ఈ రోజు కార్తీక పౌర్ణమి గుర్తుందా నీకు? అయితే ఏంటటా? అని క్వెస్చన్ మార్క్ మొహం పెట్టకండి . కోపమొస్తుంది. ఇది గో నీకు కూడా కోపమోస్తుందా అంటారేమో రాదా మరి...మనం చాలా సార్లు పున్నములు సముద్రం ఒడ్డున ఎలా గడిపామో మరిచి పోయారా? ఈ రోజు మీరు ఉంటె ఖచ్చితంగా బీచ్ కి వెళ్ళే వాళ్ళం. చల్లని వెన్నెల్లో మీరు నా ఒడి లో పడుకుని కవిత్వం చదువుతుంటే అబ్బ ! ఎంత హాయి ....అసలీ జగతి కి ప్రపంచం పై న స్పృహ ఎక్కడిదీ....నీ రసావిష్కరణంలో మునిగి నిండుగా ఆ మట్టునే ఆ ఆనందపు టంచు ల లోనే నా ఊపిరి ఆగి అలాగే ఆనందంలో నేను నేనుగా లేకుండా పోయే ఆ దివ్య క్షణాలు...మళ్ళీ ఎప్పుడో ఎన్నాళ్ళకు కుదురుతుందో మళ్ళీ. ఎన్ని పౌర్నములైనా నా కెందుకో కార్తీక పౌర్ణమి మార్గశిర పౌర్ణమి చాల ఇష్టం.నీకు తెలీదని కాదు...చలిలో పిచ్చి వాళ్ళలా మనం చంద్రోదయం చూస్తూ కనీసం ఉన్ని దుస్తులేవీ వేసుకోకుండా ఉన్న మనల్ని చూసి కొందరు నవ్వుకుంటే ...ఒకసారి గుర్తుందా ...నువ్వు నా వొళ్ళో పడుకుని ఉంటే పోలీసు వాడొక ఆఫీసర్ వచ్చి ఏంటండీ ఎవరు మీరు? అంటూ గద్దించాడు . నువ్వు నీ ఐడెంటిటి చూపించాక పాపం కొద్దిగా భయంతో కాస్త లేచి కూర్చోండి సర్...అసలే ఈ చోట మొన్న ఒక హత్య జరిగింది అందువల్ల ఏ జంట కనిపించినా జాగ్రత్తగా గమనించమని మాకు ఆర్డర్స్ అన్నాడు.
నిజమే కదూ అనిపించింది నాకు . నువ్వేమో ఊరుకోకుండా అల్లరి గా నేనూ అదే పని మీద ఈవిడని తేచ్చానండీ అంటూ ఆటపట్టించడం...అసలు నిన్నూ....ఏమి చేసినా పాపం లేదు అని నేను తిడుతుంటే
నవ్వుకుంటూ వెళ్లి పోయాడా ఆఫీసర్. అయినా ఆ అల్లరేంటి ? మరీ చంటి పిల్లాడిలా తన్నాలనిపిస్తుంది
అంత గంభీరంగా ఉండే నీలో ఇంత ఆల్లరి పిల్లాడు దాగున్నాడని ఎవరికీ తెలుసు. అందరికీ చెప్తానంటే
ఎంత కొంటెగా అంటావ్ "ఇద మరీ బాగుంది ఎప్పుడూ ధుమ ధుమ లాడుతూ ఉండాలా ఏంటి సీరియస్ కవి అంటే? వాడికీ ఓ ప్రేయసి ఓ ఆనందం ఉండవా ఏంటీ , ఓయ్ అమ్మాయీ ?"అంటూ కొంగు పట్టుకు లాగటం చూసి...ఆ స్టూడెంట్ కుర్రాళ్ళు ఎలా వెక్కిరించారు "అంకుల్ మహా జోరు మీదున్నాడ్రోయ్"..అంటూ
వాళ్ళకేమి తెలుసు ! ఎన్నేళ్ళ తర్వాత ఈ అరుదైన క్షణాలు లభించాయో మనకి ....చిన్న పిల్లలు అనుకుని నవ్వేసుకుననము ఇద్దరం. అసలు విషయం అడుగుదామనే మరిచి పోయాను ...తమరు మళ్ళీ పౌర్ణమి అనగా మార్గశిర పున్నమి కైనా వచ్చ్చేస్తారా ? నిన్న పత్రిక ఆఫీసుకి పోయి మనం ఇవ్వాల్సిన రచనలు ఇచ్చేసి వస్తుంటే తెన్నేటి పార్క్ లో మనం కూర్చునే బెంచీ దిగులుగా చూసింది నా వైపు .....
ఇంతకు ముందు పాతగా ఉన్న పార్క్ ఇప్పుడు చాలా బాగు చేసారు కానీ ఎందుకో అప్పుడు మనం వెళ్ళిన ఆపాత మాధుర్యమేదో లేనట్టనిపించింది....విచిత్రమేంటంటే మన పిచ్చి బెంచీ మాత్రం మనకోసం ఉంచేసారు అలాగే కొంచం రంగు వేసారులే ..ఎన్టీ అయ్యగారేమన్న లంచమిచ్చి ఆ బెంచీ ని పదిలంగా ఉంచారా ఏంటీ....ఏమో చేసినా చేస్తావ్ ...మీ ఆఫీసులో మనం తొలిసారిగా ..!!!..ఆ సోఫాని కొనేసి తేచ్చేయ్యలేదు ఆఫీసు ఆక్షన్లో ..ఛీ పో
అని విసుక్కుంటాను కానీ నాకూ ఇష్టమే ...
అయినా నీ వన్నీ ఇలాంటి పనులే .....ఏంటో నా రాత...మీరు తో మొదలెడతా నువ్వు అంటూ రాస్తా.....అయినా మరీ ప్రేమేక్కువైతే ఎవరైనా నువ్వు అంటారు కానీ నేనేంటో మరి ముద్దేక్కువైతే మీరు అంటా....
వెళ్ళిన పని అయ్యిపోయిందీ వచ్చేస్తానన్నావ్ అని ఎదురు చూసా ... ఇంతలో నీ కాల్ ..బయల్దేరి పోయానని చెప్తా వనుకున్నా ఇంకా అప్పుడే కాదూ అంటే ఏడు పోచ్చేసింది. ఏమో బాబూ నువ్వు నేను లేకుండా ఎప్పుడూ వెళ్లడం అలవాటు లేదేమో ఏంటో గా ఉంది ....దిగులుగా ఉంది.
కానీ నీ బాధ్యతలు తప్పవుగా అందుకే వెళ్ళాల్సి వచ్చిందని ...అక్కడి కి నేను రాలేను కనుకే నువ్వు నన్నొదిలి వెళ్ళావని తెలుసు .......అయినా కాల్ మాటాడి నంత సేపూ అన్నం తిన్నావా ? మందులేసుకున్నావా? ఈ ప్రశ్నావళి ఏంట్రా ...ఏదన్న చెప్పొచ్చుగా .....నువ్వు లేకుండా అన్నం సమంగా తినని నీకు తెలుసు , మందులు వేసుకోనని నీకు తెలుసు అయినా ఎందుకంత ఆత్రం ?
నిన్న సూరి గాడోచ్చాడు...మా అన్నగాడు కదా పాపం కొంచం అన్నం వండి పెట్టాడు ...ఇలాగైతే చస్తావే అని రెండు , ఆహా కాదు ఐదు తిట్లు తిట్టాడు .....దగ్గర కూర్చుని నేను రెండు ముద్దలు మింగాక అప్పుడు వెళ్ళాడు ....వాడు తినలేదు ....విశాల వచ్చేయ్యమందిట .....పాప అల్లుడు వచ్చేయ్యమన్నారట ....తప్పదు రా అన్నాడు ....సరే అన్నా.....ఇదంతా రాస్తున్నా గానీ నీకు చూపిస్తానా అమ్మో ...తిట్టవూ....అందుకే బుద్ధిగా
ఉన్నాను అని చెప్పేస్తా అయినా నా బుద్ది నీకు తెలియదా....
పాప రేపు సాయంకాలం ఫ్లయిట్ కెగా వెళ్ళేది ...నువ్వు ఎల్లుండి బయల్దేరడం అవుతుందా బహుశా మరో నలుగు రోజులన్న లేకుంటే బాగోదేమో....
నిజమేలే బాబు , తను ఒంటరి గా ఫీల్ అవుతారు కదా .....

నాకేమీ ఫర్వాలేదులే లే .....ఒంటరి తనం అలవాటేగా ....కాస్త మౌనం వీడి ఏదో పుస్తకం పట్టుకుని కూర్చోకుండా మాటలాడండి.....
నీ కోసం అన గౌరీ బెంగెట్టుకుంది...మా అయ్యగారు ఎప్పుడోస్తారంటూ ...మరి నీ ఫ్రెండ్ కదా .....హహహహః
నా నవ్వులోని దిగులు నీ హృదికి తెలుసు అని నాకూ తెలుసు ...నువ్వూ నన్ను వదిలి ఉండలేవు అయినా జీవితం....లో ..కొన్ని ముఖ్యమైన పనులున్టాయిగా.......నా గురించి దిగులు పడకు అనను దిగులు పడు బాగా .........................
ఎప్పుడెప్పుడోస్తావా అని ఎదురు చూస్తూ............... ప్రేమతో ....నీ ....."నేను" 3.55pm thursday 10/11/2011
its very touching expression..
ReplyDeletean excellent remeniscence poured through the heart and made into a letter of sigh and sense..
ఏలాంటి దాపరికం లేని అమలిన అద్బుత దాంపత్య రహస్యం సముద్రం లోతు వెన్నెల చల్లదనం ఇసుక మెత్తదనం మీఅనురగం లో రంగరించి రాసినట్లుంది మొత్తంగా మనసు పరచినట్లు మీకోసం లోకం మరచి నట్లు.....................
ReplyDeletehmm...emannaa adi thakkuve avuthundi..hrudi pondina bhavaghambeeryaaniki...
ReplyDeletekonnanthe...nisshabdam gaa anubhavinchaalsinde...
"naa nuvvu" ee padam gammathainadi...adi ichhe mattu jeevithakaalaaniki koodaa vadaladu...
Ammaa emani wraayaalo ardham kaavatam ledu naaku...
ReplyDeleteippatiki 5 times chadivaanu...
aa mood nundi inkaa baitaki raalekapotunnaanu.....
"Naa Nuvvu" anedi enta andamaina bhaavana.....daanni anubhavinchaale tappa varninchaali ante naa valla kaadu....really hats off to you....
ఏంటో నా రాత...మీరు తో మొదలెడతా నువ్వు అంటూ రాస్తా.....అయినా మరీ ప్రేమేక్కువైతే ఎవరైనా నువ్వు అంటారు కానీ నేనేంటో మరి ముద్దేక్కువైతే మీరు అంటా....
ReplyDeleteila secrets cheppeste ela..??
hmmmmmmmmmmmm!!!
ReplyDeleteilaantivi chadavaali anthe anipistundi
.............................................................................good
straight from the feelings core.....manasantaa muddai nee vennellanti vaakyallo tadichipoyindi darlingggg....
ReplyDelete