ఆ కిటికీ ....
మూడు దశాబ్దాల క్రితం...ఆనాడు
నవ వధువు నుదుట కళ్యాణ తిలకంలా
వెల్ల వేసిన ఆ చల్లని గూటికి
అలంకారంగా కళకళ లాడుతూ....ఆ కిటికీ
తొలిసారి ఆతని దర్శించిన
ఆమె సంతోష విప్పారిత నేత్రాల్లా
తెరుచుకున్న రెండు తలుపులు
రంగు వేసిన ఇనుప చువ్వల వెనుక
గువ్వ పిట్టలాంటి కన్నె మనసు వెన్నెల కలలు
అమాయకపు ఆ కన్నుల్లోంచి
గుండెల్లో పట్టం కట్టిన
ఆతని గూర్చిన ఎన్నో ఆశలు
మరి ఎంతో అనురాగం
ఆమె ఎదురు చూపులు
అతని దొంగ చూపుల మురిపాల నడుమ
ముచ్చటగా సాగిన తొలి ప్రేమ వైనాలు
మాట కలపలేని మధుర మౌనాలు
మనసు విప్పని మొమాటాలు
కాలపు కాటిన్యానికి చెదిరి దూరమయిన
చిరు హృదయాలు.....
జీవన ప్రవాహంలో తరలి పోతూ
రెండున్నర దశాబ్దాల తర్వాత
మళ్ళీ ఒకరికెదురుగా ఒకరు
అతనికి ఆమె...
గుండె గదిలో మూలకు విసిరేసిన
ఓ కాగితపు ఉండలాంటి జ్ఞాపకం
ఆమెకు అతను .....
పునరాగామించిన జీవన సాఫల్యం
అతని కరుణ రసార్ద్రతా స్వీక్రుతిలో
ఆమె ఆరాధనా సాంద్రతల నడుమ
రాగ రంజితమై సాగించాలని
నవ జీవన ప్రస్థానం
ఇరువురూ చేసుకున్న
పునఃప్రమాణం
ఆమె నిరీక్షణా రజతోత్సవ కానుక
అతని పునఃసాన్నిహిత్యం
ఈరోజు .....
తమ తొలివలపుల సుమధుర సాక్షి
ఆ కిటికీ ముందు
చేయి చేయిగా నిలబడి
జీవన సంధ్యవేళ ఒకరికి ఒకరై
ఆనందంగా వారిరువురూ
కాలంతో పోరాడి అలసి
వెళ్ళలేని గోడల నడుమ
జీవన శిసిరంలో
శిధిలమైనా.....
ముదిమి ముత్తయిదువులా
వారిరువురినీ ఆశీర్వదిస్తూ
సంధ్య కెంజాయలో
కుంకుమ కిరణంలా
వెలుగుతూ తృప్తిగా
ఆ కిటికీ.......!!!!
ఫలించిన మా ప్రేమకి
......... ప్రేమతో ...జగతి
lovely poem darling :-) touchingggg...
ReplyDeleteఆ కిటికీ.......!!!!
ReplyDeleteఫలించిన మా ప్రేమకి
నిజంగా ఆ కిటికీ ఎంతో పుణ్యం చేసుకుంది.మీ చేతిలో కవితగా ఒదిగిపోయింది.
bhaavijeevitamantaa bangaaramae.hrudayapoorvaka abhinandanalu.
ReplyDeletejagathike jananammaa.nindudanpatula soubhaagyasandarsanakosamai vachenelalo athidinai vastaanammaa.shubhaabhinandanalu.bangaru ramachary .0994939111o.
ReplyDeletechaalaa baagundi madam :)
ReplyDeletechaalaa bagundi madam :)
ReplyDeleteఎప్పుడన్నా ఎవ్వరైనా చదవరా ...
ReplyDeleteఇప్పుడే చదివాను మేడం గారు...
చాలా బాగుంది...
regards ...