలి గా “
“నీ
చేత్తో విషం పెట్టినా బాగుంటుంది నీ చేత్తో తినే ప్రాప్తముండోద్దూ..” ఆత్మీయంగా
అతన్నే చూస్తూ అంది
“అబ్బో
చాలా దూరం వెళ్లిపోయావు గానీ ...అంటే నీ ఉద్దేశం నా వంట విషమనా ...” నవ్వించాడు
ఆమెని
..........
“హమ్మయ్యా
...అటు సూర్యా రావుగారూ ఇటు మా ధీరు గారూ ఇద్దరూ కొంచం చల్ల బడ్డారు...”
నిట్టూరుస్తూ ఇసికలో కూల బడ్డాడు ఆమె పక్కన
పల్చగా
నవ్వి చీర చెంగుతో అతని నుదుటి చెమట అద్దింది.
“
ఇప్పుడు చెప్పు ఎందుకంత సీరియస్ ...”
ఎగురుతోన్న
ఆమె జుట్టు సవరించాడు . అతని ఆత్మీయ స్పర్శ ఆమెని నిలవనీయలేదు.
అలాగే
అతని చేయి పట్టుకుని నుదుటికి తాకించుకుని కళ్ళు మూసుకుని ఉండిపోయింది కాసేపు.
“
సాహిత్యమంటే నాకు ప్రాణమని తెలుసుగా ...నేను అనుకునేదాన్ని అక్షరాలను ప్రేమించే
వారు అందరూ చాలా స్వచ్ఛంగా ఉంటారని ....” నెమ్మదిగా ఆమె వేదనకి మాటల రూపం ఇస్తోంటే
ఆమె చెయ్యి పట్టుకుని వింటున్నాడు
“
ఈ హిపోక్రిసీ చూస్తుంటే ముందు కోపం వచ్చినా రాను రాను భయం వేస్తోంది బాలూ... మన
సాహిత్యం మన వాళ్ళు ఎక్కడికి తీసుకుపోతున్నారు. సరి అయిన విమర్శ రాయకూడదు. అన్నీ
వాళ్ళు ఏమి రాస్తే దాన్ని మెచ్చుకోవాలే తప్ప ఏమాత్రం సరి చేయకూడదు. ఇంత అహం మన
పూర్వపు రచయితల్లో లేవు. అవార్డుల కోసం పైరవీలు. ఇవన్నీ చూస్తుంటే అసలు....”
ఆవేశంతో ఆగిపోయింది
“
నీ ఆరోగ్యానికి ఒక సూత్రం చెప్పనా ...ఈ రచయితలనీ రచనలని పట్టించుకోకు...”
“
అలా అని ఎలా ఉరుకుంటామ్ ...నిజంగా బాగా రాస్తున్న వాళ్లకి అన్యాయం
జరుగుతోంది...కులం , వర్గం ప్రాంతం ఇలా అన్నిటి పేరునా అన్యాయమే.... మొన్నోక సభలో ఒక పెద్ద
రచయిత అంటున్నారు అతన్ని ఫలానా పురస్కార గ్రహీత అని ఎవరో పెద్దాయన ప్రస్తావిస్తే
వద్దు మహాప్రభో అదో పెద్ద తిట్టు అలా అనకండి అని. అంటే జరుగుతున్నదంతా అందరికీ
తెలుసు .. అసలింత మానిపులేట్ చేసి పొందే అవార్డులను ఎలా ఆత్మ
గౌరవం లేకుండా తీసుకుంటారు. పైగా వీళ్ళకి పెద్ద పెద్ద వాళ్ల అండ కాపలా. అసహ్యం
వేస్తోంది. అసలు అవార్డులు ఎవరికోస్తాయో ముందరే ఫిక్స్ అయిపోతుంటే... ఛీఛీ
...అందుకే మన తెలుగు వాళ్ళని గేలి చేస్తున్నారు మిగిలిన భాషల వాళ్ళు. మీకు సమీక్షే
తప్ప విమర్శ లేదుగా అంటూ, ఆ సమీక్ష కూడా అనుకూలంగానే రాయాలి
సుమా ”
“
ఈ మారని మనుషుల కోసం ..నువ్వు ఇంతలా చలించిపోవడం మంచిది కాదు. నేను అందుకే చాలా
దూరంగా ఉంటున్నాను.” అనునయంగా ఆమె తల నిమిరాడు
“
నిజం రా.. నేను అందుకే చాలా దూరమైపోయాను. జీవితాలను ఫణంగా పెట్టి ఉద్యమాల్లో
పాల్గొన్న వాళ్ళం ....ఇప్పుడు ఈ బోలుతనాన్ని భరించడం కష్టంగా ఉంది.. నీకన్నా
ఎక్కువగా చలించిపోయాను ఒకనాడు ... కానీ ... వీటిలో మునిగి మనసు ఆరోగ్యం పాడు
చేసుకోవడం కన్నా మిగిలేది ఏమీ లేదు.. పైగా ఈ మనుషులని మార్చడం కష్టం ...అందుకే
వదిలేశా ...”
“పిచ్చిపిల్లా
ఇలాంటి అవకాశవాదుల గురించి ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకుంటున్నావా?
వదిలేయ్ ...ప్రతి రచయితా ముందు తన సాహిత్యం లోని శక్తి కన్నా తనని కాపు కాచి
ప్రమోట్ చేసే వాళ్ళని ముందుగా సర్ది పెట్టుకుని అప్పుడు ఏదో రాస్తున్నాడు. తాను
రాసిన దాన్ని వీలైనంత గొప్పగా ప్రచారం చేసేవారినే తన గురించి రాసేలా
చేసుకుంటున్నాడు. ఇది ఇప్పుడు సాధారణమైన విషయమైపోయింది. అందుకే విలువ ఉన్న రచయితలు
సైతం ...వీటన్నిటికీ దూరంగా అజ్ఞాతంగా ఉండి పోతున్నారు. మేటి రచయితలు మన
సాహిత్యానికి గర్వ కారకులైన వారే ఒకోసారి ఈ వత్తిళ్ళకి లొంగిపోక తప్పడం లేదు అని
వాపోతున్నారు. ఈరోజు సాహిత్యం అంటే అవకాశవాదం .... మళ్ళీ మన సాహిత్యానికి మంచి
రోజులోస్తాయి అని కూడా చెప్పలేని పరిస్థితి లో ఉన్నాం ...” దీర్ఘంగా నిట్టూర్చాడు.
“
ఏమీ చేయలేమా ....”
“
చేయలేమనే చెప్పాలి ... అందరికీ తెలిసినా బయటికి ఎవరూ చెప్పరు... మనసు విప్పి మనతో
మాటాడిన వారే అక్షరంగా ఒక్క ముక్క రాయరు ...పైగా పోనీ లేద్దురూ మనకెందుకు అంటూ
వాళ్లనే సమర్ధించి ఉరుకుంటున్నారు... ఇలాంటి పరిస్థితిలో ... మనం మాత్రం...”
“
తాను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు ఇచ్చేయగల నా బాలు యే నా ఇలా మాటాడేది?”
ఆమె స్వరం లో కలవరం
“
ఇక్కడ జరుగుతున్న ఈ బోలుతనపు విషయాలకి సిద్ధాంతాలను ఎందుకు ఆపాదించడం వీళ్లదంతా
ఒకే సిద్ధాంతం అవకాశవాదం అంతే. సత్యం కోసం సమాజం లో సిద్ధాంతాలకోసం పోరాడిన వాళ్ళూ
, సాహిత్యాన్ని సమాజాన్ని మధించిన వాళ్ళూ సద్విమర్శ చేసేవాళ్లూ ఇప్పుడు
లేరు. ఉన్న కొద్దిమందీ నోళ్ళు విప్పరు. ఎందుకులే శతృత్వం అనుకుంటారు. అందుకే
మిగిలిన భాషల వాళ్ళు మన సాహిత్యం లో విమర్శ లేదు అంటున్నారు. విమర్శ అంటే మన
వాళ్ళకి తెలిసినది పొగడటమే. ఏమైనా రాసామా వెంటనే గొడవలు మొదలౌతాయి. సినిమాల్లో
చూపిస్తారు చూడు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ల గానే పై మినిస్టర్ నుండి ఫోన్
వస్తుంది వాడిని వదిలేయ్ అని అలా అన్న మాట ...” నవ్వాడు
“
అలాగని ఎవ్వరూ ఏమీ చెప్పక పోతే ...”
“
ఎవ్వరూ చేప్పక్కర్లేదు రా విలువ ఉండే రచన ఎక్కడున్నా ఎలాగైనా కాలం లోనిలబడుతుంది.
లేనిది ఎన్ని ప్రయత్నాలు చేసినా నిలబడదు. ఇది కాలం నిరూపించిన సత్యం. ఇలాంటి
వాటిని గురించి బాధ పడకూడదు.”
“
నిజమేలే ... నిన్ననే ఒక చిన్నారి పాత్రికేయ స్నేహితుడు అంటున్నాడు ,
నిజమైన ఏ రాతలూ రాయడానికి వీలు కానీ ఉద్యోగాలు , అందుకే
అన్నిటికీ దూరంగా మానసికంగా తాత్వికతను వంటబట్టించుకుంటున్నాను అని. నిజమే సత్యాలను
రాయనివ్వని పత్రికలు ... ఉద్యోగాల కోసం వాళ్ళు ఏమి చెపితే అదే రాయాల్సిన
పరిస్థితులు...నిజంగా నేటి యువతరం పాత్రికేయుల్లో కూడా ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ...
నిన్న ఆ అబ్బాయి అంటుంటే బాధేసింది.”
“సరే
గానీ ఇక నువ్వు ఈ విషయాలను ఆలోచించడం మానేసేయ్... అనవసరంగా ఆరోగ్యానికి
తెచ్చుకోకు. ఒక్కటి గుర్తుంచుకో శక్తివంతమైన సాహిత్యానికి ఎవరి అండదండలూ
అక్కర్లేదు ....శక్తి హీనమైనది ఎన్ని కంచెలు కట్టినా నిలబడదు. ఇక ఆలోచించడం
మానేసేయ్. ఈ ఊబిలో దిగకు. నువ్వు చేయాల్సిన మంచి పనులు ఉన్నాయ్ అవి చూడు.”
“
అలాగేలే ... చాలా ఏళ్ల తర్వాత ఎందుకో చాలా కోపం వేదనా కలిగాయి ... నిన్ను కూడా
డిస్టర్బ్ చేశా కదూ ..” మన్నించమన్నట్టుగా అతని చేతులు పట్టుకుంది.
“చా
అదేం లేదు ... జీవితం లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడిన దానివి ఇలా ఈ మనుషుల
గురించి చలించి పోవడం బాధగా ఉంది. అయినా సాహిత్యమూ, ప్రేమే గా నీ ఊపిరి , అందుకే ఇలా అయ్యావు...” ఆత్మీయంగా అన్నాడు
“కొన్నాళ్లు
ఇవేమీ పట్టించుకోకుండా మంచి పుస్తకాలను చదువు ... డిసైర్ అండ్ లిబరేషన్ చదివి
చెప్తాను అన్నావు. అవి చదువుకో ప్లీజ్ . నేను రేపు వెళ్ళాలి. వెళ్ళిరానా”
“
అలాగే రా మంచి పనిలో నిన్ను బాధించాను. సారీ … “
“అవునమ్మాయి
నే వెళ్ళేది రేపు ఈరోజు కాదు ... ఇలాగే ఇక్కడ సముద్రాన్ని చూస్తూ గడిపేయడమేనా
మమ్మల్ని తమ ప్రేమ సముద్రం లోనూ కాస్త ....”
“
హహహ ... నీలో ఏదో మెస్మరిసం ఉందిరా ... “
“
లేదురా అది నీలోని స్వచ్ఛత అంతే .... అసలు నీకో సత్యం బోధించాలని వచ్చాను
శిష్యురాలా !”
“
అబ్బో ఏమిటది గురుజీ ?”
“ఆలోచించిన
వారికే ఆవేదనలు ... అవకాశవాదులను అవి అంటవు .. కనుక కాబట్టీ మనసు మంచి సాహిత్యం పై
లగ్నం చెయ్యి శిష్యురాలా ...అలాగే అప్పుడప్పుడూ ఈ దాసుని పై కూడా “ పకపకా నవ్వాడు
స్వచ్చమైన
అతని నవ్వును చూస్తూ “జీవితాన్ని ఉద్యమం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం నిలిచిన ఈ
తాత్వికునికి ఏమివ్వగలను .... నా ప్రాణం తప్ప”
“
ఇదిగో అమ్మాయి నువ్వేదో మళ్ళీ ఆలోచిస్తున్నావు ఇక నేను కూడా ప్రేమ పైరవీలు మొదలు
పెట్టేస్తాను ఏమనుకున్నావో ... హాయిగా చదువు సంధ్యా రాని జాలరమ్మాయి అయితే హాయి
...”
“ఓహో
... అలాగా తప్పకుండా వెళ్ళి ట్రై చేస్కో నే వెళ్తున్నా ..” నవ్వుతూ లేచి అడుగులు
వేసింది.
“
ఓయ్ ఇప్పటికిప్పుడంటే టైమ్ లేదు కానీ మళ్ళీ సారి వచ్చినప్పుడు ట్రై చేస్తాలే
ప్రస్తుతానికి అమ్మాయిగారే...” లేచి ఆమె చేయి పట్టుకున్నాడు.
అసలేంటీ
వీళ్లూ ప్రతిసారీ ఒక్క మాటైనా నా గురించి మాటాడుతారు కదా ఈరోజు ఈ జానారణ్యం
గురించే మాటాడుకుని వెళ్లిపోతున్నారు హన్నా నన్ను పట్టించుకొనేలేదు ... అంటూ
ఉవ్వెత్తున కెరటమై వచ్చి వాళ్ళను తడిపేసింది సముద్రం.
“ఇదిగో
అమ్మాయ్ మీ సముద్రం కూడా నిన్ను చల్ల బరుస్తోంది చూడు” అంటూ ఆ తడి ఇసుకలో ఆమెని
పొదివి పట్టుకుని నడిపించుకుని ...
సాహిత్యం
సన్నిహిత్యం జతగా ... వారి అడుగు జాడలు తడి ఇసుకపై ....
..............................................................................................ప్రేమతో
జగతి 11.39 ఏ ఏం 5/4/2018 గురువారం