Friday, December 9, 2011

పిలుపు

నువ్వెప్పుడూ నా మది లోనే ఉంటావు అన్నాడతను .... 






హలో ! ఎలా ఉన్నావు ? 
అతని పలకరింపులోని మాధుర్యానికి
గు౦డె ఝల్లుమంటుంది
ఎన్నో యుగాలుగా వేచి  ఉన్నట్టు
ఆ పిలుపు కోసం 
హృదయం రిక్కించి వింటాను 
సమాధానమివ్వాలనిపించదు
అతను ఆత్రంగా అలా అలా ప్రశ్నిస్తూ 
ఉంటే తవితీరక ఆమట్టునే వింటూ
ఉండాలనిపిస్తుంది
తన  జ్ఞాపకాలలో నేనున్నానన్న 
స్పృహ నాకు జీవం పోస్తుంది
అనాదిగా ఈ ప్రేమ కోసమే కదా
ఇన్ని సార్లు జన్మెత్తింది 
అసలు జీవించే ఉన్నానన్న 
ఉనికి కలిగేదీ ఈ  పిలుపు  తోనే కదా
దీనిని ప్రేమ అంటే..... 
నవ్వుతాడతను
అతని నవ్వు చూస్తే
నాకూ నవ్వొస్తుంది 
ఇద్దరం మనసు విప్పి 
చెప్పుకోము
మీకు గుర్తున్నందుకు 
ధన్యురాలిని అన్నాను  అల్లరిగా
నువ్వెప్పుడూ నా మదిలో ఉంటావు
కానీ నేను చెప్పను 
నువ్వు చెప్తావు అదే తేడా 
అంటాడతను మళ్ళీ నవ్వుతూ
ఆ నవ్వులోని ఆత్మీయపు  జల్లు 
పలకరింపులోని తీరని తృష్ణ 
నన్ను మరీ మరీ కదిలిస్తాయి
ఎందుకో ఏ ఒక్కసారైనా 
ఆ పిలుపు వినడానికి 
బ్రతికి ఉండాలనిపిస్తుంది
నా అనురాగాన్ని వినిపించానా
వెక్కిరిస్తాడని తెలుసు 
అందుకే మౌనంగా 
ప్రాప్తమున్నంత మేర 
అతని మాటలను 
గుండె పతకంలో
నవ రాత్నాల్లా  పొదుగు కుంటాను 
మళ్ళీ మరో పిలుపు కోసం 
అనునిత్యం ఎదురు చూస్తూ
మరి కొన్నాళ్లీ....
జీవితాన్ని పొడిగిద్దామని
కలిగిన నా దురాశకు
నిర్లిప్తంగా నవ్వుకుంటాను నాలో నేనే.....
............................................................ప్రేమతో ...జగతి 12.26 pm Friday 9/12/2011 (rams office) 







4 comments:

  1. ఆ నవ్వులోని ఆత్మీయపు జల్లు
    పలకరింపులోని తీరని తృష్ణ

    మీకు కూడా ఇది సొంతం అమ్మ
    అందుకే మీ కవితలు చదివితే మీతో మాట్లాడినట్టు ఉంటుంది
    మీతో మాట్లాడితే మీ కవితలు చదివినట్టు ఉంటుంది.
    మీరే కవిత చదివితే ...
    ఎప్పుడు వినలేదు గాని
    బహుశా ప్రేమ ల ఉంటుందేమో ??

    ReplyDelete
  2. అందుకే మౌనంగా
    ప్రాప్తమున్నంత మేర
    అతని మాటలను
    గుండె పతకంలో
    నవ రాత్నాల్లా పొదుగు కుంటాను....... నిజంగా మాటలు రావటం లేదమ్మా.. గుండెను పిండేసేలా ఉంది మీ కవిత.

    ReplyDelete
  3. జలతారు అ౦చు పీతా౦బర౦లా కృష్ణస్పర్ష లో తడిసిన మీ హృదయ౦లో౦చి తొణికిన భావనల చినుకులలో పునీతమౌతు౦ది ప్రప౦చ౦..

    ReplyDelete