Tuesday, September 25, 2018


చెలిమి చెలమలు గౌనా గజళ్ళు

కథ , కవిత , పాట, బొమ్మ , నటన , అన్నిటికి మించి మా మంచి మాస్టారు , ఒక సంపూర్ణ అక్షరాల బాటసారి మా గంటేడ గౌరునాయుడు. మా  అంటే మా ప్రాంతానికి అని నా ఉద్దేశం కాదు, మనందరి వాడు అని.  తెలుగు సాహిత్యం లోని తొలి తెలుగు కథ గురజాడ వారి దిద్దుబాటును, కమలిగా  రచయిత మల్లిపురం జగదీష్ కథ అక్షరాల దారిలో.. ను సన్నాయి పేరిట యువ దర్శకులు అట్టాడ సృజన్ దర్శకత్వం లో లాంగుల్య క్రియేషన్స్ పేరిట నిర్మించినది గౌరునాయుడే .  అక్షరకారుడు ఎప్పుడూ ఒక ప్రాంతానికో, భాషకో, పరిమితం కాదు. గౌరునాయుడు ప్రవహించే సాహితీనది. తాను సాగిపోతూ తనతో బాటు యువ సాహితీ వేత్తలను, కళాకారులనే పిల్ల కాలువలను కూడా తనతోనే కలుపుకుంటూ సాగే జ్ఞాన నది. అతని పాటలు పాడని యువకులు ఈ ఉత్తరాంధ్రలో ఉండరు అన్నది అతిశయోక్తి కాదు. తెలుగు గజల్ ఇటీవల బాగా ప్రాచుర్యం పొందుతున్న ప్రక్రియ. కీ.శే. డాక్టర్ సినారె , డాక్టర్ అద్దేపల్లి వంటి పెద్దలు ఎక్కువగా ప్రాచుర్యం లోకి తీసుకొచ్చిన వారు. ఇప్పుడీ పాట బాటలోనికి అడుగు పెట్టాడు గౌరునాయుడు. జీవితానుభవాల చల్లను చిలికి భావాల వెన్నను తీసిన మా గంటేడ బావు ఆ భావానుభూతులకి గజల్ రూపం కట్టించి అందంగా అందించాడు.  పార్వతీపురం స్నేహ సాహితి తన ఇరవయ్యవ ప్రచురణగా తీసుకొచ్చిన ఈ పాటల పేటిక “మనసు పలికే..” 70 గజళ్లుగా మన గుండె సందిళ్ళ ఒదిగి మన మనసులను అలరిస్తోంది. డాక్టర్ మంచిపల్లి శ్రీరాములు (అధ్యక్షులు , సాహితీలహరి), జి. రామకృష్ణ (శాంతి), కార్యదర్శి, స్నేహకళాసాహితి మంచి మాటలతో సౌహార్ద్రం తో వెలువడిన మంచు ముత్యాల పల్లకి ఇది.
“ నా అక్షరాలు కష్ట జీవుల కలల నేస్తాలు. శ్రమజీవులకోసం సాచే  స్నేహ హస్తాలు. ప్రేమగా పలకరిస్తాయి. బాధల్ని పంచుకుంటాయి . భుజం తట్టి ప్రోత్సహిస్తాయి.” అంటాడు గౌరునాయుడు తన ముందు మాటలో. సామాజిక బాధ్యత  అందరికీ ఉందనీ అది గుర్తెరిగి మసలుకోవాల్సిన  అవసరం ప్రతి ఒక్కరికీ  ఉందని ఆ స్పృహ కలిగించడం లో , సమాజానికి మేల్కొలుపులు తన పాటలని చెప్తాడు గౌరునాయుడు. పాలకుల అసమర్ధతని సమాజం ముందు నిలబెట్టినప్పుడు తన కథలు, భావోద్విగ్నపు సరస్సులో ఊపిరందనంత ఉక్కిరిబిక్కిరి అయినప్పుడు తన కవితలు ఆవిర్భవించాయంటాడీ కవి.
ఇప్పుడీ గజళ్ళు... గజల్ ఉర్దూ భాషా ప్రక్రియ. గజల్ అంటే ప్రియురాలితో సంభాషణ అని అర్ధం . కానీ ఫైజ్ అహ్మద్ ఫైజ్ నుండి ఈ గజల్ లో సామాజిక స్పృహను, చింతనను మేళవించారు. అలాంటి ఈ సున్నితమైన గాన ప్రక్రియలో తన భావుకతను,జీవన తాత్వికతను, సామాజిక హిత వచనాలను రంగరించి గుమ్మరించాడు గౌనా.
“మై ఔర్ మేరీ తన్హాయీ, అక్సర్ యే బాతే  కార్తీ హై..”(నేను నా ఏకాంతం చాలాసార్లు మాట్లాడుకుంటాము)అంటూ ఒక కవిత సిల్ సిలా సినిమా లో అమితాబ్ స్వరం లో పలికిస్తాడు ఒక హిందీ కవి. అలాగే నేడు మన గౌనా తన గజల్ గురించి ఇలా అంటున్నాడు “నా వరకు నాకు గజల్ ఒక ఊరట. నా ఒంటరి క్షణాలలో నాతో నేను , నాలో నేను సంభాషించుకునేందుకు ఇదొక ఉపకరణం. ప్రశ్నించి , ప్రార్ధించి, ఘర్షించి, శాసించి,నా లోపలి మనిషితో నా సంవేదనల్ని పంచుకోవడానికి ఇదొక ప్రత్యామ్నాయం” ప్రియురాలితో సంభాషణ అన్న గజల్ ని నేడు మన గౌరునాయుడు ఆత్మ సంభాషణ గా నిర్వచిస్తున్నాడు. గజల్ లోని తాత్విక అంశ ఇదే. ఆత్మ యే ప్రేయసి. అలా అంతరంగ సంభాషణే ఈ తీయని గజళ్ళు. లేలేత తాటిముంజెల్లా మన మనసును ఊరించే ఈ గౌనా గజళ్ళు, మమతల పూలు పూయిస్తాయి , ఆవేదానాశ్రువులను  చిలికిస్తాయి, ఆలోచనల జడిని కురిపిస్తాయి. ఆకలి నుండి, అడవి నుండి ,అమ్మనుండి నేర్చుకున్న పాఠాలను ఎంత సున్నితంగా చెప్పాడో చూడండి :
“ఆకలెరిగి పెట్టమని అమ్మ నాకు చెప్పింది /అడగకనే ఇవ్వమనీ అడవి నాకు చెప్పింది /అవమానం కాదు సుమా వొంగి వుండడం/విల్లుగా వొంగమనీ వెదురు నాకు చెప్పింది/... కష్టాల కొలిమి లోన కాలకుంటే ఓ గౌనా /కాలానికి నిలవవని కవిత నాకు చెప్పింది”
“అక్షరాలు  తప్ప ఆత్మ బంధువులేరీ గౌనా/కొనసాగిస్తాను నా ముందరున్న విధులు” అంటాడు ఆర్ద్రంగా ప్రవహిస్తున్నవి నాలో ఎన్నో నదులు గజల్ లో. గౌనా గజళ్లలో తాత్వికతే కాదు సమాజానికి సవాళ్ళు కూడా ఉన్నాయి. మనుషులలోని మూఢత్వానికి వేసే చురకత్తులలాంటి చురకలున్నాయి. “బాబా బూడిద తీస్తే దాన్ని మహిమని అంటారు/గారడీ వాడు చేస్తే అది మేజిక్కని అంటారు /బూడిద ఎందుకు మహిమే వుంటే బువ్వ తియ్యరాదా/అపుడే స్వామీ తేలుతుందని ఆ లెక్కని అంటారు”…. అంటూ చివరికి “పచ్చ నోట్లతో స్వామీజీలకు పాదపూజలేలంటే/జవాబు చెప్పక గౌనామాటలు చెడని అంటారు.” అంటూ ముగిస్తారు.
గౌనా గజళ్లలో ఆవేదన, ఆత్మ శోధన తో కూడిన అంతర్యానం ఉంది.
మృదుమధురమైన ప్రేమానుకంపనలున్నాయి. గెలుపువైపు నడిపించే స్ఫూర్తి ఉంది.
“నిదురించు మృదువీణ శృతి చేయవోయి/కదిలించి మదికింత ధృతినీయవోయి/అనురాగ బంధాలు తెగిపోక ముందే/సవరించి హృదయాలు ముడివేయవోయి/నడివేసవే డస్సి నిను చేరుకుంటే/చిరుజల్లువై గొంతు  తడిపేయవోయి/ పొరపాటులే లేని చేరాత ఉందా?/చిరిపేసి సరికొత్త ప్రతి రాయవోయి/వలపంటే హృదయాల లో వెలుగు గౌనా/ఉదయాలకే ఊపిరులు పోయవోయి”
ఇలా అనురాగం, ఆక్రోశం, సామాజిక హితం అన్నీ ఎర్చీకూర్చిన తేనెగిన్నె ఈ మనసు పలికే గజళ్ళ పుస్తకం.
విలక్షణమైన సైజులో అందంగా ముద్రింపబడిన ఈ పుస్తకం ముందు మన దృష్టినీ, హృదినీ దోచేస్తుంది.
“మనుషుల నడుమ ఏల ఇనుపగోడలు/మనసుల లోలోన ఏల నీలినీడలు/ఆకలి అందరిదొకటే అది తీరే దారొకటే/చెరపవేల మూఢత్వపు అడుగుజాడలు” అని , సర్వ మానవ సమానత్వ తత్వాన్ని ప్రబోధించే భావనలెన్నో ఈ గజళ్ల నిండుగా ఉన్నాయి. అక్షరాల ఆత్మీయత బువ్వనే అందరికీ పంచి ఇస్తూ, యువకుల్లో ఆవేశాన్ని మేల్కొలుపుతూ, పిల్లలికి చదువునిస్తూ చదివిస్తూ ఎందరినో సమాజ యుద్ధ వాటిక లోనికి పంపడానికి  ధర్మ యుద్ధ వీరులుగా తీర్చి దిద్దుతూ జీవితానికి పరమార్ధం జ్ఞాన సంపదని పంచడం అని ఆచరణ లో చూపిస్తున్న  ఈ ఆచార్యునికి సాహిత్య లోకం  వందనాలు. పార్వతీపురం కొండాకోనల్లో బతుకు పాటలు పాడుతూ , సాహిత్య పోడు వ్యవసాయం సాగిస్తూ సాగిపోతున్న ఈ కొండ దొరకి  సాహితీ జగతి దండాలు.
....................................................................జగతి , 6281434862  


Little hearts and a feisty Teacher

Self determined learning is the phrase Dr.Stewart Hase uses to define heutagogy. He is the founder of ‘heutagogy’. The students are the self teachers and the class room teacher is only a facilitator and guide in this process of learning. September 26th  is celebrated as “World’s Heutogogy Day”. Chris Kenyon and Dr. Stewart Hase  found out this method as they were working on another project of learning . The objective of this method of learning is that it will make a student a complete human. Once this method of learning is implemented in the elementary level the pupil will start his process of life long journey of learning. The method of learning is determined in the child’s life.  He will learn everything in his life with this method. Dr. Stewart Hase and Chris Kenyon, brought out this concept in 2000.  Further developing it Dr. Stewart Hase has done much more work and now this method stands workable and had yielded good results.
Now we will talk about a self determined teacher Ms Vijayabhanu Kote who is working in a government school in Payakaraopeta , who has adopted this method in her class. As an academician and also an individual with social responsibility she contributes different articles to the Government journals Yojana, and also writes Biology lessons for Tenth class students in Eenadu and English lessons to KASTURI magazine (by the Govt of AP). Besides this she is also a creative writer and poet in English and Telugu. She wrote stories in Telugu which are published in reputed magazines like Prasthaanam and Swathi weekly.
  First she experimented with heutagogy with the fifth class children and now she is doing it confidently with first class students too.
Little brains are all different in their own way. There is also emotion involved in learning. Learning is both subjective and objective. Learning is defined as the change that is brought out in a mind with some experience. So heutagogy is such a method which makes the child to use his brain and interact. This method also helps the child to evaluate his own learning.
She has designed modules of Heutagogy.  As a teacher in the Government school it is really an adventurous decision for Ms.Bhanu Kote , but as she is a self determined teacher , she has successfully implemented in her class to students of fifth class. In a small town Payakaraopeta , the students are from very poor and disturbed  families. To put them all to such learning process is a herculean task. And this teacher had taken the total responsibility on her shoulders and done it. Her colleagues and the education board all are surprised for the results she brought out. All the process of learning of her students’ day to day learning is recorded by the students themselves in their own words and pictures. This dedicated teacher with the financial help of her friends published the book with the title “Lethaakaasalu” which means Tender Skies(each kid a sky on their own)
As she succeeded in her effort with her first experiment, all the teachers of other schools started inquiring about this concept. She taught them and also started writing on this subject to the magazine “Naveena Vidya”. She gives her self assessment as a successful person implementing this method.
 A dedicated and devoted teacher Ms Vijayabhanu Kote not only takes teaching as her profession or livelihood, but it as the mission of her life. With the help of her friends , Chairman Zillaparishad , her colleagues and Head Master and mentor Mr. Devineni Madhusudhana Rao , the man who adopted her school , she does a lot to the development of the school. Wherever she goes there’s a lot of progress in that school by all means. She takes up the responsibility of constructing boundary walls, and pooling up computers, furniture, and sports material and a lot more to the school in which she works. She had been working in the MPPSPH WADA school and now she is working in the MPUP KH WADA schools in Payakaraopeta. She says that this method of learning makes a student to prosper throughout his lifelong learning process and they will turn into a self fulfilled individual. They become social conscious and realize their responsibility as good citizens. Her students conduct many awareness and social programs too. Her achievements won her great applause that she was invited to present a paper on her experiments in heutagogy to Finland. She successfully presented her paper “Heutogogy for primary school children and triangle concept” in the Global symposium conducted by council for creative education, Finland , in Tampere University in November 2017. More than sixty countries attended this symposium from all over the world. The same paper was simultaneously selected for TECH Global symposium and she presented her paper in NOVOTEL, Vizag in December 2017.  Presently Ms Vijayabhanu is working with Dr. Stewart Hase and his team in preparing the hand book for teachers on Heutagogy. She says it’s a grand privilege to work with the founder of ‘gogy’.
  All her dreams are about the children and their progress. She not only dreams but makes them true and with her nearly almost two decades of service outstands as a devoted teacher and a loving human being the whole town cherishes her being with them and with pride they own her. How nice it would be if at least few of our teachers work with such dedication and then our schools would be wonderlands of learning.
………………………………………………………………….jagaddhatri ,                                                                        Bilingual writer, translator, critic and columnist . dhaathri.dhaathri9@gmail.com

Friday, April 20, 2018


అందమైన మరణం
అదొక చిత్ర విచిత్ర జగత్తు. అందు ఒక తారా నివహం. ఆ తళుక్కుమనే తారల సౌందర్యాలే మనకి ఆరాధ్యం. అలాంటి అందమైన ఒక తార శ్రీదేవి అందంగా రాలిపోయిన ఒక ప్రేమ నక్షత్రం. ముసలితనపు అడుగుల సడి ముంగిట వినీ వినబడక ముందే తామే ఎదురేగి మరీ మృత్యువు ఒడిలో ఒదిగిపోయిన అందమైన తారలు కొందరు. ఆనాటి కాలం లో మధుబాల, మార్లిన్ మన్రో వంటి వారు ఈ అందంగా ఉండాలన్న ఆకాంక్షతో , కాదు అత్యాశ తో తమ దేహాలను హింసించుకుంటే, వారికి మరో వారసురాలు శ్రీదేవి నేటి నిజం. ఏనోరెక్సియ (anorexia) ఒక భయంకరమైన మానసిక రోగం. ఎప్పుడూ అందంగానే కనబడాలనే తపన తో తిండి మానేయడం. శరీరాన్ని కొలతలతో బంధించి ఉంచాలనే తాపత్రయం. దీని పాలన బడిన వారిలో మరి కొందరు ఉన్నారు కరీనా కపూర్, నయన తార లాంటి వారు అయితే శృతి మించి రాగన పడుతున్న దశలో వారు జాగ్రత్త పడ్డారు. ప్రకృతి ఇచ్చిన దేహాన్ని సంరక్షించుకొనాలి నిజమే , కొంత మెరుగులు దిద్దుకోనూ వచ్చు , కాపాడుకోవాలనే ఆశ ఉండనూ వచ్చు అందుకు అసహజమైన శస్త్ర చికిత్సలు, మాత్రలూ ,మందులూ అవసరమా? ఆలోచించుకోవాల్సినదే కాదు అలాంటి భావన ఒక మానసిక వైకల్యమని గ్రహించాలి.
ముసలితనపు ముడుతలు పడిన మొహాలని ప్రజలకి చూపించo అని ఎంత బలంగా అనుకున్నారో కానీ అలాంటి హఠాత్తు అకాల మరణాలే పొందారు శోభన్ బాబు, శ్రీదేవి. ఇక దివ్యభారతి లాంటి యువతులు ఆత్మ హత్యలతో ఉసురులు తీసుకున్నారు , సౌందర్య లాంటి దివ్య సౌందర్యం అగ్నిపాలైంది. అంతటి రాశి పోసిన సౌందర్యం బొగ్గు ముక్క లా మిగిలితే గుండెలవిసిపోయాయి చూడడానికి.
ఉన్నది చాలక ఇంకా అందంగా కనబడాలనే , ఎల్లప్పటికీ సౌందర్య రాశి గానే మిగలాలనే తాపత్రయం శ్రీదేవిని 29 సార్లు కాస్మెటిక్ సర్జరీలు చేసుకునేలా చేసింది. అయితే దేహం పై ఇన్ని కోతలు పడుతుంటే , ఇన్ని మందుల  ప్రభావం పడుతుంటే గుండె అనేది ఒకటున్నదనీ వీటన్నిటి దుష్ప్రభావం ఆ ముఖ్యమైన అంగం పై పడితే గుండెకి రక్తపు సరఫరా ఆగిపోతుందని తెలుసుకోలేక పోవడం దురదృష్టమే కాదు అమాయకత్వం.
50 ఏళ్ల సినీ జీవితం ఏంటీ 54 యేళ్ళ మనిషికి ,ఔను కదూ నాలుగేళ్ల కన్నా ముందే చంటి పిల్లగానే సినీ జీవితం లో అడుగు పెట్టిన బాల కార్మికురాలు శ్రీదేవి. మంచి బాల నటిగా పేరు తెచ్చుకుని అనురాగాలు సినిమాలో ఆరంగేట్రం చేసి , పదహారేళ్ళ వయసుతో పదిహేనేళ్ళకే అందరి మనసుల్లోనూ స్థిర స్థానం సంపాదించేసుకుంది. హింది సినిమా రంగం లోకి అడుగుపెట్టబోతున్న తరుణం లోనే ఆమెకు అందాలను దిద్ది తీర్చుకోవాలనిపించినట్టుంది, ముక్కుకి ఆపరేషన్ చేయించుకుంది. అది మొదలు ఇప్పటి వరకు ముక్కు , మొహం, వక్షోజాలుకి , పెదాలకి ఇలా 29 కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంది. ఆఖరి క్షణం వరకూ అందంగానే మెరిసి ఒక్క సారి తెగి పడిన రిక్కలా మాయమైపోయింది అంతటి సౌందర్యం. పూల రెక్కలూ కొన్ని తేనె చుక్కలూ రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో అని ఆమె గురించి ఓ సినీరచయిత గేయం ఆమెకి సరిగా సరి పోయేట్టే ఉంది. పూల రెక్కలైనా తేనె చుక్కలైనా ఆ నిలువెత్తు అయిదడుగుల ఆరంగులాల శరీరం ఇప్పుడొక గుప్పెడు బూడిద అయిపోయింది.
ఆమె మరణ వార్త తెలియ గానే నాకు చండీదాస్ అనుక్షణికం లోని స్వప్న రాగలీన గుర్తొచ్చింది. నిజమే కదూ అమెదీ అలాంటి అందమే, అందమైన మరణమే. స్వప్న రాగలీనకి శ్రీదేవికి పోలికలు ఉన్నాయి అనిపించింది. స్వప్న రాగలీన  కూడా అలాగే అందంగానే, అకాలంగానే మరణిస్తుంది. చండీదాస్ మృత్యువుని ఎక్కువగా గ్లోరిఫై చేస్తాడు అన్నారు ఈ మధ్య ఒక రచయిత. కానీ మృత్యువు కూడా అస్తిత్వం లో భాగమే గా అది ఆకాలంగా వచ్చే అవకాశాలు ఎప్పుడూ ఉన్నాయి గా అని తలిస్తే కన్నీళ్ళ పర్యంతమౌతుంది. నిజానికి అంత అనంత సౌందర్య తాత్వికతనూ, సౌందర్య అంతాన్నీ అర్థం చేసుకున్నారు కనుకనే ఒక టాల్ స్టాయ్ , ఒక చండీ దాస్ లాంటివారు మరణాన్ని మర్యాదతో చిత్రించారా అనిపిస్తుంది.
ఆమె దేహ సౌందర్యం గురించి మాత్రమే మనకి అవసరం ఆమె కూడా అంతా వరకే మనకి దర్శింప జేసింది. ఆమె అంతరంగ సౌందర్యం, ఆమె అనతర్మధనం మనం ఎరగo. మన ఊహా గానాలే తప్ప ఆమె అంతర్గత జీవితం మనకి తెలియదు. ఎందరో ఇలాంటి వారు అందమైన తమ నవ్వుల వెనుక జీవితపు అగ్ని గోళాలను మరుగు పరుస్తారు. శ్రీదేవి గురించి విచారం కలగని వారెవరూ ఉండరు. అయితే ఆమె కేవలం ఒక నటి , తన జీవితం కోసం, జీవికగా నటనను స్వీకరించిన ఒక కళాకారిణి. అంతకు మించి ఆమె సమాజానికి చేసిన , సమాజం మరిచిపోలేని కార్యక్రమo ఏదీ లేదు. అద్భుతమైన కొన్ని పాత్రలకు జీవం పోసిన మంచి నటి.
ఆమె నటనలో ఒక ఈజ్ ఉండేది. నటన లా అనిపించకుండా సహజంగానే ఆమె తత్వమే అంత అనిపించేది. అందుకే అమెను మరిచి పోవడం కష్టం, మరువరానిది కూడా. చిరస్మరణీయంగా మన అందరి హృదయాల్లో నిలిచి వెలిగే కార్తీక దీపం శ్రీదేవి. వ్యక్తిగతమైన జీవితం ఎలాంటిది అయినప్పటికీ అది ఆమె నటనా జీవితాన్ని ఎక్కడా ఆటంక పరచనివ్వలేదు. ఆ విధంగా కూడా ఆమె పెద్ద నటి. మహానటి అని , ఆమెకి దాదాభాయి ఫాల్కె అవార్డ్, భారత రత్న ఇవ్వాలని అనడం మాత్రం కొంత అతిశయోక్తిగానే భావిస్తాను నేను. ఎవరిని ఎంతవరకు వారికి సమాజం లో స్థానం ఇవ్వాలో కొంచం ఉద్విగ్న పూరితమైన మన తెలుగు వారికి తెలియదనే చెప్పాలి. ఆమె పేరిట ఏదైనా పురస్కారాన్ని స్థాపించి ఇవ్వవచ్చును ఇస్తారనే అనుకుంటున్నాను.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఒక అపూర్వ కళాకారిణిని గురించి ఇలా నివాళి రాయాల్సి వస్తోన్నందుకు మనసంతా చేదుగా ఉంది. అనివార్యం మరణమే కాదు ధు:ఖం కూడా కదా.
ఏది ఏమైనా ఒక అందమైన నక్షత్రం మృత్యు కృష్ణ బిలం లోకి హఠాత్తుగా రాలిపోయిందన్నది కాదనలేని సత్యం.
శ్రీదేవి ఒక అందమైన విషాదం , ఒక అకాల అందమైన మరణం!!!  1/3/2018 గురువారం 2.1 పి. ఏం .


నా కోసం తను  

“ ఇంద ఈ జూస్ తాగు ప్లీజ్” ఆమె చేతిలో గ్లాసు పెట్టబోయాడు. ముఖం తిప్పేసుకుంది .
“ఏంటి ధీరూ ! ఇది ఏమైంది నీకు ?
“ ఏమీ కాలేదు “ నిర్లిప్తమైన  జవాబు
“ఎందుకిలా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు ? ఏమి లాభం చెప్పు?” అనునయంగా అన్నాడు
సీలింగ్ వైపు అభావంగా చూస్తూ ఉండిపోయింది.
“ నేనొచ్చి రెండు గంటలైంది  నువ్వసలు నాతో మాటాడనే లేదు “ నిష్టూరంగా అన్నాడు
“ నేను నిన్ను  రమ్మనలేదు” మళ్ళీ అదే నిర్లిప్తత స్వరం లో.
“ ధీరూ! ఆమె దగ్గరగా నిలబడి ఆమె తలని గుండెలకి అద్దుకున్నాడు.
“ నిన్నూ , సముద్రాన్నీ ఇలా నిశ్శబ్దంగా చూడలేను రా”
“ సముద్రం ఎప్పుడూ నిశ్శబ్దించదు, ఎవరు విన్నా లేకున్నా దాని గోల దానిదే”
“ మరి నువ్వేందుకు ఇలా మౌనంగా”
“ ఏమీ చేయలేక ....”
“ ఆత్మ వంచన చేసుకోలేక...” ఆమె గొంతు లోని తీవ్రతకి అదిరి పడింది అతని హృది. ఎప్పుడూ ధీరు లోని ఇంత ఆగ్రహం చూడలేదు తను. అక్షరమే లోకమనుకుని, ప్రేమే సర్వస్వమనుకుని జీవించే ఈ నా ప్రేమమూర్తికి ఇంత కోపమా ? ఆశ్చర్యపడింది అతని మనసు.
“ ఏది ఏమైనా ఆరోగ్యం పాడుచేసుకోవడం మంచిది కాదు రా”
“నాకు తెలియదా ... ఎందుకో ఎంత ప్రయత్నించినా సర్దుకోలేక పోతున్నా”
జూస్ గ్లాస్ తీసుకుని గటగటా తాగేసింది.
“సారీ నిన్ను బాధించినందుకు ... ఎందుకు పని వదిలేసి వచ్చావు. అసలే ఈ మధ్య మంచి డైరెక్టర్ దగ్గర అవకాశమొచ్చింది కదా” చాలా సౌమ్యంగా అడిగింది. అదే ధీరు లో ఉన్న గొప్పతనం. ఎంత బాధనైనా ఓర్చుకుని మళ్ళీ మామూలుగా మారిపోతుంది. తన కోపాన్నీ, ధు:ఖాన్నీ అన్నిటిని మది సంద్రం లో నిక్షిప్తం  చేసేస్తుంది. బహుశా ఆదేనేమో ఆమె అనారోగ్యానికి కారణం.
“ నువ్వు రెండు రోజులు ఫోన్ తీయక పోయేసరికి భయం వేసింది రా” చిన్న పిల్లాడిలా ఆమె పక్కలో చేరి పలవరించాడు
“ ఏమీ లేదులే బాలూ, ఎందుకో మాటాడాలనిపించలేదు ఎవ్వరితోనూ, చివరికి నాతో నేను కూడా మౌనంగానే ఉందామనిపించింది”
ఒకోసారి అలా అనిపించడం సహజమే కానీ నాతో కూడా ...కనీసం ఒక్క మెసేజ్” వేడికోలు అతని స్వరం లో
మౌనంగా నవ్వింది. కానీ వీడని ఆమె భృకుటి ముడి ఇంకా ఆమె మనసు ప్రశాంతంగా లేదని చెప్పకనే చెపుతోంది.
“ నువ్వు ఫోన్ తీయక  పోతే భయమేసి , లైబ్రెరీ కూడా కాల్ చేశా. రాలేదన్నారు”
“సరే , సరే ఇంకెప్పుడూ ఇలా భయ పెట్టనులే, సాయంకాలం నీ సముద్రాన్ని చూదువుగాని వెళ్దాం” నీరసంగా నవ్వుతూ లేవ బోయింది.
“ఎక్కడికమ్మాయ్ ?” ఆప్యాయంగా అడ్డుకున్నాడు
వంట చేయడానికి అని  కుడి చేయి పెదాల దగ్గర పెట్టి సైగ చేసింది.
“చాలు చాల్లే ఇప్పుడేమీ చేయక్కర్లేదు నేను చేసేసి పెట్టా ఇందాకే , తమరు దయతల్చి తిని పెడితే ధన్యులమ్”
“ ఓహో మీ రాయలసీమ రుచులు నాకు చూపించాలనా ?”
“ఏదో మా ప్రయత్నం మాది ..తమకి నచ్చాలి గా “
“నీ చేత్తో విషం పెట్టినా బాగుంటుంది నీ చేత్తో తినే ప్రాప్తముండోద్దూ..” ఆత్మీయంగా అతన్నే చూస్తూ అంది
“అబ్బో చాలా దూరం వెళ్లిపోయావు గానీ ...అంటే నీ ఉద్దేశం నా వంట విషమనా ...” నవ్వించాడు ఆమెని
..........
“హమ్మయ్యా ...అటు సూర్యా రావుగారూ ఇటు మా ధీరు గారూ ఇద్దరూ కొంచం చల్ల బడ్డారు...” నిట్టూరుస్తూ ఇసికలో కూల బడ్డాడు ఆమె పక్కన 
పల్చగా నవ్వి చీర చెంగుతో అతని నుదుటి చెమట అద్దింది.
“ ఇప్పుడు చెప్పు ఎందుకంత సీరియస్ ...”
ఎగురుతోన్న ఆమె జుట్టు సవరించాడు . అతని ఆత్మీయ స్పర్శ ఆమెని నిలవనీయలేదు.
అలాగే అతని చేయి పట్టుకుని నుదుటికి తాకించుకుని కళ్ళు మూసుకుని ఉండిపోయింది కాసేపు.
“ సాహిత్యమంటే నాకు ప్రాణమని తెలుసుగా ...నేను అనుకునేదాన్ని అక్షరాలను ప్రేమించే వారు అందరూ చాలా స్వచ్ఛంగా ఉంటారని ....” నెమ్మదిగా ఆమె వేదనకి మాటల రూపం ఇస్తోంటే ఆమె చెయ్యి పట్టుకుని వింటున్నాడు
“ ఈ హిపోక్రిసీ చూస్తుంటే ముందు కోపం వచ్చినా రాను రాను భయం వేస్తోంది బాలూ... మన సాహిత్యం మన వాళ్ళు ఎక్కడికి తీసుకుపోతున్నారు. సరి అయిన విమర్శ రాయకూడదు. అన్నీ వాళ్ళు ఏమి రాస్తే దాన్ని మెచ్చుకోవాలే తప్ప ఏమాత్రం సరి చేయకూడదు. ఇంత అహం మన పూర్వపు రచయితల్లో లేవు. అవార్డుల కోసం పైరవీలు. ఇవన్నీ చూస్తుంటే అసలు....” ఆవేశంతో ఆగిపోయింది
“ నీ ఆరోగ్యానికి ఒక సూత్రం చెప్పనా ...ఈ రచయితలనీ రచనలని పట్టించుకోకు...”
“ అలా అని ఎలా ఉరుకుంటామ్ ...నిజంగా బాగా రాస్తున్న వాళ్లకి అన్యాయం జరుగుతోంది...కులం , వర్గం ప్రాంతం ఇలా అన్నిటి పేరునా అన్యాయమే.... మొన్నోక సభలో ఒక పెద్ద రచయిత అంటున్నారు అతన్ని ఫలానా పురస్కార గ్రహీత అని ఎవరో పెద్దాయన ప్రస్తావిస్తే వద్దు మహాప్రభో అదో పెద్ద తిట్టు అలా అనకండి అని. అంటే జరుగుతున్నదంతా అందరికీ తెలుసు .. అసలింత మానిపులేట్ చేసి పొందే అవార్డులను ఎలా ఆత్మ గౌరవం లేకుండా తీసుకుంటారు. పైగా వీళ్ళకి పెద్ద పెద్ద వాళ్ల అండ కాపలా. అసహ్యం వేస్తోంది. అసలు అవార్డులు ఎవరికోస్తాయో ముందరే ఫిక్స్ అయిపోతుంటే... ఛీఛీ ...అందుకే మన తెలుగు వాళ్ళని గేలి చేస్తున్నారు మిగిలిన భాషల వాళ్ళు. మీకు సమీక్షే తప్ప విమర్శ లేదుగా అంటూ, ఆ సమీక్ష కూడా అనుకూలంగానే రాయాలి సుమా ”
“ ఈ మారని మనుషుల కోసం ..నువ్వు ఇంతలా చలించిపోవడం మంచిది కాదు. నేను అందుకే చాలా దూరంగా ఉంటున్నాను.” అనునయంగా ఆమె తల నిమిరాడు
“ నిజం రా.. నేను అందుకే చాలా దూరమైపోయాను. జీవితాలను ఫణంగా పెట్టి ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళం ....ఇప్పుడు ఈ బోలుతనాన్ని భరించడం కష్టంగా ఉంది.. నీకన్నా ఎక్కువగా చలించిపోయాను ఒకనాడు ... కానీ ... వీటిలో మునిగి మనసు ఆరోగ్యం పాడు చేసుకోవడం కన్నా మిగిలేది ఏమీ లేదు.. పైగా ఈ మనుషులని మార్చడం కష్టం ...అందుకే వదిలేశా ...”
“పిచ్చిపిల్లా ఇలాంటి అవకాశవాదుల గురించి ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకుంటున్నావా? వదిలేయ్ ...ప్రతి రచయితా ముందు తన సాహిత్యం లోని శక్తి కన్నా తనని కాపు కాచి ప్రమోట్ చేసే వాళ్ళని ముందుగా సర్ది పెట్టుకుని అప్పుడు ఏదో రాస్తున్నాడు. తాను రాసిన దాన్ని వీలైనంత గొప్పగా ప్రచారం చేసేవారినే తన గురించి రాసేలా చేసుకుంటున్నాడు. ఇది ఇప్పుడు సాధారణమైన విషయమైపోయింది. అందుకే విలువ ఉన్న రచయితలు సైతం ...వీటన్నిటికీ దూరంగా అజ్ఞాతంగా ఉండి పోతున్నారు. మేటి రచయితలు మన సాహిత్యానికి గర్వ కారకులైన వారే ఒకోసారి ఈ వత్తిళ్ళకి లొంగిపోక తప్పడం లేదు అని వాపోతున్నారు. ఈరోజు సాహిత్యం అంటే అవకాశవాదం .... మళ్ళీ మన సాహిత్యానికి మంచి రోజులోస్తాయి అని కూడా చెప్పలేని పరిస్థితి లో ఉన్నాం ...” దీర్ఘంగా నిట్టూర్చాడు.
“ ఏమీ చేయలేమా ....”
“ చేయలేమనే చెప్పాలి ... అందరికీ తెలిసినా బయటికి ఎవరూ చెప్పరు... మనసు విప్పి మనతో మాటాడిన వారే అక్షరంగా ఒక్క ముక్క రాయరు ...పైగా పోనీ లేద్దురూ మనకెందుకు అంటూ వాళ్లనే సమర్ధించి ఉరుకుంటున్నారు... ఇలాంటి పరిస్థితిలో ... మనం మాత్రం...”
“ తాను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు ఇచ్చేయగల నా బాలు యే నా ఇలా మాటాడేది?” ఆమె స్వరం లో కలవరం
“ ఇక్కడ జరుగుతున్న ఈ బోలుతనపు విషయాలకి సిద్ధాంతాలను ఎందుకు ఆపాదించడం వీళ్లదంతా ఒకే సిద్ధాంతం అవకాశవాదం అంతే. సత్యం కోసం సమాజం లో సిద్ధాంతాలకోసం పోరాడిన వాళ్ళూ , సాహిత్యాన్ని సమాజాన్ని మధించిన వాళ్ళూ సద్విమర్శ చేసేవాళ్లూ ఇప్పుడు లేరు. ఉన్న కొద్దిమందీ నోళ్ళు విప్పరు. ఎందుకులే శతృత్వం అనుకుంటారు. అందుకే మిగిలిన భాషల వాళ్ళు మన సాహిత్యం లో విమర్శ లేదు అంటున్నారు. విమర్శ అంటే మన వాళ్ళకి తెలిసినది పొగడటమే. ఏమైనా రాసామా వెంటనే గొడవలు మొదలౌతాయి. సినిమాల్లో చూపిస్తారు చూడు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ల గానే పై మినిస్టర్ నుండి ఫోన్ వస్తుంది వాడిని వదిలేయ్ అని అలా అన్న మాట ...” నవ్వాడు
“ అలాగని ఎవ్వరూ ఏమీ చెప్పక పోతే ...”
“ ఎవ్వరూ చేప్పక్కర్లేదు రా విలువ ఉండే రచన ఎక్కడున్నా ఎలాగైనా కాలం లోనిలబడుతుంది. లేనిది ఎన్ని ప్రయత్నాలు చేసినా నిలబడదు. ఇది కాలం నిరూపించిన సత్యం. ఇలాంటి వాటిని గురించి బాధ  పడకూడదు.”
“ నిజమేలే ... నిన్ననే ఒక చిన్నారి పాత్రికేయ స్నేహితుడు అంటున్నాడు , నిజమైన ఏ రాతలూ రాయడానికి వీలు కానీ ఉద్యోగాలు , అందుకే అన్నిటికీ దూరంగా మానసికంగా తాత్వికతను వంటబట్టించుకుంటున్నాను అని. నిజమే సత్యాలను రాయనివ్వని పత్రికలు ... ఉద్యోగాల కోసం వాళ్ళు ఏమి చెపితే అదే రాయాల్సిన పరిస్థితులు...నిజంగా నేటి యువతరం పాత్రికేయుల్లో కూడా ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ... నిన్న ఆ అబ్బాయి అంటుంటే బాధేసింది.”
“సరే గానీ ఇక నువ్వు ఈ విషయాలను ఆలోచించడం మానేసేయ్... అనవసరంగా ఆరోగ్యానికి తెచ్చుకోకు. ఒక్కటి గుర్తుంచుకో శక్తివంతమైన సాహిత్యానికి ఎవరి అండదండలూ అక్కర్లేదు ....శక్తి హీనమైనది ఎన్ని కంచెలు కట్టినా నిలబడదు. ఇక ఆలోచించడం మానేసేయ్. ఈ ఊబిలో దిగకు. నువ్వు చేయాల్సిన మంచి పనులు ఉన్నాయ్ అవి చూడు.”
“ అలాగేలే ... చాలా ఏళ్ల తర్వాత ఎందుకో చాలా కోపం వేదనా కలిగాయి ... నిన్ను కూడా డిస్టర్బ్ చేశా కదూ ..” మన్నించమన్నట్టుగా అతని చేతులు పట్టుకుంది.
“చా అదేం లేదు ... జీవితం లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడిన దానివి ఇలా ఈ మనుషుల గురించి చలించి పోవడం బాధగా ఉంది. అయినా సాహిత్యమూ, ప్రేమే గా నీ ఊపిరి , అందుకే ఇలా అయ్యావు...” ఆత్మీయంగా అన్నాడు
“కొన్నాళ్లు ఇవేమీ పట్టించుకోకుండా మంచి పుస్తకాలను చదువు ... డిసైర్ అండ్ లిబరేషన్ చదివి చెప్తాను అన్నావు. అవి చదువుకో ప్లీజ్ . నేను రేపు వెళ్ళాలి. వెళ్ళిరానా”
“ అలాగే రా మంచి పనిలో నిన్ను బాధించాను. సారీ
“అవునమ్మాయి నే వెళ్ళేది రేపు ఈరోజు కాదు ... ఇలాగే ఇక్కడ సముద్రాన్ని చూస్తూ గడిపేయడమేనా మమ్మల్ని తమ ప్రేమ సముద్రం లోనూ కాస్త ....”
“ హహహ ... నీలో ఏదో మెస్మరిసం ఉందిరా ... “
“ లేదురా అది నీలోని స్వచ్ఛత అంతే .... అసలు నీకో సత్యం బోధించాలని వచ్చాను శిష్యురాలా !”
“ అబ్బో ఏమిటది గురుజీ ?”
“ఆలోచించిన వారికే ఆవేదనలు ... అవకాశవాదులను అవి అంటవు .. కనుక కాబట్టీ మనసు మంచి సాహిత్యం పై లగ్నం చెయ్యి శిష్యురాలా ...అలాగే అప్పుడప్పుడూ ఈ దాసుని పై కూడా “ పకపకా నవ్వాడు
స్వచ్చమైన అతని నవ్వును చూస్తూ “జీవితాన్ని ఉద్యమం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం నిలిచిన ఈ తాత్వికునికి ఏమివ్వగలను .... నా ప్రాణం తప్ప”
“ ఇదిగో అమ్మాయి నువ్వేదో మళ్ళీ ఆలోచిస్తున్నావు ఇక నేను కూడా ప్రేమ పైరవీలు మొదలు పెట్టేస్తాను ఏమనుకున్నావో ... హాయిగా చదువు సంధ్యా రాని జాలరమ్మాయి అయితే హాయి ...”
“ఓహో ... అలాగా తప్పకుండా వెళ్ళి ట్రై చేస్కో నే వెళ్తున్నా ..” నవ్వుతూ లేచి అడుగులు వేసింది.
“ ఓయ్ ఇప్పటికిప్పుడంటే టైమ్ లేదు కానీ మళ్ళీ సారి వచ్చినప్పుడు ట్రై చేస్తాలే ప్రస్తుతానికి అమ్మాయిగారే...” లేచి ఆమె చేయి పట్టుకున్నాడు.
అసలేంటీ వీళ్లూ ప్రతిసారీ ఒక్క మాటైనా నా గురించి మాటాడుతారు కదా ఈరోజు ఈ జానారణ్యం గురించే మాటాడుకుని వెళ్లిపోతున్నారు హన్నా నన్ను పట్టించుకొనేలేదు ... అంటూ ఉవ్వెత్తున కెరటమై వచ్చి వాళ్ళను తడిపేసింది సముద్రం.
“ఇదిగో అమ్మాయ్ మీ సముద్రం కూడా నిన్ను చల్ల బరుస్తోంది చూడు” అంటూ ఆ తడి ఇసుకలో ఆమెని పొదివి పట్టుకుని నడిపించుకుని ...
సాహిత్యం సన్నిహిత్యం జతగా ... వారి అడుగు జాడలు తడి ఇసుకపై ....
..............................................................................................ప్రేమతో జగతి 11.39 ఏ ఏం 5/4/2018 గురువారం






A PASSIONATE FEMINIST KUPPILI PADMA

A heart filled with compassion, a pen flowing with powerful prose and a nature loving soul , yes its none other than the poet, writer Kuppili Padma the established feminist. Having earned applause even from the eminent critic Cheraa, Padma takes her own firm stand  in the Telugu literature. A writer well known in a few genres of writing from more than two decades constantly Padma has made her mark in Telugu literature. Hailing from a village Kuppili(North coastal Andhra, near Vizianangaram), after which her surname was taken Padma made a consistent contribution to modern Telugu literature as a short story writer, a poet, and a writer of columns and musings.

   Her famous column ‘Maidaanam’ which ran for about a decade in the daily Vaartha brought her a lot of accolades. Her commentary on the contemporary issues and lives of people in Andhra and Telangana , rural and urban, and much more issues were penned by her eminently in this column. Her translucent style of writing wins the hearts of the readers. She has to her credit six collections of short stories, three novels ,two collections of creative prose and a book of poesy recently released in the Vijayawada book festival(2018). Kuppili padma kathalu another one more collection of her short stories were recently published by the prestigious publishers Visalaandhra publications of Andhra Pradesh.
   Along with these she has an English translation of her stories ‘Salabhanjika and other stories’ which was edited by the senior translator duo Alladi Uma and Sridhar. From her first book Amruthavarshini(1993) (a collection of love letters), to her recent book Kuppili Padma kathalu and , poetry anthology ‘nemaleekalu poosina kaalam’ Padma has never left the consistency of writing. Her stories have been chosen to be translated into English and other languages. Some of her stories like Salabhanjika and others have been chosen to be translated and published in  the annual and periodical collected anthologies like Nurella kathaku vandanam , and Katha selection of best short stories from Telugu.

Speaking recently in her book release function in Vijayawada Padma says all her woman protagonists in her writings show the state of woman in the changing times. She religiously admits her women show the evolving modern woman in the twentieth century. Her stories deal with women in all phases of life and places of life. The concept of New Woman coined in the end of nineteenth century is evident in all her writings. She deals with the subjects of the working woman in the working places and also with the materialized relations between woman and man. The government must take the responsibility of providing equal opportunities and safety to women. And she continues saying ‘we as feminist writers do present in all our effervescence the problems of women for their notice. So she concludes ‘writers  are the communication between the governing institutions and public’.

A woman with a clear vision of hope and ambition Padma is an ardent feminist writer who demands nothing more but ‘ a woman her genuine space in the society’. As the eminent VIctorian Virginia Wolf demands “a room of one’s own” to a woman, Padma as a woman of letters of faith and hope in improving the social consciousness as a writer demands the respect for womanhood in all walks of life. Her letters and sentences are filled with aesthetic beauty and her sophisticated narration in her stories makes the readers completely read the story. Padma is not a writer of fantasy but reality in real terms. Her way of dealing with the women oriented subjects convince  the readers and makes them think objectively. A socially conscious writer, sailing in her paper boat of letters Padma is an asset to the modern Telugu literature. A woman with a sweet smile and gentle speech but resolute in her ideals and conviction Padma is the writer really in need of the hour. She has won many awards from many great institutions which include Tenneti Hemalatha best writer award and Chaso Sphoorthi award and recently she has another feather in her cap by winning the most prestigious Vasireddi Seethadevi award(2017).

A writer dealing with the urban woman problems Padma stands in a commendable position in the modern Telugu literature. Nature and human cannot be dealt as two separate entities says Padma in an interview , it is the fusion of both makes the genuine story, she faiths in. As an eminent feminist Kuppili Padma stands up to the mark in the modern Telugu fiction as she deals with all aspects like globalization too in her stories. Her short story collections “salabhanjika and other stories”, and “the Loss of innocence” prove her mettle in  dealing with the agitating life of the modern woman. A writer in local lingua franca but with global themes Padma is the woman writer of the century.  . I sincerely  wish most of her works should reach the international readers all around the globe. Working as a creative head in media channels Padma has the caliber and execution in movie and tele film making too. With words that befall like snow flowers as one of her creative muses have the name ‘manchupoola vaana’ (rain of snow blooms), Padma is unique in her style and putting forth her opinions in her writings. She does not fret and fume on men but tries to show him his place and a woman how to earn her space. She arises a hope in the women to look forward to better their conditions of life. She speaks with dignity and self confidence about any issues and shows ardent faith and hope in the grand future of women.
Telugu literary lovers look forward for much more valuable contribution from this woman of letters in the future.
                                                                 Jagaddhatri
                                                                Writer, translator and literary critic.






కారుణ్య మరణ కాక్ష – సుప్రీం నోట సలీం మాట
యుతనేసియా , కారుణ్య మరణాల పై సంచలనాత్మకమైన సుప్రీం కోర్టు తీర్పు నేడు వెలువడింది. ప్రపంచ దేశాల నైతిక అభిప్రాయమే రెండుగా చీలిపోయిన ఇటువంటి విషయాలపై నవలా రచన రచయితల నిగ్గుతేల్చే విషయం. నెదర్ లాండ్స్, మెక్సికో, స్విట్జర్లాండ్ , బెల్జియం, అమెరికా , జర్మనీ, ఐర్లాండ్, మొదలగు దేశాల చట్టాలు కారుణ్య మరణాలకు “పాసివ్” పద్ధతిలో అంగీకరిస్తున్నాయి,  అనగా భయంకరమైన వ్యాధితో , మృత్యు ముఖం లో ఉంటూ బయట నుంచి అందజేసే ప్రత్యేక వైద్య సదుపాయాల వలన ఇంకా జీవితులై ఉండే వ్యక్తుల అంగీకారంతో, ఈ వైద్య సదుపాయాలను తొలగించడమే ప్రస్తుతానికి మన దేశంలో సుప్రీం కోర్టు ఈ తాజా తీర్పు ద్వారా  అంగీకరిస్తున్న విషయం.
ఈ విధానానికే ఇంగ్లాండ్ , అస్స్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్, మొదలగు దేశాలలో చట్ట బద్దత లేదు. మన దేశాన్ని కుదిపేసిన  1977 లైంగిక అత్యాచార బాధితురాలు అరుణా షాన్బాగ్ ఆ ఏడాది నవంబర్ నుంచి మే 2015 దాకా ఈ కారుణ్య మరణాల విషయం పై స్పష్టత , చట్ట బద్ధత లేక పోవడం వలన నలభై రెండేళ్ల పాటు కోమా వంటి వెజెటేటివ్ స్టేట్ లో కేవలం పేరుకి మాత్రం జీవితురాలిగా ఉన్నది. 2009 లో ఆమె విషయమై పత్రికా రచయిత్రి పింకీ విరానీ ఒక రచన చేయడమేకాక, ఆమె కారుణ్య మరణాన్ని  అనుమతించమని,  లైఫ్ సపోర్ట్ పరికరాలను తొలగించే వీలును పరిగణించమని సుప్రేమ్ కోర్టుకి పిటీషన్ సమర్పించింది.
2011 లో సైతం,  పూర్తిగా నిస్సహాయ దశలో ఉన్న వ్యక్తులకు కారుణ్య మరణాల వీలును అనుమతిస్తూనే షాన్ బాగ్ విషయం లో ఈ వెసులుబాటుకు తిరస్కరించింది సుప్రీం కోర్టు. దేశంలో ఏ మేరకు,  ఏ స్థాయిలో ఈ మెర్సీ కిల్లింగ్ అనుమతించవచ్చు అని వైద్య వర్గాలు , న్యాయ కోవిదులు , ధార్మిక సంస్థలూ, సామాజిక మేధావులు చర్చిస్తూ ఉన్న కాలం లోనే  2013 లో నిమోనియా కి గురై 2015 లో మే 18 న గుండె పోటుతో అరుణా షాన్ బాగ్ కన్ను మూసింది. ఈ దేశ వ్యాప్త ఉదంతం,  ఏళ్ల తరబడి అమానవీయమైన ఈ పొడిగింపు,  మన తెలుగు రచయిత సలీంకు ఈ విషయం పై నవల రాసే ప్రేరణ కలిగించి ఉండవచ్చును. సమాజ పరిస్థితులపై ఎందుకు ఒక రచయిత నవల రాయాలో ఇది ఒక మంచి ఉదాహరణ.
 తెలుగు సాహిత్యం లో తొలిగా ఈ విషయాంశాన్ని చర్చించిన నవల కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత సలీం మరణకాంక్ష . ఈ నవల 2011 లోనే రాయబడింది , ప్రముఖ వారపత్రిక లో సీరియల్ గా వచ్చిన ఈ నవల తర్వాత పుస్తకంగా వెలువడింది. తన కొడుకు మస్క్యులర్ డిస్ట్రోఫీ తో పడుతున్న మరణ యాతన చూడలేక సరోజ అనే తల్లి తన కొడుక్కి  కారుణ్య మరణం ప్రసాదించమని కోర్టుకి అపీల్ చేసుకుంటుంది. కానీ అక్షర అనే లాయర్,  కారుణ్యమరణాలకు వ్యతిరేకంగా వాదించి కేసు గెలుస్తుంది. అయితే ప్రసాద్ మరణయాతన కళ్లారా చూసిన ఆమె తాను పొరపాటు చేశానని గ్రహిస్తుంది. రచయిత, ప్రసాద్ మరణాన్ని వర్ణించిన తీరు , ప్రత్యక్షంగా  చూసిన అక్షరలో ఎంత మార్పును తీసుకొస్తాయో  అలాగే చదివిన పాఠకుల్లోనూ కారుణ్య మరణాల పట్ల ఒక సహానుభూతిని, వాస్తవిక స్పృహను  కలిగిస్తాయి. రచయిత తన రచన ద్వారా సాధించిన ఈ  మానవ స్వభావ చిత్రణ నేడు సుప్రీం కోర్టు నోట ఆమోదయోగ్యమైన  తీర్పుగా వెలువడటం ముదావహం. మన తెలుగు రచయితలు ఇంత మెలకువతో,  క్రాంత దర్శిత్వoతో రచనలు వాస్తవ దృక్పథం తో  చేస్తున్నారని చెప్పడానికి ఇదొక సత్య నిదర్శనం.
ఇదే విషయం పై “గుజారిష్”(2010) లో సంజయ్ లీలా బన్సాలి సినిమాగా వచ్చినా అది ఒక గొప్ప వ్యక్తి జీవితం గురించి , పైగా అది “whose life is it anyway” (1981)అనే రంగస్థల నాటకాన్ని సినిమా గా తీసిన దాన్ని  హిందీలో బన్సాలి తనదైన గొప్ప చిత్రీకరణలో తీశారు. బ్రైన్ క్లార్క్ 1978 లో రాసి ప్రదర్శించిన ఈ నాటకం జాన్ బొధామ్ దర్శకత్వం లో రిచర్డ్ డ్రెయ్ఫుస్స్ (అకాడెమీ అవార్డ్ గ్రహీత ) ముఖ్య పాత్రగా చిత్రించబడింది.
 దిగువ మధ్య తరగతి జీవితాల్లో జరిగిన విషాదాన్ని చర్చించిన వాస్తవానికి అతి చేరువలోనున్న సలీం నవల మరణకాంక్ష ‘A DESIRE FOR DEATH’  పేరిట ఆంగ్లం లోకి అనువాదం కూడా అయింది. ఇది అంతర్జాలం లో గూగుల్ బుక్స్ లో కూడా లభ్యమౌతుంది. మన తెలుగు నవల భారతీయ,  అంతర్జాతీయాంశాలను  సకాలంలో చర్చించడం, ఆ విషయమే ఈరోజు సుప్రీం కోర్టు తీర్పు గా వెలువరించడం కవులు క్రాంత దర్శులు అని మరో మారు రుజువు చేస్తుంది. సలీం కేవలం మన తెలుగు రచయితే కాదు అంతర్జాతీయ స్థాయి రచయిత అని చెప్పేందుకు అతను రచించిన తొలి ముస్లిం నవల “వెండిమేఘం’(2003), నేడు ఈ మరణకాంక్ష (2011) సాహిత్య చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి అనడంలో సందేహం లేదు.
జగద్ధాత్రి (87122 93994)