Thursday, May 19, 2011

మీకు.... !!!




  మీకు....
మీరు అందరి ఉత్తరాలకి జవాబిస్తారని తెలుసు. గుండె రాసే ఉత్తరాలకి అక్కడి నుండి కూడా జవబిస్తారని  మొన్న వైశాఖ పౌర్ణమి నాడే అనుభూతించాను. ఎంత దయ నీకు నా యీచిన్ని మనసు పై . వారం రోజులనుండి మనసు కొట్టుకులాడుతోంది అయ్యో వైశాఖ పౌర్ణమి చలం పుట్టిన రోజు కదా ఏమీ చెయ్యలేక పోయానే ,కనీసం నీకోసం ఓ రెండు వాక్యాలైన రాయ లేకపోతిని ఎందుకో. మీకు తెలుసు గా మీ కిష్టం లేక పోయినా నాకు మాత్రం పుట్టినరోజులంటే  చాల ఇష్టం. కాని నా జీవితంలో మా డాడీ ఉననంత  వరకే   ఆ సరదా ఉండేది. తర్వాత పోయింది . నీ పుట్టినరోజుకి ఏమీ చెయ్యలేకపోతున్నానూ అని ఎన్ని  రాత్రిళ్ళు ఎంత గా ఏడ్చానో నీకు తెలుసు. అందుకే వైశాఖ పున్నమి పొద్దున్నే షౌ "స్నేహ కుటి"భీమిలి నుండి పిలుపు సాయంత్రం రమ్మని . చూసుకో నా మనసు ఇక. మీ మీద ప్రేమున్న వాళ్ళం  కొందరం చేరాము. అన్నట్లు చిక్కాల కృష్ణారావు గారు వచ్చారు పాపం దేహం సహా కరించక పోయినా అవస్థ పడి అయినా చెరగని చిరునవ్వుతో ....చెప్పడం మరిచాను మన చందర్ రావు వచ్చేసాడు ఎక్కడి నుండో మరి. మీ ఇద్దరూ మల్లె పూలు తను గీసిన మీ స్కెచ్ దాని మీద మీ సంతకం. భలే రాసారూ అచ్చం ఆ గెడ్డం అదీ చలం లాగే ఉన్నాడని" మీ స్కెచ్ మీద మీరే రాసిన కామెంట్ చదివి ఆనందించాము మీ సెన్స్ అఫ్ హుమర్కి. రామతీర్థ మీ "సుధ" నుండి కొంత సుధ ను తన మాటలతో మాకు పంచాడు. నేనూ మటాడాను....తరవాత   చెప్తాను లెండి. స్నేహ కుటి నిర్వాహకుడు రాజశేఖర్ , లక్ష్మి అందరం , అన్నట్టు చలసాని ప్రసాద్ కూడా వచ్చారు. అందరం మీ గురించి చెప్పుకుంటుంటే మీరు వింటున్నారని మాకు తెలుసు. భీమ్లీ సముద్రం ఒడ్డ్డున చలం సూఫీ సంచరిస్తుంటాడు అని రాసాడు మీ గూర్చి రామ్స్ ఓ కవిత లో . అప్పుడుదయించాడు పిడకల దాలి పై చిన్న సెగ లో బాగా దగ్గరగా కాచిన పాల పై తారక లా పున్నమి చంద్రుడు. మీరు ఇక అప్పుడు ఆ ఇసికల్లో ఆడుకుంటూ పాడుకుంటూ మీరు షౌ తిరుగాడుతూ ఉంటారు. మీకు ఇష్టమైన పనసకాయ పలావ్ భలే కుదిరిందీ . నూజివీడు రసాలు అబ్బా మీ పాటల్లా , షౌ సంగీతం లా , లీల గారి వీణ వాయిద్యంలా.... ఇంకేముందీ ...ముందుగా రజని గారికి మీరిచ్చిన ఇంటర్వ్యూ ఎప్పటిలాగే మీ గొంతు విన్నాము.  అందరం మీరు కూర్చునే కుర్చీ మా పక్కగా వేసుకుని మీ ఫోటో మిమ్మల్ని కూడా మాతోనే కూర్చో  బెట్టి సహా పంక్తిన భోజనం చేసాము....ఆ పండు వెన్నెల్లో....ఇంతకీ నేను చెప్పిందేమిటో నే చెప్పనే లేదు కదూ నాకు మీరు "అక్కడి" నుండి కూడా జవాబిచ్చారని హహ్హ్హా లేకపోతే నా వేదన మీకు  కాకపోతే వీల్లెవాళ్ళకి ఎలా తెలుస్తుంది అందుకే మీ జవాబు నాకు పిలుపుగా పంపించారు ....నేనూ మీ పుట్టినరోజు పనసకాయ పలావ్ వెన్నెలనూ మీతో కలసి భోన్చేసాను ఇంతకన్నా మీరు ఉత్తరాలకి జవాబిస్తారన డానికీ ఇప్పటికీ ఇస్తున్నారనడానికి ఏమి సాక్ష్యం కావాలి చెప్పండి.....ప్రేమతో....జగతి 
                                                                                                      may 17 mangala varam  vaisakha pournami.......        

2 comments:

  1. మీ వచనం ఓ కవనం లా,కవితే వచనమై ....చలం వూ కొడుతున్నట్లే వుంది. అభినందనలు దాత్రీజి .శ్రేయోభిలాషి ....నూతక్కి

    ReplyDelete