తప్పించుకు పారిపోదామా
అందరికీ దూరంగా మనిద్దరమే
జేబునిండా మరమరాలు దొంగిలించి
పరిగెత్తే పసి గువ్వల్లాగా
చెలిమి గాలిపటాలు ఎగరేసుకుందికి
కాలం కందెన అద్దు కుని
చల్లగా జారుకుందామా కొద్ది సేపు
ఏ కంటికీ కన పడకుండా
జ్ఞాపకాల తీయని తేట నీటి
జలకాలాడి వద్దామా కాసేపే
మళ్ళీ వచ్చేద్దాం ఈ నిత్య రొంపి లోకి
తప్పదుగా ...ఎప్పటికైనా
ఒక్కసారి ఆ పాత మధురాలను
తవి తీరా పాడుకుని
హాయిగా గలగలా సెలయేరులా
గుండె నిండుగా నవ్వేసుకుని
మళ్ళీ వచ్చేద్దాం తిరిగి ....తప్పదుకదా
ఏడాదికొక్క మారైనా ఊపిరితిత్తులకి
స్నేహ ప్రాణ వాయువువు నివ్వక పోతే
ఊపిరాడక చచ్చి పోతాము
గుప్పెడంత గుండెలకు
చప్పనైన నాలుకకి
ఆత్మీయ అటుకులు బెల్లం రుచి చూపిద్దాం
అందుకే ఎవడో పెట్టాడని
అన్నాడని కాదు గానీ
ఈ పేరున ఒక్క రోజైనా
మనం మన కోసం గడుపుకుంటే
వచ్చే ఆనందం మళ్ళీ ఏడాది వరకు
మనల్ని బతికిస్తుంది కదా
కాదంటావా నేస్తం !!!
...........ప్రేమతో ...జగతి 11.20am 5th Aug sunday

చక్కగాచెప్పారు, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
ReplyDeletechaala baagunnaayi / oka aarthi vyaktamavutondi.. pada gumbhana adbhutam.. sankalanam cheya vachu kadhaaa
ReplyDelete