Monday, September 19, 2011

మనసు బాగోలేదు.....






ఈ రోజెందుకో ఉదయం లేచిన దగ్గరినుండి ఏంటో మనసు బాగోలేదు 
చేదు తిన్నట్టు వికారంగా ఉంది 
అస్తమానం అలా అనుకోకూడదని అనుకున్న ......నిజానికి ఎందుకో మనసు బాలేదు
పాకెట్ లోంచి ఓ సిగరెట్ తీసి వెలిగించి..గుండెనిండా గట్టిగా పీల్చా---
ఉహు కుదుట పడలేదేమీ ...
ఫ్రెండ్ దగ్గరకేల్దామని  బయల్దేరా......ఎప్పుడూ నవ్వు ముఖం తో ఉండి ఎలాంటి పరిస్థితిలోనైనా
ఎవర్నైనా నవ్విస్తాడు ఆనంద్.... తలుపు  తీసి  నన్ను చూడగానే  "రా రా , ఇంకా నేనే నీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నా " అన్నాడు కళ తప్పిన మొహం తో ...
"ఎన్టీ సంగతీ?" అన్నా కూర్చుంటూ 
"ఏంటోరా ఈ రోజెందుకో మనసేమీ బాగాలేదు " అన్నాడు.
కాసేపు ఇద్దరం మనసు మనసులోలేని పిచ్చా పాటీ ఆడుకునీ తిరిగి మళ్ళీ ఇంటికి బయల్దేరా....వాడూ కారణమంటూ ఏమీ  చెప్పలేదు ...నాకై నేను అడిగేంత మరీ చనువు తీసుకోలేకపోయాను...
టీవీ సీరియల్స్ తోనో మ్యూసిక్ సిస్టం తోనో గోలగా  ఉండాల్సిన ఇల్లు చాలా నిశ్సబ్దంగా ఉంది ఇల్లంతా...
ఒక్క క్షణం పాటల  హోరు లేకుండా ఉండని  పాప ఎందుకో సోఫాలో  పడుకుంది....
"ఎరా తల్లి? అలా ఉన్నవేమి ?" అంటూ పక్కనే కుర్చుని పలకరించాను ..."అబ్బా నన్నొదిలెయ్ నాన్నా ఈ రోజెందుకో 
నా   మనసేమీ బాగాలేదు..." అంటూ అటు తిరిగి పడుకుంది....అంటే ఇక ఏమీ చెప్పదన్నమాట .....
సర్లే అనుకుని బట్టలు మార్చుకుని లుంగీ కట్టుకుని ....డైనింగ్  టేబుల్ దగ్గర కూర్చున్నా ....ఓ ముద్ద తిందామని 
ఉహూ .... మింగుడు పడలేదు ...
గుండెంత బరువుగా ఉన్నట్టు అనిపించింది....
"ప్లీజ్ ఇవాల్టి కేమీ  అనకండీ ఏదో వంట బాగా కుదరలేదు ఏంటో మనసు బాలేదు " సంజాయిషీ ఇచ్చింది నా శ్రీమతి..
ఒక్కసారిగా ఫక్కుమని నవ్వాను...
క్షమాపనలుచేప్తే ఎందుకలా నవ్వేనో అర్ధం కాకా నా కళత్రం  కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి ....
"పోన్లే రా పర్వాలేదు డా బజ్జుందాం..." అని తను కలిపిచ్చిన మజ్జిగ తాగి తను కూడా తాగేక బెడ్ రూమ్లోకి దరి తీసా...
పక్కనే వచ్చి  చేరబడిన ఆమెను   ముద్దుగా  దగ్గరకి  తీసుకోబోయాను ....
"ప్లీస్  ఇవాల్టికి  వదిలెయ్యండి  ....ఎందుకో మనసు బాలేదు " అంది ...అటు తిరిగి పోతూ ...
ఉహూ  ఇక లాభం  లేదనుకుని  "నీ మనసు బాగు  చేస్తాను  రా ఇలా " అంటూ బలంగా  దగ్గరికి లాక్కున్నా ....గువ్వలా ఒదిగి   పోయింది గుండెల్లో ....అప్పుడు వినిపిస్తోంది పాప గదిలోంచి  అర్ధం కాని పాటల    హోరు ........ఆమెను హృదయానికి  హత్తుకున్నా   .. ....తనూ కొంచం  సేద  తీరినట్టనిపించింది ...చిరునవ్వింది  .......ఒకో  రోజు అంతేనేమో  కారణమేమీ  లేకుండానే  ......ఇలా ఈ పెంకి   మనసు అల్లరి  చేస్తుంది ...బహుశా...ఇదంతా ఈ రొటీను జీవితాల వల్లనేమో... ఏమో ఏమిటిలే అదే....అల్లుకుపోయిన  అర్ధాంగిని  ఆత్మీయంగా  జోకోట్టాను...



...................................ప్రేమతో జగతి 6.25am 19-01-2004 monday in train 
(ఎలమంచిలి కాలేజిలో పనిచేసేటప్పుడు ఉదయాన్నే సింహాద్రి లో ప్రయాణిస్తూ రాసుకున్నది...ఉదయాన్నే మూడింటికి లేచి పనులన్నీ చేసి వంట చేసి నేను కట్టుకుని బయల్దేరి స్టేషన్ కి వెళ్లి ఆరింటికి బండెక్కి వెళ్తోంటే హాయిగా వెచ్చగా బజ్జున్నవాళ్ళను తలచుకుంటూ రాసుకున్న సరదాగా)





4 comments:

  1. సూపర్ అక్కా. ఈ ప్రపంచం లో ఎవరికి ఎవరు చివరికి ఎవరు. భార్యాభర్తలే ఒకరికి ఒకరు. :)

    ReplyDelete
  2. thanks kanee aa iddaru bharya bharthalu anukonakkaraledu sthree purushulu...naa uddesam lo....patralu kanuka kalatram anna anthe....love j

    ReplyDelete
  3. హ్మ్...హ్మ్..ఏంచెప్పను? మనసులోకి తొంగిచూసిమరీ రాసినట్టుంది.రొటీన్ జీవితాల్లోని కల్లోలం నుంచి అప్పుడప్పుడు ఇలా పక్కకు జారి మాటవినని మనసు గొడవ ఇదంతా....మనిషన్న ప్రతివాడికి ఈ అనుభవం ఎప్పుడూ ఎదురయ్యెదె...అభినందనలు

    ReplyDelete
  4. నిజం అమ్మ ఒక్కోసారి ఏది కారణం లేకుండానే మనసు బావుండదు.
    ఎందుకు అని అడిగితె చెప్పలేము.
    మనసులో భావాలు మీకన్నా ఎవరు బాగా రాయగలరు?

    ReplyDelete