Wednesday, October 9, 2013

అపరిచిత చెలిమి



ఉండుండీ ఎందుకో హఠాత్తుగా
మనసు  మూగ బోతుంది
నీ మనసును అర్ధం చేసుకోవడం లో
మునిగిపోతుంది ...
నా అంచనాలకు దొరక్కుండా
ఒక అద్భుత హఠాత్ పరిణామం లా
ఆవిష్కరింపబడాలని నీ ఆలోచన
అందుకే మన మధ్య
ఉల్లి పొర లాంటి  యవనిక వేస్తావు
చిరునవ్వుతోనో , లేక చిరు కోపం తోనో ...
అప్పుడే నీ హృదయ భావం అంది
నేను భావోద్విగ్నతతో కదిలి పోతాను
అబద్ధమాడకుండా , నిజం చెప్పకుండా నీవు
నిజం అర్ధమైన అయోమయం లో నేను
ఎక్కడో చెలిమి శిఖరాగ్రం వద్ద
ఇద్దరు అపరిచితుల్లా కలుసుకుంటాము
దాచలేని మమతతో నేను
మమత దాచే యత్నం లో నీవు
ఎప్పుడూ ఇలా ,విడి, కలిసి , విడి ,కలిసిపోతుంటాం
విడి విడిగా ఏకమై
ఏకం లో మమేకమై ఎప్పటికీ ....!!!
.............................................................జగద్ధాత్రి 09/10/2013 1.11పి.ఏం బుధవారం



6 comments:

  1. ఎప్పుడూ ఇలా ,విడి, కలిసి , విడి ,కలిసిపోతుంటాం
    విడి విడిగా ఏకమై
    ఏకం లో మమేకమై .. nice n touchy poem jagathi.. kudos ..

    ReplyDelete
  2. నిజంగా నిజం .. చాలా బావుంది జగతి గారూ

    ReplyDelete
  3. Leka pothe Keratalu elaga vasthayi?

    ReplyDelete
  4. Touching one.vidi vidiga yekamai yekamlo mamekamai yeppatiki.
    Keratalu yela vasthayi!!!. How meaningful it is !!!.

    ReplyDelete