Saturday, November 19, 2011

ఫోన్ కాల్

మెత్తగా రాలిన
పొగడపూల పరిమళం లా
సున్నితత్వానికి ప్రతీకల
నిశ్సబ్దంగా రాలే  పారిజాతాల్లా
తెలవారు ఝామున
కార్తీక మాసం లో ని పున్నాగ పూలలా
కొన్ని మంచి తియ్యని
మాటలు .....
ఒక అందమైన వాక్యం
ఓ అర్ద్రమైన కవిత 
ఎంత లాలిస్తుందీ హృదిని
మాటలు తేనెల మూటలంటే
ఇదేనేమో....
మాటాడిన వాటికంటే
మాటాడని మాటలే
ఎంతో విలువైనవి కదూ
ప్రియతమా  ......
కలిసి న ప్రతిసారీ
ఒకరిలోకొకరు
ఒలికి పోవాలని
ఊసు లెన్నో చెప్పేసుకోవాలని
ఎన్ని సార్లో....
ఎంతగా అనుకుంటామో
కంప్యూటర్ యంత్రం పై
మౌనంగా వేళ్ళు
అక్షరాలను మీటి నపుడు
ఎంతగా తెలిసి పోతామో
ఒకరికొకరం
కానీ ఒక్కసారి నీ గొంతు వినగానే
నేను....
నా గొంతు వినగానే నీవు
స్తబ్దులమై..
నిశ్శబ్దాలమై
కాలం నిముషాలు గా కదిలి పోతున్నా
ఎందుకో ఏ మాటా
మాటాడుకోలేక
మౌనించిన హృదయాలతో
మాటలు కరువై
నిట్టూర్పుల  నిస్తేజమై
మిగిలి పోతాము
ఎన్నో చెప్పాలనుకుని
పేలవంగా రెండు
మాటలు మాటాడుకుని
ఏమీ కానీ వారిలా
అటు నువ్వు ఇటు నేను
ఉంటాను అంటూ
పెట్టేస్తాము ఫోన్
ఒకరి వేదన మరొకరు
దీపం కింద చీకటి లా
మనల్ని మనం దాచేసుకుని
నేనేం  చెప్తే తను ఏం  బాధ పడుతుందో నని నువ్వు
నేనేం చెప్పేసి  తనని కష్ట పెట్టేస్తానో అని నేను
ఇద్దరం అరకొర నవ్వుల 
అర్ధం లేని మాటలతో
కాల్ గా  మనకి అందిన  కాలాన్ని
కావాలనే కట్ చేసేస్తాము
ఇదంతా ఏంటో ఎందుకో
మనిద్దరికీ తెలుసు
ఒకరికొకరం ఆనందంగా
అగుపడాలనే తాపత్రయం
తప్ప ఎన్నని మాటలతో
చెప్పగలం చెప్పు
ఏ నెట్వర్క్  అయినా
మన మనసుల్ని అందుకోగలదా
మన మనసుల్లోని మాటలెలా
చెప్తామో నని ఎదురు చూసి చూసి
సెల్ ఫోన్ విసిగి వేసారి పోతుంది
దానికేమి తెలుసు
గతి తప్పిన  మన మనసు గతి....
....................................................ప్రేమతో ...జగతి 12.38am 19-11-2011 saturday (friday night)


(ఈ రోజు మనసు కదిలించిన ఆర్ద్రతతో నింపిన కవి యాకుబ్ సార్ గారి కవిత "మాటలాడని మాటలు " చదివాక)













3 comments:

  1. మాటల్లోనుంచి రాలిపడే పొగడ పూలు , కార్తిక మాస పున్నాగ పూలు ...
    చాలా బావుంది మా

    ReplyDelete
  2. మాటాడిన వాటికంటే మాటాడని మాటలే ఎంతో విలువైనవి కదూ......అర్ధం చేస్కునే మనసు ఉండాలే కాని మౌనంలో కూడా ఎన్నో అర్ధాలుంటాయి.......చాలా బాగుందమ్మా

    ReplyDelete
  3. tq jagati garu...poem chaala baaga constuct chesaaru...kudos.!

    ReplyDelete