Thursday, May 5, 2011

శేష్ లేఖ (టాగోర్ ఆఖరి కవితలు నుండి)

జీవితం పవిత్రమైనది  నాకు తెలుసు
                                                 
కాని తన అసలు రూపం నేనెప్పుడూ గ్రహించలేక పోయాను
మార్మిక భూజలనుండి ఎగచిమ్ముతుందినేను కనలేని దారిలో                                
ప్రవహిస్తుంది
ప్రతి ఉషోదయంనుండీ
ఒక నూతన పవిత్రతతను సంతరించుకుంటుంది:
కొన్ని వేళ్ళ మైళ్ళ కావల
ఈ వెలుగుతో నేనీ బంగారు  గిన్నెను నింపుకుంటాను 
పగటికి రేయికీ గొంతునిచ్చిందీ జీవనం
అగోచారమైనదాన్ని అడవి పువ్వులతో పూజించి
నిశ్శబ్ద సాయం సంధ్యలో 
మట్టి దీపాలు వెలిగించింది.
నా హృదయమర్పించింది తనకి
నా జీవన తొలి ప్రేమని.
అన్ని సాధారణ మైన ప్రేమలూ
తన బంగారు దండం తాకి
ఈ నాడు మేల్కొని ఉన్నాయి
ఆమె కై నా ప్రేమ,
ఈ పూల కోసం,
ఇవన్నీ తనవే
తన స్పర్సతో.
జన్మించిన వేళ పుస్తకం ఖాళీ కాగితాలతోనే  కొనబడుతుంది
ఒక్కో రోజూ గడిచే కొద్దీ నెమ్మదిగా అక్షరాలు నింపుకుంటుంది,
తనకై తాను కూర్చుకున్న పూసల్లా ఒకటొకటిగా
రోజు ఆఖరికి చిత్రం ఆవిష్కృతమౌతుంది
చిత్రకారుడు తనని తాను గుర్తుపడతాడు
తన స్వంత సంతకం చూసి
పదాలన్నిటినీ పరికించి 
రూపాలపై జాలి రహితంగా 
ఓ నల్ల గీతతో కొట్టివేస్తాడు
ఏవో కొన్ని బంగారు పదాలు మాత్రమే ప్రత్యేకంగా మిగులుతాయి
అవి వేగు చుక్క పక్కన తళుక్కుమంటూ  వెలుగు తాయి.

రవీంద్రనాథ్ టాగోర్ ఆఖరి కవితలు "శేష లేఖ" నుండి ....శాంతినికేతన్లో ఏప్రిల్ 25..1941  లో రాయబడినది 
టాగోర్ 150  వ జయంతి మే 7 , 2011 
ఆ సందర్భంగా టాగోర్ కి  స్మృత్యంజలి ఘటిస్తూ ....ప్రేమతో...జగతి 






2 comments:

  1. This is a continuous search and an ever ending search. If someone says he undertood what it is, it would be a sort of situational compromise or some kind of ignorant statement.

    Dhatri, This is a great verse from your pen, though a translation...

    ReplyDelete
  2. హృదయాంజలి అర్పిస్తున్నా......

    ReplyDelete