Friday, April 20, 2018


A PASSIONATE FEMINIST KUPPILI PADMA

A heart filled with compassion, a pen flowing with powerful prose and a nature loving soul , yes its none other than the poet, writer Kuppili Padma the established feminist. Having earned applause even from the eminent critic Cheraa, Padma takes her own firm stand  in the Telugu literature. A writer well known in a few genres of writing from more than two decades constantly Padma has made her mark in Telugu literature. Hailing from a village Kuppili(North coastal Andhra, near Vizianangaram), after which her surname was taken Padma made a consistent contribution to modern Telugu literature as a short story writer, a poet, and a writer of columns and musings.

   Her famous column ‘Maidaanam’ which ran for about a decade in the daily Vaartha brought her a lot of accolades. Her commentary on the contemporary issues and lives of people in Andhra and Telangana , rural and urban, and much more issues were penned by her eminently in this column. Her translucent style of writing wins the hearts of the readers. She has to her credit six collections of short stories, three novels ,two collections of creative prose and a book of poesy recently released in the Vijayawada book festival(2018). Kuppili padma kathalu another one more collection of her short stories were recently published by the prestigious publishers Visalaandhra publications of Andhra Pradesh.
   Along with these she has an English translation of her stories ‘Salabhanjika and other stories’ which was edited by the senior translator duo Alladi Uma and Sridhar. From her first book Amruthavarshini(1993) (a collection of love letters), to her recent book Kuppili Padma kathalu and , poetry anthology ‘nemaleekalu poosina kaalam’ Padma has never left the consistency of writing. Her stories have been chosen to be translated into English and other languages. Some of her stories like Salabhanjika and others have been chosen to be translated and published in  the annual and periodical collected anthologies like Nurella kathaku vandanam , and Katha selection of best short stories from Telugu.

Speaking recently in her book release function in Vijayawada Padma says all her woman protagonists in her writings show the state of woman in the changing times. She religiously admits her women show the evolving modern woman in the twentieth century. Her stories deal with women in all phases of life and places of life. The concept of New Woman coined in the end of nineteenth century is evident in all her writings. She deals with the subjects of the working woman in the working places and also with the materialized relations between woman and man. The government must take the responsibility of providing equal opportunities and safety to women. And she continues saying ‘we as feminist writers do present in all our effervescence the problems of women for their notice. So she concludes ‘writers  are the communication between the governing institutions and public’.

A woman with a clear vision of hope and ambition Padma is an ardent feminist writer who demands nothing more but ‘ a woman her genuine space in the society’. As the eminent VIctorian Virginia Wolf demands “a room of one’s own” to a woman, Padma as a woman of letters of faith and hope in improving the social consciousness as a writer demands the respect for womanhood in all walks of life. Her letters and sentences are filled with aesthetic beauty and her sophisticated narration in her stories makes the readers completely read the story. Padma is not a writer of fantasy but reality in real terms. Her way of dealing with the women oriented subjects convince  the readers and makes them think objectively. A socially conscious writer, sailing in her paper boat of letters Padma is an asset to the modern Telugu literature. A woman with a sweet smile and gentle speech but resolute in her ideals and conviction Padma is the writer really in need of the hour. She has won many awards from many great institutions which include Tenneti Hemalatha best writer award and Chaso Sphoorthi award and recently she has another feather in her cap by winning the most prestigious Vasireddi Seethadevi award(2017).

A writer dealing with the urban woman problems Padma stands in a commendable position in the modern Telugu literature. Nature and human cannot be dealt as two separate entities says Padma in an interview , it is the fusion of both makes the genuine story, she faiths in. As an eminent feminist Kuppili Padma stands up to the mark in the modern Telugu fiction as she deals with all aspects like globalization too in her stories. Her short story collections “salabhanjika and other stories”, and “the Loss of innocence” prove her mettle in  dealing with the agitating life of the modern woman. A writer in local lingua franca but with global themes Padma is the woman writer of the century.  . I sincerely  wish most of her works should reach the international readers all around the globe. Working as a creative head in media channels Padma has the caliber and execution in movie and tele film making too. With words that befall like snow flowers as one of her creative muses have the name ‘manchupoola vaana’ (rain of snow blooms), Padma is unique in her style and putting forth her opinions in her writings. She does not fret and fume on men but tries to show him his place and a woman how to earn her space. She arises a hope in the women to look forward to better their conditions of life. She speaks with dignity and self confidence about any issues and shows ardent faith and hope in the grand future of women.
Telugu literary lovers look forward for much more valuable contribution from this woman of letters in the future.
                                                                 Jagaddhatri
                                                                Writer, translator and literary critic.






కారుణ్య ‘మరణ కాక్ష’ – సుప్రీం నోట సలీం మాట
యుతనేసియా , కారుణ్య మరణాల పై సంచలనాత్మకమైన సుప్రీం కోర్టు తీర్పు నేడు వెలువడింది. ప్రపంచ దేశాల నైతిక అభిప్రాయమే రెండుగా చీలిపోయిన ఇటువంటి విషయాలపై నవలా రచన రచయితల నిగ్గుతేల్చే విషయం. నెదర్ లాండ్స్, మెక్సికో, స్విట్జర్లాండ్ , బెల్జియం, అమెరికా , జర్మనీ, ఐర్లాండ్, మొదలగు దేశాల చట్టాలు కారుణ్య మరణాలకు “పాసివ్” పద్ధతిలో అంగీకరిస్తున్నాయి,  అనగా భయంకరమైన వ్యాధితో , మృత్యు ముఖం లో ఉంటూ బయట నుంచి అందజేసే ప్రత్యేక వైద్య సదుపాయాల వలన ఇంకా జీవితులై ఉండే వ్యక్తుల అంగీకారంతో, ఈ వైద్య సదుపాయాలను తొలగించడమే ప్రస్తుతానికి మన దేశంలో సుప్రీం కోర్టు ఈ తాజా తీర్పు ద్వారా  అంగీకరిస్తున్న విషయం.
ఈ విధానానికే ఇంగ్లాండ్ , అస్స్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్, మొదలగు దేశాలలో చట్ట బద్దత లేదు. మన దేశాన్ని కుదిపేసిన  1977 లైంగిక అత్యాచార బాధితురాలు అరుణా షాన్బాగ్ ఆ ఏడాది నవంబర్ నుంచి మే 2015 దాకా ఈ కారుణ్య మరణాల విషయం పై స్పష్టత , చట్ట బద్ధత లేక పోవడం వలన నలభై రెండేళ్ల పాటు కోమా వంటి ‘వెజెటేటివ్ స్టేట్’ లో కేవలం పేరుకి మాత్రం జీవితురాలిగా ఉన్నది. 2009 లో ఆమె విషయమై పత్రికా రచయిత్రి పింకీ విరానీ ఒక రచన చేయడమేకాక, ఆమె కారుణ్య మరణాన్ని  అనుమతించమని,  లైఫ్ సపోర్ట్ పరికరాలను తొలగించే వీలును పరిగణించమని సుప్రేమ్ కోర్టుకి పిటీషన్ సమర్పించింది.
2011 లో సైతం,  పూర్తిగా నిస్సహాయ దశలో ఉన్న వ్యక్తులకు కారుణ్య మరణాల వీలును అనుమతిస్తూనే షాన్ బాగ్ విషయం లో ఈ వెసులుబాటుకు తిరస్కరించింది సుప్రీం కోర్టు. దేశంలో ఏ మేరకు,  ఏ స్థాయిలో ఈ మెర్సీ కిల్లింగ్ అనుమతించవచ్చు అని వైద్య వర్గాలు , న్యాయ కోవిదులు , ధార్మిక సంస్థలూ, సామాజిక మేధావులు చర్చిస్తూ ఉన్న కాలం లోనే  2013 లో నిమోనియా కి గురై 2015 లో మే 18 న గుండె పోటుతో అరుణా షాన్ బాగ్ కన్ను మూసింది. ఈ దేశ వ్యాప్త ఉదంతం,  ఏళ్ల తరబడి అమానవీయమైన ఈ పొడిగింపు,  మన తెలుగు రచయిత సలీంకు ఈ విషయం పై నవల రాసే ప్రేరణ కలిగించి ఉండవచ్చును. సమాజ పరిస్థితులపై ఎందుకు ఒక రచయిత నవల రాయాలో ఇది ఒక మంచి ఉదాహరణ.
 తెలుగు సాహిత్యం లో తొలిగా ఈ విషయాంశాన్ని చర్చించిన నవల కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత సలీం ‘మరణకాంక్ష’ . ఈ నవల 2011 లోనే రాయబడింది , ప్రముఖ వారపత్రిక లో సీరియల్ గా వచ్చిన ఈ నవల తర్వాత పుస్తకంగా వెలువడింది. తన కొడుకు మస్క్యులర్ డిస్ట్రోఫీ తో పడుతున్న మరణ యాతన చూడలేక సరోజ అనే తల్లి తన కొడుక్కి  కారుణ్య మరణం ప్రసాదించమని కోర్టుకి అపీల్ చేసుకుంటుంది. కానీ అక్షర అనే లాయర్,  కారుణ్యమరణాలకు వ్యతిరేకంగా వాదించి కేసు గెలుస్తుంది. అయితే ప్రసాద్ మరణయాతన కళ్లారా చూసిన ఆమె తాను పొరపాటు చేశానని గ్రహిస్తుంది. రచయిత, ప్రసాద్ మరణాన్ని వర్ణించిన తీరు , ప్రత్యక్షంగా  చూసిన అక్షరలో ఎంత మార్పును తీసుకొస్తాయో  అలాగే చదివిన పాఠకుల్లోనూ కారుణ్య మరణాల పట్ల ఒక సహానుభూతిని, వాస్తవిక స్పృహను  కలిగిస్తాయి. రచయిత తన రచన ద్వారా సాధించిన ఈ  మానవ స్వభావ చిత్రణ నేడు సుప్రీం కోర్టు నోట ఆమోదయోగ్యమైన  తీర్పుగా వెలువడటం ముదావహం. మన తెలుగు రచయితలు ఇంత మెలకువతో,  క్రాంత దర్శిత్వoతో రచనలు వాస్తవ దృక్పథం తో  చేస్తున్నారని చెప్పడానికి ఇదొక సత్య నిదర్శనం.
ఇదే విషయం పై “గుజారిష్”(2010) లో సంజయ్ లీలా బన్సాలి సినిమాగా వచ్చినా అది ఒక గొప్ప వ్యక్తి జీవితం గురించి , పైగా అది “whose life is it anyway” (1981)అనే రంగస్థల నాటకాన్ని సినిమా గా తీసిన దాన్ని  హిందీలో బన్సాలి తనదైన గొప్ప చిత్రీకరణలో తీశారు. బ్రైన్ క్లార్క్ 1978 లో రాసి ప్రదర్శించిన ఈ నాటకం జాన్ బొధామ్ దర్శకత్వం లో రిచర్డ్ డ్రెయ్ఫుస్స్ (అకాడెమీ అవార్డ్ గ్రహీత ) ముఖ్య పాత్రగా చిత్రించబడింది.
 దిగువ మధ్య తరగతి జీవితాల్లో జరిగిన విషాదాన్ని చర్చించిన వాస్తవానికి అతి చేరువలోనున్న సలీం నవల ‘మరణకాంక్ష’ ‘A DESIRE FOR DEATH’  పేరిట ఆంగ్లం లోకి అనువాదం కూడా అయింది. ఇది అంతర్జాలం లో గూగుల్ బుక్స్ లో కూడా లభ్యమౌతుంది. మన తెలుగు నవల భారతీయ,  అంతర్జాతీయాంశాలను  సకాలంలో చర్చించడం, ఆ విషయమే ఈరోజు సుప్రీం కోర్టు తీర్పు గా వెలువరించడం కవులు క్రాంత దర్శులు అని మరో మారు రుజువు చేస్తుంది. సలీం కేవలం మన తెలుగు రచయితే కాదు అంతర్జాతీయ స్థాయి రచయిత అని చెప్పేందుకు అతను రచించిన తొలి ముస్లిం నవల “వెండిమేఘం’(2003), నేడు ఈ ‘మరణకాంక్ష’ (2011) సాహిత్య చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి అనడంలో సందేహం లేదు.
జగద్ధాత్రి (87122 93994)

Monday, December 2, 2013

అన్నీ మరణించాల్సిందే




ఆంగ్ల  మూలం : ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ 

తెలుగు సేత : జగద్ధాత్రి


అన్నీ మరణించాల్సిందే 

స్పష్టంగా నీలి నది సాగుతూ మొగుతోంది
నా కంటి కింద ;
వెచ్చగా , వెడల్పుగా దక్షిణ గాలులు వీస్తున్నాయి

అటు ఆకాశం లో
తెల్లని మబ్బులు ఒక దాని తర్వాత ఒకటి వరుసగా కదులుతున్నాయి ;
ఈ మే మాసపు ఉదయాన ప్రతి హృదయం ఆనందం తో స్పందిస్తోంది
పూర్తిగా ఆనందంతో ;
అయినా అన్నీ మరణించక తప్పదు.
సాగే వాగు ఆగిపోతుంది ;
తేలే మబ్బులు నిలిచిపోతాయి ;
హృదయ స్పందన ఆగిపోతుంది ;
ఎందుకంటే అన్నీ మరణించాల్సిందే ;
అన్నీ మరణించాలి
రాదిక వసంతం మరి రానే రాదు .

ఓ , అహమా !
మృత్యువు ద్వారం వద్ద వేచి ఉంది సుమా
చూడండి! మన మిత్రులందరూ పిలుస్తున్నారు
తాగి ఆనందంతో చిందులేసేందుకు .
మనల్ని పిలిచారు --- మనం వెళ్ళాలి తప్పక .
దిగువగా , బాగా కిందన
చీకటిలో మనం వాలాలి .
సంతోషపు కేరింతలన్నీ ఆగిపోయాయి
పికము కల కూజితం
ఇక వినబడనే బడదు ,
గాలీ కొండా కూడా నిశ్శబ్దమే ఇక.

ఓ ధు:ఖమా !
ఆలకించు ! మృత్యువు పిలుస్తోంది
నీతో మాటాడుతుంటే
నా దవడ జారిపోతోంది ,
ఎర్రని బుగ్గ పాలిపోతోంది
బలమైన ఎముకలు పడి పోతున్నాయి
వెచ్చని నెత్తురుతో మంచు కలసి పోతోంది
కను పాపలు నిలిచిపోతున్నాయి
తొమ్మిది సార్లు మోగుతోంది సాగే మృత్యు ఘంటిక ;
ఆనంద మనస్కులారా , ఇక వీడ్కోలంటూ .

పురాతన ధాత్రి
ఒకనాడు జన్మించింది
అందరికీ తెలిసినట్టుగానే ,
చాలా కాలం క్రితం
ఈ పురాతన ధరణి మరణించాల్సిందే .
కనుక వేడి గాలులను రేగనివ్వండి ,
నీలి కెరటాలను తీరం తాకనివ్వండి ;
ఎందుకంటే ప్రతి ఇరు సంధ్యలూ
ఇక నీవు చూడలేవు
శాశ్వతంగా.
అన్నీ జన్మించినవే
ఏవీ తిరిగి రావు మరల
ఎందుకంటే జన్మించినవన్నీతప్పక మరణించాల్సిందే

Monday, October 21, 2013

జగమంత కుటుంబం 2 వివేకానంద విషాదం my feature in CHINUKU MONTHLY october 2013


సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న నా మేనల్లుడు  ఆదిత్య ఒక మాట అన్నాడు . నాకు ఎవరివైనా జీవిత చరిత్రలే చదవాలనిపిస్తుంది అత్తా , ఈ కల్పితాలు కాల్పనిక  రచనలు నేను చదవను . జీవిత చరిత్రలు చదవడం లో స్ఫూర్తిని పొందుతాము ఎన్నో విషయాలు  తెలుసుకుంటాము , పైగా అవి నిజంగా జీవించిన వారి గురించి కనుక ఆసక్తిని కలుగ చేస్తాయి అని . పాతికేళ్లు కూడా లేని పిల్లాడు , ఈ రోజుల్లోని అబ్బాయి ,అలా అనడం ఆశ్చర్యమనిపించింది నాకు . ఆలోచించి చూస్తే నిజమే కదా అనిపించింది . అలాంటి ఒక మనమెరిగిన మనిషి ,  లోకం ఎరుగని చరిత్ర  గురించి ఈ సారి కాసేపు మాటాడుకుందాం .
“అవేక్ ! అరైస్ ! స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈస్ రీచ్డ్” మేలుకో! లే! గమ్యం చేరేవరకు ఆగకు ! ఈ సందేశం ఎవరిచ్చారో జగమంతా , ఈనాటికీ ఈ మాటలు వింటే ఎంత ప్రభావితమౌతామో మీ అందరికీ చెప్పక్కర్లేదు . మనందరికీ తెలిసిన ఆ స్వామి వివేకానందుడు , అతి చిన్న వయసులోనే అంటే 39 వ ఏటనే ఎందుకు మరణించాడు ? ఆ చిన్న వయసులోనే దాదాపు 30 వ్యాధులకు పైగా గురై అన్నది ఆశ్చర్యంగా లేదూ. 
సన్యాసం శూన్యం నాదీ అనుకుంటూ అతి చిన్న వయసులోనే రామ కృష్ణుని శిష్యరికం చేసిన నరేంద్రుడు ఆ పై వివేకాభివృద్ధి చెంది వివేకానందుడై , కేవలం భారత దేశాన్నే కాక , విదేశాలలోనూ మన భారతీయ సంస్కృతిని చాటి చెప్పిన విశ్వ కుటుంబీకుడు వివేకానందుడు . వివేకానందుడి 150 జయంతోత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణం లో యోగిగా , నిష్టా గరిష్టునిగా , నిర్మలమైన దరహాసం తో మనకి దర్శన  మిచ్చే స్వామి, చేతులు కట్టుకుని విప్పారిత జ్ఞాన నేత్రాలతో చూస్తోన్న కాషాయం లో ఉన్న ఒక స్ఫూర్తిని పెంపొందించే మూర్తి మన కనుల ముందు కదలాడుతుంది వివేకానందుని తలచుకోగానే . కానీ మిత్రులారా దీపం  కింది చీకటిలా వివేకానందుడు అతి చిన్న జీవితం లోనే ఎన్నెన్ని అనుభవాలు , కష్టాల కావిళ్లెత్త వలసి వచ్చిందో తెలుసుకుంటే  గుండె  చెరువై పోతుంది . నిజం అతని అంతర్గత జీవనాన్ని , కేవలం , ఒక యోగి గా కాక ఒక మనిషిగా  అతని జీవనాన్ని పరిశీలించి రాసిన ఒక పుస్తకం చదవడం తటస్థించింది. ఆ పుస్తకం " ద మంక్ ఏస్ మేన్ , ద అన్నోన్ లైఫ్ ఆఫ్ స్వామి వివేకానంద" , ఈ పుస్తకం రచయిత "శంకర్ " మణి శంకర్ ముఖర్జి అనబడే  ఈ రచయిత బెంగాలీ లో చాలా విస్తృతంగా  చదవబడుతున్న నవలాకారుడు. ఇతను రాసిన నవలలు "సీమ బద్ధ ", "జన అరణ్య " ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే వెండి తెర చిత్రాలుగా మలచాడు . 
నవలలే కాక వివేకానందుని పై శంకర్ పరిశోధనాత్మక రచనలు వ్యాసాలు చాలా పేరు తెచ్చాయి. అతి చిన్న వయసులో తండ్రిని పోగొట్టుకుని , బ్రిటిష్ పాలన లో గుమాస్తా ఉద్యోగం లో చేరాడు శంకర్. అతని హెడ్ మాస్టర్ అతనికి పదకొండవ సంవత్సరం లోనే వివేకానందుని సాహిత్యం పై మక్కువ కలిగించారు. నీవు సత్యమైనది  చదువు ఎప్పటికీ దారి తప్పవు అంటూ భరోసా ఇచ్చారు. ఇక అప్పటినుండీ మొదలైన సాహితీ సృజన , పరిశోధనాత్మక రచనా రెండూ ఇప్పటికీ అపలేదు శంకర్. ఈయన ఇప్పుడు కొల్కోత లో ఉంటున్నారు . ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక పుస్తకాన్ని ముఖ్యంగా చరిత్రని కానీ ఒక జీవితాన్ని గూర్చి గానీ రాసేవారిని బట్టీ ఆ పుస్తకం పట్ల ఆ వివరాల పట్ల మనకు గౌరవం నమ్మకం కలుగుతాయి కదా అందుకు. వివేకానందుని  జీవితం గురించి శంకర్ చాలా రాసినప్పటికీ ఇంకా అతను మరణించి 110  వత్సరాలు దాటుతున్నా ఇంకా అతని జీవితం లో చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయని భావించారు , అందుకే దాదాపు 200 పుస్తకాలకు పైగా వివేకానందుని గురించి వచ్చినవి కాక , తన పరిశోధనతో , వివేచనతో , జరిగిన  విషయాలను కూలంకషంగా పరిశీలించి రాసిన పుస్తకం ఇది . ఇందులో వివేకానందుడు మనకు దర్శన మిచ్చేది ఒక యోగి గా మాత్రమే కాదు ఒక మామూలు మానవునిగా ఎన్నెన్ని కష్టాలు బాధలు శారీరిక మానసిక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కున్నాడో చదివితే హృది చెమరించక మానదు ఎవరికైనా . 
ఇంతగా కదిలించిన ఈ సత్యా లను మీతో పంచుకుందాం అన్నదే నా చిరు ప్రయత్నం.
తన కన్నా తన బిడ్డలు ముందరే వెళ్ళి పోవడం ఏ తల్లీ సహించలేని బాధ . వివేకానందుని తల్లి భువనేశ్వరి దేవి భరించింది . తన ముందరే ఒక కూతురు , ఇద్దరు కొడుకుల మరణాన్ని చూసి నిస్సహాయంగా జీవించింది . అంతకన్నా ఆశ్చర్యం ఆమె తల్లికి ఈమె ఒక్కతే కూతురు కావడం వలన ఈమెతోనే చివరి వరకూ ఉండి , భువనేశ్వరి దేవి మరణించిన రెండవ రోజు ఆమె మరణించడం విచిత్రం కానీ ఇది నిజంగా జరిగిన సత్యం .
"నా పుత్రుడు 24 ఏళ్లకే  సన్యాసం స్వీకరించాడు  " అని మెరుస్తున్న కనులతో ఆమె చెప్పిన వైనం ఇప్పటికీ చరిత్ర లో ఉంది . ఆమె తో వివేకానందునికి ఉన్న అనుబంధం జీవితాంతం వివేకానందుని  వేధిస్తూనే ఉంది . తన తల్లి కోసం ఏమీ చెయ్య లేక పోయాననే ఒక ఆవేదన ఎల్లప్పుడూ వివేకానందుడి మనసులో  ఉంది  .  తల్లికి పెద్ద కొడుకు కాదు వివేకానందుడు ఎందుకంటే ఆమెకు తొలి కాన్పు కొడుకు చిన్న వయసులోనే చని పోయాడు . నరేంద్రుడు అప్పటినుండీ ఇంటికి తానే పెద్ద కొడుకు గా అన్ని బాధ్యతలనూ స్వీకరించాడు . ఎంతో గొప్ప ఇంటిలో పుట్టిన వాడైనా , తండ్రిని చిన్న వయసులో కోల్పోవడం, ఆ పైనా తన సన్యాస స్వీకరణ , మిగిలిన తమ్ములు , అక్క  చెల్లెళ్ళు  అందరి బాధ్యత ల నుండి బయట పడటం చాలా కష్టమైన పని. అది కేవలం తల్లి ఆశీర్వాదం తోనే చెయ్యగలిగాను అన్న అతని భావన అతని మాతృ భక్తికి నిదర్శనం . 
వివేకానందుడు  సన్యాస జీవితానికి , కుటుంబ బాధ్యతలకి నడుమ ఉన్న నిరంతర సందిగ్దం , విడిచి పెట్టి సంపూర్ణంగా రామకృష్ణుని మఠానికి తన జీవితాన్ని అంకితం చేయడం లోనే స్వామి వివేకానందుని  గొప్పతనమంతా ఉంది. అయితే ఎంత యోగి అయినా సన్యాసి అయినా మానవుడు మానవుడే కదా , సహజమైన మాతృ ప్రేమ ను కాదన  గలిగే వాడు కాదు కదా . అందుకే వివేకానందుని తల్లితో అనుబంధం శంకరాచార్యుని తో పోల్చ బడింది . శంకరాచార్యులు అంతటి యోగి అయినప్పటికి అతని కి తల్లి పై ఉన్న ప్రేమ అపార మయినది . ఒక సన్యాసి పితృ కర్మ చేయకూడదని తెలిసినా తల్లికి మాటిచ్చినట్టు గా ఆమె మరణించిన తర్వాత ఆమె అంత్య క్రియలు చేసేడు శంకరుడు. కానీ వివేకానందుడికి ఆ అదృష్టమూ లేదు , అతని తల్లికి ఆ ప్రాప్తమూ లేదు . 
చాలా మందికి తెలియదు వివేకానందునికి తొమ్మిది మంది అన్నదమ్ములూ  అక్కచెల్లెళ్లూ ఉన్నారని . భువనేశ్వరి కి ఐదవ కానుపు లో  కలిగిన ఆడపిల్ల అరెళ్ళుకే చనిపోయింది. మరొక అమ్మాయి తన అత్తవారింటిలో ఉరేసుకుని తన పద్దెనిమిదవ  ఏట చనిపోయింది. మహేంద్రనాథ్ , భూపేంద్రనాథ్ వివేకానందుని తమ్ములు. చాలా మటుకు అతని జీవిత విశేషాలు  వారికి రాసిన ఉత్తరాల వలన లోకానికి తెలిసింది . వివేకానందుని జీవితం లో జరిగిన అతని అక్కల చెల్లెళ్ల మరణాలు ఎక్కడా అతని జీవిత చరిత్ర రాసిన వారు నమోదు చేయలేదు . 
స్వామి వివేకానందుని గా మన ఎంతో ఆరాధించే ఈ నరేంద్రుడు నిజానికి ఒక  ఆకతాయి అమ్మ కూచి. అమ్మమ్మ దగ్గరా, అమ్మ దగ్గరా ఎంతో గారంగా ఉండేవాడు. తండ్రిని హఠాత్తుగా పోగొట్టుకున్న వారి సంసారం ఒక్క సారి వీధిన పడింది. నెలకు వెయ్యి రూపాయల ఖర్చుతో ఇల్లు నడిపే తల్లి ముప్పై రూపాయలతో నడపడానికి ఎంతో శ్రమించేది . 
ఒకోసారి పొద్దున్న లేవగానే తినడానికి ఏమీ ఉండేది కాదు , అది గమనించి తల్లి బాధ పడుతుందని ఎవరో తనకు భోజనం చెప్పారని ఇంటినుండి బయటపడేవాడుట వివేకానందుడు. కటిక ఉపవాసాలూ , సరి అయిన భోజనం లేక అతి చిన్న వయసులోనే రోగ నిరోధక శక్తి ని కోల్పోయి ఎన్నో వ్యాధులకు గురయ్యింది అతని దేహం. అయినా మొక్కవోని పట్టుదల , తీవ్రమైన దీక్షా వ్రతుడు కావడం వలన తను సాధించవలసిన పనులన్నీ సాధించి ఆ పైనే మరణించాడు . పోయే ముందు కూడా అందరి అప్పులూ తీర్చి వేసానని , మఠం కోసం వచ్చిన  నిధులనుండి కనీసం ఒక పైసా కూడా తీసుకోకుండా , తన ప్రసంగాలవలన వచ్చిన సొమ్ముతో కొంత తమ్ముడిని  ఇంగ్లండ్ పంపి చదివించాడు. తల్లికి ఉండటానికి ఒక చిన్న ఇల్లు కొనివ్వగలిగాడు.  
తన తండ్రి బ్రతికున్న రోజుల్లో సంపాదన లో కొంత మొత్తం తన మేనమామ కిచ్చి తన భార్య భువనేశ్వరి దేవి పేర ఆస్తి కొనమంటే . ఆయన  కొన్న ఇల్లు , ఆస్తీ అన్నీ ఆయన పోయాక , మేన మామ పోయాక , మేనత్త  ఆ ఆస్తి ఇల్లు తనవేనని కోర్టులో దావా వెయ్యడం  ఆ వ్యాజ్యం ఎన్నో ఏళ్ళు సాగడం తో ఆర్ధికంగా ఎన్నో కష్టాలు పడ్డారు వివేకానందుని కుటుంబం. ఎన్ని పనుల్లో ఉన్నా ఎంత సతమత మై పోతున్నా , అనారోగ్యంగా  ఉన్నాఇటు మఠం పనులు అటు సంసార బాధ్యతనూ కావిడి కుండల్లా చివరి వరకూ మోస్తూనే ఉన్నాడు వివేకానందుడు. 
చివరికి భువనేశ్వరి దేవి ఇల్లు ఆమె అన్నయ్య తన బావగారిచ్చిన సొమ్ముతోనే కొన్నట్టు రుజువవడం తో తల్లికి ఇల్లు దక్కింది. ఇంత బాధా వీరిని పెట్టిన మేనత్త చివరి  రోజుల్లో మళ్ళీ వివేకానందుడి వద్దనే ఉంది . ఎటువంటి ద్వేషమూ లేని యోగి కనుక ఆమె యోగ క్షేమాన్ని కూడా చూశాడు వివేకానందుడు. 
వివేకానందుడి జీవితం లో కొన్ని సంఘటనలు మనల్ని కలచి వేస్తాయి. ఒక సారి తాను ఇంటికి వచ్చేటప్పటికి తల్లి అమ్మమ్మ భోజనం చేస్తున్నారట , వివేకానందుడికి తల్లి కంచం లోంచి తినాలనిపించిందట , తీరా చూస్తే ఆమె అప్పటికే భోజనం పూర్తి చేసిందట ఏదో ఒక ఆకు కూర కాడ ముక్క మిగిలి ఉంటే దానినే తిన్నాడట. అతనికి తల్లి పై ఉన్న మమకారం , సంసారం కోసం శ్రమిస్తూనే తనకు సన్యాసం స్వీకరించడానికి మనస్ఫూర్తిగా  అనుమతిచ్చిన తల్లి అంటే  హిమాలయమంత గౌరవం అతనికి. 
వివేకానందుడు చాలా బాగా వంట చేసేవాడట. ఈ విషయం మనకి సిస్టర్ నివేదితా ఉత్తరాలలో  లో తెలుస్తుంది నా కోసం స్వామి వంట చేసి పెట్టారని అది జన్మంతా మరవలేనిదని ఆమె కూడా రాసుకుంది. తన సహ మిత్రులైన సన్యాసులకోసం  కూడా వంట చేసేవారట స్వామి. మా బెంగాలీ వారం బహు భోజన ప్రియులమ్ అని హాస్యమాడేవారట . 
అందరికీ వండి పెట్టి తాను మాత్రం ఏమీ తినకుండా ఉండాల్సి వచ్చేదట అనారోగ్యం మూలాన , అయినా అందరికీ వండి పెట్టడం లో తాను చాలా ఆనంద పడేవారట . 
అమెరికా నుండి తిరిగి వచ్చాక వివేకానందుడికి ఆరోగ్యం పాడై వొంట్లోంచి వేడి ఆవిరులు వచ్చేసేవట . మంచం మీద పడుకోలేక . నేల మీద పడుకోలేక చాలా బాధ పడేవారట . ఎప్పుడూ తాను వేగం వెళ్ళి పోతానని బేలూరు మఠం పనులు చేస్తున్నప్పుడు తన మిత్రులతో చెప్పేవారట. ఆస్త్మా   వస్తే తట్టుకునే శక్తి దైహికంగా ఉండేది కాదట. అదేమీ చిత్రమో కలకత్తా చేరుతూనే ఆస్త్మా  ఉధృతం అయ్యేదట . 
1898 లో అమెరికా యాత్రలో ఒకసారి ఆయనకి గుండె పోటు వచ్చిందని మహేంద్ర నాథ్ రాసిన వాటిలో తెలుస్తుంది. భోజనం చేసి కూర్చున్న మనిషి ఒక్క మారుగా చాలా బాధకు గురయ్యారని ఆ తర్వాత సర్దుకున్నారు అని రాస్తాడు అయన. అయినా ఆయనలోని ఆ హాస్య స్పోరకత , పట్టుదల ఏమీ తక్కువ కాలేదు. ఎన్నో యాత్రలు చేసేరు వివేకానందుడు , చివరి సారిగా తల్లిని తీసుకుని గయా యాత్ర కూడా చేశారు. కానీ అనారోగ్యం అతన్ని ఒక్క రోజు కూడా కుదురుగా ఉండనివ్వలేదు . 
విపరీతమైన తల నొప్పి ,(మైగ్రేన్)టాన్సిలిటీస్ ,డిఫ్తీరియా / ఫ్లూ /దగ్గు , ఆస్త్మా, మలేరియా , టైఫాయిడ్ ,  ఏవో రకాల విష జ్వరాలు , కాలేయ వ్యాధి అజీర్తి , గేస్ట్రో ఎంట్రీటిస్ పొట్టలో నీరు చేరడం ,డిసెంట్రీ , డయేరియా  ఆకలి లేక పోవడం పొత్తి  కడుపు నొప్పి, గాల్ బ్లాడర్ స్టొన్స్ ,లుంబాగో (నడుము చివర నొప్పి ) మెడ నొప్పి  బ్రైట్స్ డీసీస్  కిడ్నీవ్యాధులు  డ్రాప్సీ ,అల్బుమినూరియా , రక్తంచిందే కనులు  , కుడి కన్ను దృష్టిని కోల్పోవడం , నిదుర లేమి  ,తల గెడ్డం చిన్న వయసులోనే నెరిసి పోవడం , న్యూరెస్తెనియ,  భోజనం కాగానే వొళ్ళు వేడెక్కి పోవడం  వేడి తట్టుకోలేక పోవడం  ఎక్కువగా అలసట  సముద్ర ప్రయాణం లో బాధ సన్ స్ట్రోక్  డయబెటిస్  గుండె సంబంధించిన వ్యాధులు  ఇన్ని వ్యాధులతో బాధ పడేవారని వైద్యులు ఒక పట్టిక తయారు చేసేరు . 
ఎవరైనా  తనని ప్రసంగానికి పిలిస్తే దయచేసి రైలులో రెండవ తరగతి టిక్కెట్ కొనమని బతిమిలాడుకునేవారట . ఎందుకంటే ఆ రోజుల్లో థర్డ్ క్లాస్ లో బాత్రూమ్స్ ఉండేవి కావుట . 
తన ఉత్తరాల్లో ఎవరికైనా రాసేటప్పుడు ఈ విషయాలను తన ఆరోగ్యాన్ని ప్రస్తావించేవారట వివేకానందుడు. ఇన్ని వ్యాధులు బాధలు ఉన్నా  దైహికంగా,చెదరని సడలని  మనో నిబ్బరం అతన్ని ఎప్పుడూ నిర్మల హాసితునిగానే  ఉంచేవి . చిన్న చిన్న బాధలకే చతికిలబడి పోయే మనం ఇది చూసి ఎంత నేర్చుకోవాలి. ఆత్మ శక్తి ముందు ఏదీ నిలవలేదని నిరూపించిన నిరుపమాన మూర్తి వివేకానందుడు. అసలు అతన్ని సంసార బాధ్యతలుండగా నీకు సన్యాస మెందుకు  నీ కుటుంబానికి నీ అవసరం ఉంది అని చెప్పారట రామ కృష్ణుల వారు అయినా వివేకానందుడు సన్యాసం వైపే మొగ్గు చూపి స్వీకరించాడు. ఒక సారి ఒక ఆయుర్వేద వైద్యుని సలహా తో 21 రోజులు మంచినీరు తాగకుండా ఉన్నారట . అంతటి పట్టుదల ఆయనది. అతనికి వైద్యం చేసిన డాక్టర్ల వలన ఆయన విషయాలు కొన్ని ఆయన పోయాక గానీ తెలియలేదు. ఇంత బాధ లోనూ న్యూ యార్క్ లో ఉన్న మేరీ హేల్ అనే ఆమెకి జూన్ 23 వ తేదీన "మీ ఉత్తరం అరిగించుకోలేక పోయాను అజీర్తి బాధితుడ్ని కదా " అంటూ హస్యంగా రాశారట. నిరంతరం రాస్తూనే ఉండే ఆయనకి చివరి దశ లో పెన్ను పట్టుకోవడమే కష్టమై పోయింది. పైగా కను దృష్టి కూడా పోయింది. 
ఆ రోజు అంటే జూలై 4 ,1902  ఆ మహాభి నిష్క్రమణ దినం నాటికి ముప్పై తొమ్మిదేళ్ల , ఐదు నెలల, ఇరవై నాలుగు రోజులు అతని వయసు. ఆరోజు పొద్దుటినుండీ ఏమి జరిగిందో వివరంగా ఇచ్చారు ఈ పుస్తకం లో. దాదాపు 9 -9.30 ప్రాంతం లో రాత్రి బరువుగా ఊపిరి వస్తుంటే డాక్టర్ ని పిలుచుకొచ్చారు . ఆ రాత్రి 10.30 ఆ ప్రాంతం లో వివేకానందుడు ఈ పాంచ భౌతిక  దేహాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఈ వార్త అతని తల్లికి ఆమె చిన్న కొడుకు చెప్పగానే ఆమె ఎలా పోయాడు అని అడిగిందట . అచ్చం నాన్న గారి  లాగే సాయంకాలం గుండె నొప్పి వచ్చింది  వెంటనే పోయారు అని చెప్పాడట. కొడుకు దేహాన్ని చూస్తూ ఏడుస్తున్న తల్లిని తిరిగి పంపి వేసాము కాసేపు ఉన్నాక అని సిస్టర్ నివేదితా తన జీవిత చరిత్ర లో రాసుకున్నారు. సన్యాస ఆశ్రమ ప్రకారమే అతనికి అంత్య క్రియలు చేసేరు. 
అతని సమాధి వద్ద ఒక చిన్న గుడి కూడా 1907 జనవరి వరకు నిర్మించలేదట.ఆ పని 1924 జనవరి 24 న పూర్తి చేశారట . అలాగే అతని డెత్ సెర్టిఫికేట్ కూడా ఎవ్వరూ చూడలేదట ఇప్పటివరకు  
ఇందరి హృదయాలను మన్ననలను చూరగొన్న స్వామి వివేకానందుని జీవితం అలా ముగిసి పోయింది . రామ కృష్ణ మఠం వారు కనుక  ప్రచురించక పోతే ఆయన రాసినవన్నీ పోయేవి అంటారు శంకర్. 
ఈ పుస్తకం లో మొదటి  చాప్టర్ ఏ మంక్ అండ్ హిస్ మదర్, రెండవది ,ఎంపేరర్, మంక్ , అండ్ కుక్ ఇన్ వన్ , మూడవది ద మంక్ హూ లవ్డ్ టీ, నాల్గవది , స్వామీజీస్ హెల్త్ , అయిదవది ఆఖరిది థర్టీ నైన్ ఈయర్స్ ,ఫైవ్ మంత్స్ , అండ్ ట్వెంటీ ఫోర్ డేస్ గా రాసేరు. 
ఇంతకీ ఈ విషయాలు మనం ఇక్కడ ఎందుకు చెప్పుకున్నాం అని ప్రశ్నిస్తారు మీరు . ఎందుకంటే అతి పిన్న వయసులోనే ఎన్నో బాధలకు అన్నీ రకాలుగా గురయినా కూడా మొక్కవోని  సంకల్ప బలం తో బేలూరు మఠాన్ని తన చేతుల మీదుగా కట్టిన మహనీయుడు , రామకృష్ణుని ప్రియ శిష్యుడు వివేకానందుడు. అందుకే నాకనిపిస్తుంది ఎప్పుడూ గురువులను వెదుక్కుంటూ శిష్యులు వెళ్లక్కర్లేదు ఆ గురువే శిష్యుని అన్వేషిస్తూ వస్తాడు. అలా తన జీవితం లోకి వచ్చిన తనని ప్రభావితం చేసిన రామకృష్ణుని బోధలు మఠం ఏవీ వివేకానందుడు లేకుంటే ఉండేవి కావు . 
మనమందరం గుర్తు పెట్టుకునే స్వామి వివేకానందుడి ఫోటో కూడా తీసేటప్పుడు తాను అనారోగ్యంగానే  ఉన్నాడు . కాస్త ఒళ్ళు కూడా ఉబ్బరంగానే ఉంది . అతనిది అంతా తల్లి పోలిక ఆ విశాలమైన కనులు తల్లి నుండి వచ్చాయి అతనికి.  ఎందరో  రాసిన పుస్తకాలు అతనితో సాక్షాత్తూ జీవితం గడిపిన వ్యక్తుల కధనాలు అన్నీ పరశీలించి , పరిశోధించి శంకర్ ఒక మంచి పుస్తకాన్ని రాసేరు అనడం లేదు నేను. వివేకానందుడి బతుకు పుస్తకాన్ని తెరిచి మనకి అతని పట్టుదల , అప్రమేయమైన , అవ్యాజ్యమైన అతని అనురాగాన్ని మనకు అందించారు . ఇవన్నీ తెలియని ఎందరో వివేకానందుని ఎంతో ఆరోగ్య వంతుడనుకుంటారు . అయితే ఈ విషయాలు తెలుసుకున్నాక స్వామి వివేకానందుడి పట్ల మనకి మరింత ప్రేమ  పెరుగుతుంది , ఎంతటి శ్రమ కోర్చి లోకం కోసం తన జ్ఞానాన్ని పంచి ఇచ్చాడు అని ఒక భక్తి భావన కలుగుఃతుంది . దైవం మానుష రూపేణ అని ఏ దైవమో  ఇలా ఈ జన్మ  లో ఉన్న అతి కొద్ది యేళ్లలో సముద్రమంతటి జ్ఞానాన్ని మనందరికీ పంచి ఇచ్చాడు అనిపిస్తుంది. ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ తెలియకుండానే కనులు చెమరించుతూనే ఉన్నాయి . 
ఈ పుస్తకం దొరికితే చదవగలిగితే చదవండి మిత్రులారా , నాకు ఉన్న ఈ కొద్ది పరిమితి లో నా జ్ఞాన పరిమితిలో మీతో ఈ విషయాలను పంచుకున్నాను . ఒక పాటగుర్తొస్తోంది బహుశా తాతమ్మ కల సినిమాలో భానుమతి పాటనుకుంటా ,"ఎవరనుకున్నారు ఎవరు కల గన్నారు, ఎవరెందుకు పుడతారో , ఏ పని సాధిస్తారో ?  ఏడవ కొడుకుగ గాంధీ పుడతాడనుకున్నారా పుట్టి స్వరాజ్యాన్ని తెచ్చి పెడతారనుకున్నారా ?" నిజమే కదూ స్వామి వివేకానందుని లాంటి  వారు కారణ జన్ములు.  వారు చేయాల్సిన కార్యం పూర్తవగానే వారు వెడలిపోతారు శంకరాచార్యులు , క్రీస్తు ఎవరు చూశారు నలభై. నేను నలభై చూడను అనేవారట వివేకానందుడు ఆ యనకి తెలిసి పోయిందేమో  తన ఆయు ప్రమాణము అని కూడా అనిపిస్తుంది. వివేకానందుని ప్రేక్టికల్ వేదాంత ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచమంతటికీ శిరోధార్యం కాదా ! 
జగమంత కుటుంబం కాదు జగమే కుటుంబం తనకి , సన్యాసం శూన్యం కాదు సన్యసించినా జ్ఞానామృతాన్ని మనకి పంచి ఇచ్చిన ఆ మహనీయునికి ఇదే వందనం !!!
.........................................................................జగద్ధాత్రి 

Wednesday, October 9, 2013

అపరిచిత చెలిమి



ఉండుండీ ఎందుకో హఠాత్తుగా
మనసు  మూగ బోతుంది
నీ మనసును అర్ధం చేసుకోవడం లో
మునిగిపోతుంది ...
నా అంచనాలకు దొరక్కుండా
ఒక అద్భుత హఠాత్ పరిణామం లా
ఆవిష్కరింపబడాలని నీ ఆలోచన
అందుకే మన మధ్య
ఉల్లి పొర లాంటి  యవనిక వేస్తావు
చిరునవ్వుతోనో , లేక చిరు కోపం తోనో ...
అప్పుడే నీ హృదయ భావం అంది
నేను భావోద్విగ్నతతో కదిలి పోతాను
అబద్ధమాడకుండా , నిజం చెప్పకుండా నీవు
నిజం అర్ధమైన అయోమయం లో నేను
ఎక్కడో చెలిమి శిఖరాగ్రం వద్ద
ఇద్దరు అపరిచితుల్లా కలుసుకుంటాము
దాచలేని మమతతో నేను
మమత దాచే యత్నం లో నీవు
ఎప్పుడూ ఇలా ,విడి, కలిసి , విడి ,కలిసిపోతుంటాం
విడి విడిగా ఏకమై
ఏకం లో మమేకమై ఎప్పటికీ ....!!!
.............................................................జగద్ధాత్రి 09/10/2013 1.11పి.ఏం బుధవారం