Saturday, October 1, 2011

సముద్రం, అతను,నేను

సముద్రం, అతను  నేను 
నీరెండలో  ఆ ఇసికలో పరిగెత్తి అలసి పోయి చెమట పట్టి ఆమె దగ్గరకు వచ్చాడు అతను. "ఏయ్ రా అలా నీళ్ళల్లోకి వెళ్దాం భలే బాగుంటుంది" కూర్చున్న ఆమె చెయ్యి పట్టుకుని అన్నాడు.
"వద్దు బాబూ నాకు నీళ్ళంటే భయమని చెప్పాగా"కదలకుండా అంది ఆమె .
"అబ్బా కదలవు కదా కూర్చుంటే" విసుక్కున్నాడు 
"మరే శ్రీశ్రీ చెప్పినట్టు 'కరి కళేబరములా కదలదు కొండ' అని మా డాల్ఫిన్'స నోస్ ఈ ధీరూ రెండు కదలవు...రెండు కొండలే " గలగలా నవ్వింది 
"మాట కు మాట భలే చెప్తావురా" ఆమె పక్కన కూర్చుంటూ అన్నాడు.
"ఏమి చెయ్యను అవన్న చెప్పాలి కదా ఇంకేమీ రాకపోయినా " 
"అవునా అమ్మాయికి ఇంకేమీ రావా, నిజం" నవ్వు
"నాకు మాత్రం ఏమి వచ్చు కనుక....నాకా మాటలు కూడా రావు " అన్నాడు 
"చేతల్ల్లో చెప్పేవాడికి మాటలెందుకులే" పకపక నవ్వింది 
"సరే పోనీ అలా నడుద్దాము దా రా " అంటూ ఆమె ను చేయిచ్చి లేవదీసాడు
అడుగులు నెమ్మదిగా వేస్తూ ఇద్దరు అప్పుడప్పుడు వచ్చి తాకుతోన్న కెరటాల స్పర్సననుభావిస్తూ ........
"నిన్నో మాట అడగాలని ఉంది ధీరూ"
"అడుగు"
"నీకు నాగురించి ఏమి తెలుసు అని నన్ను ప్రేమించావ్?"
"అబ్బా పాత డైలాగ్ బాలు మరేదన్న కొత్తగా అడుగు " పెదవులు బిగబట్టి నవ్వింది
"నీకు నేనెవరో ఏంటో తెలియదు, కానీ, నేను పిలవగానే నాతో ఇంత దూరం ...."
"ఇప్పటికి మాత్రం నువ్వెవరో తెలుసా ఏంటీ? ఎవరికీ ఎవరూ తెలియరు బాలు లవ్ హపేన్స్ అంతే "
"దీన్నే ఓషో అంటాడు రిలేటింగ్ అని...నిజం ఒకరికొకరం రిలేట్ అవ్వగలిగినప్పుడు ఈ పరిచయాలు తెలుసుకోవడాలూ అన్నీ అక్కర్లేదు...." మృదువు గా అంది అతని చెయ్యి నొక్కుతూ
"అయినా   ఇప్పుడవన్నీ  ఎందుకు  ఇక్కడ కూర్చుందాం రా ఇక్కడినుండి చంద్రోదయం చాల బాగా ఉంటుంది"
మెత్తటి  ఇసుక లో ఆమె, ఆమె మెత్తటి మేనుని అనుకుని అతను చేతులు రెండిటితో ఆమెను చుట్టేసి ఆమె భుజం పైన తల ఆన్చి ఇద్దరూ చంద్రోదయాన్ని వెన్నెల గోళం లా సగరుని లోనుండి పుట్టినట్టు నెమ్మదిగా పైకి వస్తోన్న నిండు పున్నమి  చంద్రుడు...
"అబ్బ  చాల  బాగుంది  కదూ  ఎన్ని సూర్యోదయాలు  చూసినా ఎన్ని చంద్రోదయాలు చూసినా ఇంకా ఈ జన్మ కు తనివి తీరదు నాకు" అన్నాడు తమకంగా ఆమె చెక్కిలి పై ముద్దాడుతూ. 
"మరే ఎందరు అమ్మాయిలను చుసిన తీరనట్టే ...." వెక్కిరింపుగా అంది 
చిన్నగా నవ్వి ఊరుకున్నాడు తను.....ఆమె మాటలకు
"ప్రతి మనిషిలోనూ ఓ సంద్రం దాగి ఉంటుంది కదూ ఎందఱో వస్తారు జీవితం లోకి కానీ అందరికీ కనిపించని లోతులెన్నో ఉంటాయి.....అవి చాలా కొద్దిమందికి మాత్రమే అందేవి..." సాలోచనగా అన్నాడు
"మనలో ఉన్న లోతులు మనకే తెలియనివెన్నో ఉంటాయి బాలూ....అసలు జీవితం లో అదే నేమో ఆ మేస్మెరిసం..
మాజిక్ అఫ్ లైఫ్" అతని చెంపకి తన చెంప రాస్తూ అంది
"నీకో మాట చెప్పనా " ఆమె కళ్ళు వెన్నెల్లో మెరిసాయి 
"ఇంతవరకు ఎవరినైనా కవిత్వమో రచనో చదివాకా మనిషిని చూసేను...కానీ నిన్ను ప్రేమించాక అన్నీ ఇచ్చేసాక ఇప్పుడు నీ కవిత్వం గురించి తెలుసుకున్నాను.....అసలు తమరు కవులని నాకెందుకు చెప్పలేదు?"
"ఏముంది చెప్పడానికి...అదేమన్న గొప్ప విషయమా?" 
"మరి కాదా?"
"అంటే నేను కవిని అని తెలవకముందే ప్రేమించావుగా  ఇప్పుడు చెప్తే ఇంకా మరికొంచం ఎక్కువ ప్రేమిస్తావా అలా అయితే సరే , నా కవిత్వం వినిపించనా?"
"ష్ ! వద్దు ! చెప్పద్దు ఇది ఒక తీయని అనుభూతి నిన్ను నాలో పూర్తిగా ఐక్యం చేసుకున్నాక నీలో నన్ను లీనం చేసుకున్నాక మాటలతో ఎంత పేర్చినా చెప్పదలుచు కున్నదేదో ఇంకా మిగిలే ఉండి  పోయినట్టున్నా.. ఆ కవిత్వమెందుకు....?"
"నిలువెత్తు కవిత్వాన్ని జీవించాక.... తరి  తీపి రసానుభూతి పొందాకా ఇక మాటలేమి చెప్తాయి....?"
"సముద్రాన్ని చూడనంత వరకూ దాని గురించిన  వర్ణన చదవడానికి వినడానికి బాగుంటుంది... కానీ అచ్చ్చంగా సంద్రాన్నీ దాని అందాన్నీ చూసాక అనుభుతిన్చాలే తప్ప అక్షరాలలో ఇమిడించడం కష్టం బాలూ...." ఆమె కంఠంలోని పరవసత్వంతో  కూడిన జీర ....
"ఉన్మత్త ప్రేలాపనలంటే నాకెంతో ఇష్టం ..." నవ్వాడు
"అవి  హృదయపు లోతులను చీల్చుకు వచ్చే స్వచ్చ్చమైన పలుకులు కనుక , నాకూ అంతే ...అందుకేనేమో ఇలా జతైనాము " నిర్మలంగా నవ్వింది 
"అటు చూడు ఇంతింతై అన్నట్టు గాక అంతంతై ఉదయించిన నిండు చందమామ ఇప్పుడు చూడు నీ బొట్టు లా చిన్ని వెన్నెల బంతి లా నీలాకాశం నుదుట ఎలా ముద్దుగా అమరి  పోయిందో..." ఆమె నుదుటి పై చిన్నగా ముద్దు పెట్టాడు 
"సముద్రం నాకు ఎంత కొత్తదో అంత పాతది....మా వూరికి సముద్రం దగ్గరే...." అన్నాడు
"అయినా విశాఖ సముద్రం కాదుగా ...." చిలిపి నవ్వు
"ఆ నిజమేలే అయినా విశాఖ  సముద్రం లో ఏంటో అంత గొప్పతనం....నాకేమీ కనబడలేదే...."అల్లరిగా
"అవునా  మరెందు కోచ్చారో  ఇంత దూరం....అవును లెండి అయినా మీకు పని ఉంది వచ్చారు అంతేగా ?"
"ఆ అవును పని ఉండే వచ్చాను సముద్రమున్న ఈ విశాఖలో ఒక  పిచ్చి ప్రేమికురాలుందనీ...."
"మరే  మెంటల్ ఆసుపత్రి కూడా మేమే కట్టుకున్నాము అందుకే ....." పకపక నవ్వింది
"ఆ పిచ్చి ప్రేమికురాలి  బుగ్గ సొట్టలో ఒక్కసారి దూకి ఆత్మ హత్య చేసుకుందామని వచ్చా..." అతని స్వరంలోని మార్దవం
" దాన్నీ ఆత్మ హత్య అనరు రసానుభూతి అంటారు ....సంజ్హే....అయినా నువ్వు చెప్పిందీ నిజమే ఆత్మల్ని హత్య చేయనిదే రససిద్ధి పొందలేము...మై భీ సంజ్హే "
"ఝే ఝే ....హహహ్హ" హాయిగా పండువెన్నెల్లో ఆదమరచి అతను నవ్వుతుంటే విప్పార్చుకుని కళ్ళు సముద్రమంత లోతైన అతన్ని చూస్తూ చిరునవ్వుతూ  వెన్నెల  తరగలా ఆమె....
గుంభనంగా నవ్వుతోన్న సముద్రం, అతను ....ఆమె(నేను).......


అక్షరీకరించలేని అద్వితీయ అనుభూతిని రాద్దామని  చేసిన వెర్రి ప్రయత్నమిది అని నాలో నేనే నవ్వుకుంటూ....ప్రేమతో  ...జగతి ....8.20pm Saturday..01-10-2011








8 comments:

  1. ఒకరికొకరం రిలేట్ అవ్వగలిగినప్పుడు ఈ పరిచయాలు తెలుసుకోవడాలూ అన్నీ అక్కర్లేదు...."

    "ప్రతి మనిషిలోనూ ఓ సంద్రం దాగి ఉంటుంది కదూ ఎందఱో వస్తారు జీవితం లోకి కానీ అందరికీ కనిపించని లోతులెన్నో ఉంటాయి.....అవి చాలా కొద్దిమందికి మాత్రమే అందేవి..."

    "అటు చూడు ఇంతింతై అన్నట్టు గాక అంతంతై ఉదయించిన నిండు చందమామ ఇప్పుడు చూడు నీ బొట్టు లా చిన్ని వెన్నెల బంతి లా నీలాకాశం నుదుట ఎలా ముద్దుగా అమరి పోయిందో..."

    చాలా నచ్చాయి ఇవి.

    ReplyDelete
  2. మనసులో పొంగుతున్న భావాలకు అక్షరరూపం ఇవ్వటం చాలా కొద్దిమందికే సాధ్యం. నాలాంటి వాదికి దుస్సాధ్యం :(. మీరు వ్రాసిన ఈ చిన్న కథ అనండి, సంఘటన అనండి, అనుభూతి అనండి, ఇంకేమైన అనండి, మీ మనసులోని ఆలోచనలకు అద్దంపడుతోంది. మీలోని ప్రతిభకు తార్కాణం. చక్కని భావ ప్రకటన. ఇంకా వ్రాస్తూనే ఉండండి.

    ReplyDelete
  3. thank u so much sailamma for ur compliment.....and DS i am honored that u have read my scribblings....love j

    ReplyDelete
  4. ఉన్మత్త ప్రేలాపనలంటే నాకెంతో ఇష్టం ..." నవ్వాడు
    "అవి హృదయపు లోతులను చీల్చుకు వచ్చే స్వచ్చ్చమైన పలుకులు కనుక , నాకూ అంతే ...అందుకేనేమో ఇలా జతైనాము " నిర్మలంగా నవ్వింది
    పై వాక్యాలు నాకు చాలా నచ్చాయి...ప్రేమలో ఎందుకు కలిసామో కారణం అన్వేషించాలనే తపన ఉంటుంది...ప్రతీ భావం ఇందుకేనేమో అని అనిపిస్తుంది...కొద్ది రోజులతరువాత కారణాలు అనవసరం... కలిసాం...హాయిగా ఉన్నాం అదే ముఖ్యం ..తన పేరు నా పెదవిని చంద్రవంకను చేస్తుంది...నా తలపు తనను పులకరింప చేస్తుంది ఇంతకన్నా ఏమి కావాలి ప్రేమ అనేభావన కు ...ప్రేమను ప్రేమించటం అందులో జీవించటం తప్ప తర్కతర్కాలు ఎందుకు అనే ఒక స్థిర చిత్తం వచ్చేస్తుంది...
    కొన్ని చదివితే అది నా భావనే అనిపిస్తుంది చదువరికి అంత హత్తుకునేలా ఆత్మీయంగా రాయగలగడం ఒక వరం...

    --

    ReplyDelete
  5. nee manasuki nachadam naa adrushtam....poornee...love j

    ReplyDelete
  6. జగతి గారూ,
    సముద్రతీరాన చంద్రోదయం....అశ్వాదిస్తూ ఆ ఇద్దరూ...ఒక గొప్ప దృశ్య కావ్య౦. కాసేపు ఆ తీరం వెంబడి నడిపించారు..

    ReplyDelete
  7. నీ బొట్టులా చిన్ని వెన్నెల బంతి లా నీలాకాశం నుదుట ఎ లా అ మరిందో ..చాలా బాగున్నాయి..నిలిపిన మబ్బుల్లో మెరుపు తీగల్లా కొన్ని వాక్యాలు మెరుపు లీనాయి

    ReplyDelete
  8. నీ బొట్టులా చిన్ని వెన్నెల బంతి లా నీలాకాశం నుదుట ఎ లా అ మరిందో ..చాలా బాగున్నాయి..నిలిపిన మబ్బుల్లో మెరుపు తీగల్లా కొన్ని వాక్యాలు మెరుపు లీనాయి

    ReplyDelete